Ustaad Bhagat Singh Day 13 Collections: భారీగా పతనమైన ఉస్తాద్ కలెక్షన్స్... పవన్ మూవీకి 13వ రోజు ఎంతంటే?

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నెనీ, వై రవిశంకర్‌ నిర్మించారు. శ్రీలీల, రాశీ ఖన్నాలు హీరోయిన్లుగా నటించారు. పార్ధిబన్, అశుతోష్ రాణా, నవాబ్ షా, గౌతమి, రాజీవ్ కనకాల, చమ్మక్ చంద్ర, పోసాని కృష్ణమురళి, రావు రమేశ్ తదితరులు ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా... థమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించారు. అయనంకా బోస్ సినిమాటోగ్రాఫర్‌గా, ఛోటా కే ప్రసాద్ ఎడిటర్‌గా వ్యవహరించారు. మార్చి 19న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలో ఉస్తాద్ బడ్జెట్ ఎంత? బ్రేక్ఈవెన్ టార్గెట్ ఎంత? 13వ రోజు ఈ సినిమా ఎన్ని కోట్లు రాబట్టింది? ఈ వివరాల్లోకి వెళితే..

Also Read
Dhurandhar 2 Vs Youth: ధురంధర్ 2 తుఫాన్‌ని ఎదిరించి 50 కోట్ల వసూళ్లు.. యూత్ కలెక్షన్స్ సంచలనం
Dhurandhar 2 Vs Youth: ధురంధర్ 2 తుఫాన్‌ని ఎదిరించి 50 కోట్ల వసూళ్లు.. యూత్ కలెక్షన్స్ సంచలనం

ఉస్తాద్ భగత్ సింగ్ బడ్జెట్
ఉస్తాద్ భగత్ సింగ్ బడ్జెట్ నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికం, ప్రొడక్షన్ కాస్ట్, ప్రమోషనల్ కార్యక్రమాలతో కలిపి ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి దాదాపు 150 కోట్ల రూపాయల బడ్జెట్ అయినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. భారీ హైప్‌కు తగినట్లుగానే ఉస్తాద్‌కు ఓ రేంజ్‌లో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. నైజాం థియేట్రికల్ రైట్స్ 50 కోట్ల రూపాయలు, ఆంధ్రా థియేట్రికల్ రైట్స్ 54 కోట్లు రూపాయలు, సీడెడ్‌ థియేట్రికల్ రైట్స్ 16 కోట్ల రూపాయలు చొప్పున 120 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేశాడు ఉస్తాద్.

Ustaad Bhagat Singh Day 13 Expected Box Office Collections Worldwide Pawan Kalyan s film collections dropped drastically

తెలుగేతర రాష్ట్రాల విషయానికి వస్తే.. కర్ణాటక థియేట్రికల్ రైట్స్ 5 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌ థియేట్రికల్ రైట్స్ 12 కోట్ల రూపాయల మేర బిజినెస్ చేశాయి. దాంతో ఉస్తాద్ భగత్ సింగ్‌కు వరల్డ్ వైడ్‌గా దాదాపు 137 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది అని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద 138 కోట్ల రూపాయల షేర్, 276 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉంది.

Recommended For You
అక్కడ అసభ్యంగా తాకుతూ... పబ్లిక్‌గా బాలయ్య హీరోయిన్‌కు వేధింపులు
అక్కడ అసభ్యంగా తాకుతూ... పబ్లిక్‌గా బాలయ్య హీరోయిన్‌కు వేధింపులు

ఉస్తాద్ భగత్ సింగ్ 12 రోజుల కలెక్షన్స్
ఉస్తాద్ భగత్ సింగ్‌కు తొలిరోజున ఇండియాలో 34.75 కోట్ల రూపాయలు, రెండో రోజున 9.00 కోట్ల రూపాయలు, మూడో రోజున 9.10 కోట్ల రూపాయలు, నాలుగో రోజున 7.50 కోట్ల రూపాయలు, ఐదో రోజున 2.50 కోట్ల రూపాయలు, ఆరో రోజున 1.75 కోట్ల రూపాయలు, ఏడో రోజున 1.35 కోట్ల రూపాయలు, ఎనిమిదో రోజున కోటి రూపాయలు, తొమ్మిదో రోజున 1.10 కోట్ల రూపాయలు, పదో రోజున 86 లక్షల రూపాయలు, పదకొండో రోజున 1.03 కోట్ల రూపాయలు, పన్నెండవ రోజున 35 లక్షల రూపాయలు వసూలు చేసింది. తద్వారా 12 రోజుల వరకు ఇండియాలో 70.36 కోట్ల రూపాయల నెట్.. 82.69 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు సాక్‌నిక్ వెల్లడించింది. ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో 75 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 6.60 కోట్ల రూపాయలు, తమిళనాడులో 1.15 కోట్ల రూపాయలు, రెస్టాఫ్ ఇండియాలో కోటి రూపాయలు వసూలు చేసింది.

You May Also Like
అలాంటి డ్రెస్‌లతో ఈవెంట్స్ చేస్తారా? యాంకర్ శ్రీముఖికి నటుడి చురకలు
అలాంటి డ్రెస్‌లతో ఈవెంట్స్ చేస్తారా? యాంకర్ శ్రీముఖికి నటుడి చురకలు

ఉస్తాద్ భగత్ సింగ్ ఓవర్సీస్ కలెక్షన్స్
ఉస్తాద్ భగత్ సింగ్‌కు ఓవర్సీస్‌లో ఇప్పటికే చేతులెత్తేసింది. ఓవర్సీస్‌ రైట్స్‌ను అడ్వాన్స్ బేస్ మీద 12 కోట్ల రూపాయలతో సొంతం చేసుకున్నారు డిస్ట్రిబ్యూటర్. దీని ప్రకారం ఓవర్సీస్‌లో ఉస్తాద్ బ్రేక్ఈవెన్ కావాలంటే 25 కోట్ల రూపాయలు రాబట్టాల్సి ఉంది. అయితే ఆదివారం తర్వాతి నుంచి నార్త్ అమెరికా సహా ప్రధాన ఓవర్సీస్ మార్కెట్‌లో పవన్ కళ్యాణ్ మూవీకి కలెక్షన్స్ పడిపోయాయి. ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం ఉస్తాద్ భగత్ సింగ్‌కు ఓవర్సీస్‌లో 12.20 కోట్ల రూపాయలు మాత్రమే వసూలై దాదాపు 13 కోట్ల రూపాయల నష్టాలను మిగిల్చింది. ఇండియాలో వచ్చిన గ్రాస్ + ఓవర్సీస్ కలెక్షన్స్ కలిపి ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ మూవీకి వరల్డ్ వైడ్‌గా 94.38 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టింది.

స్కూల్‌లో క్యాండిల్స్‌ అమ్మా.. 1200 కోసం అలాంటి కష్టం.. యాంకర్ రష్మి ఎమోషనల్
స్కూల్‌లో క్యాండిల్స్‌ అమ్మా.. 1200 కోసం అలాంటి కష్టం.. యాంకర్ రష్మి ఎమోషనల్

11 రోజుల వరకు నైజాంలో 15.82 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 6.92 కోట్ల రూపాయలు, ఉత్తరాంధ్రలో 6.40 కోట్ల రూపాయలు, ఈస్ట్ గోదావరిలో 5 కోట్ల రూపాయలు, వెస్ట్ గోదావరి 3.49 కోట్ల రూపాయలు, గుంటూరులో 4.08 కోట్ల రూపాయలు, కృష్ణాలో 3.92 కోట్ల రూపాయలు, నెల్లూరులో 1.73 కోట్ల రూపాయలు, కర్ణాటక + రెస్టాఫ్ ఇండియాలో 3.48 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌లో 6 కోట్ల రూపాయలు చొప్పున ఇప్పటి వరకు 56 కోట్ల రూపాయల షేర్ రాబట్టాడు ఉస్తాద్.

Mega158: నెవ్వర్ బిఫోర్ రోల్‌లో చిరంజీవి? మెగాస్టార్‌ కోసం బాబీ మాస్టర్ ప్లాన్!
Mega158: నెవ్వర్ బిఫోర్ రోల్‌లో చిరంజీవి? మెగాస్టార్‌ కోసం బాబీ మాస్టర్ ప్లాన్!

ఉస్తాద్ భగత్ సింగ్ 13వ రోజు వసూళ్ల అంచనా
సోమవారం నుంచి ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి కలెక్షన్స్ పడిపోయాయి. 12వ రోజైన సోమవారం అత్యంత దారుణంగా 35 లక్షల రూపాయల నెట్ మాత్రమే వసూలు చేసిందంటే ఉస్తాద్ పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చు. ఈ క్రమంలో ఉస్తాద్ 100 కోట్లు కూడా దాటుతుందా? లేదా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 13వ రోజు ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి మధ్యాహ్నం 2 గంటల వరకు ఇండియాలో 517 షోలకు గాను 16 శాతం మేర థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైనట్లు సాక్‌నిక్ నివేదించింది. కడపటి వార్తలు అందేసరికి పవన్ కళ్యాణ్ మూవీకి కేవలం 7 లక్షల రూపాయల నికర వసూళ్లు వచ్చాయి. 13వ రోజు ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి వరల్డ్ వైడ్‌గా కోటి రూపాయల కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఉస్తాద్ లాభాల్లోకి రావాలంటే 82 కోట్ల రూపాయల షేర్ రాబట్టాల్సి ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X