Ustaad Bhagat Singh Day 14 Collections: భారీ నష్టాల్లో ఉస్తాద్.. పవన్ కళ్యాణ్ 14 రోజుల్లో ఎంత రాబట్టాడంటే?

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ విడుదలై ఏప్రిల్ 1తో 14 రోజులు పూర్తి చేసుకోనుంది. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా.. ప్రేక్షకులను నిరాశపరిచింది. దీనికి తోడు ధురంధర్ 2 విధ్వంసం తాలూకా ప్రభావం గట్టిగా పడింది. ఈ నేపథ్యంలో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ఈవెన్ టార్గెట్ ఎంత? 14వ రోజు ఈ సినిమా ఎంత వసూలు చేయనుంది? ఈ వివరాల్లోకి వెళితే..

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నెనీ, వై రవిశంకర్‌‌లు సంయుక్తంగా ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాన్ని నిర్మించారు. శ్రీలీల, రాశీ ఖన్నాలు హీరోయిన్లుగా నటించారు. పార్ధిబన్, అశుతోష్ రాణా, నవాబ్ షా, గౌతమి, రాజీవ్ కనకాల, చమ్మక్ చంద్ర, పోసాని కృష్ణమురళి, రావు రమేశ్ తదితరులు ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా... థమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించారు. అయనంకా బోస్ సినిమాటోగ్రాఫర్‌గా, ఛోటా కే ప్రసాద్ ఎడిటర్‌గా వ్యవహరించారు. ఉగాది, రంజాన్ పండుగలను పురస్కరించుకుని మార్చి 19న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చింది.

Ustaad Bhagat Singh Day 14 Expected Box Office Collections Worldwide Pawan Kalyan s film ready to ends theatrical run

ఉస్తాద్ భగత్ సింగ్ బడ్జెట్
ఉస్తాద్ భగత్ సింగ్ బడ్జెట్ నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికం, ప్రొడక్షన్ కాస్ట్, ప్రమోషనల్ కార్యక్రమాలతో కలిపి ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి దాదాపు 150 కోట్ల రూపాయల బడ్జెట్ అయినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. భారీ హైప్‌కు తగినట్లుగానే ఉస్తాద్‌కు ఓ రేంజ్‌లో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. నైజాం థియేట్రికల్ రైట్స్ 50 కోట్ల రూపాయలు, ఆంధ్రా థియేట్రికల్ రైట్స్ 54 కోట్లు రూపాయలు, సీడెడ్‌ థియేట్రికల్ రైట్స్ 16 కోట్ల రూపాయలు చొప్పున 120 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేశాడు ఉస్తాద్.

తెలుగేతర రాష్ట్రాల విషయానికి వస్తే.. కర్ణాటక థియేట్రికల్ రైట్స్ 5 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌ థియేట్రికల్ రైట్స్ 12 కోట్ల రూపాయల మేర బిజినెస్ చేశాయి. దాంతో ఉస్తాద్ భగత్ సింగ్‌కు వరల్డ్ వైడ్‌గా దాదాపు 137 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది అని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద 138 కోట్ల రూపాయల షేర్, 276 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉంది.

ఉస్తాద్ భగత్ సింగ్ 13 రోజుల కలెక్షన్స్
ఉస్తాద్ భగత్ సింగ్‌కు తొలిరోజున ఇండియాలో 34.75 కోట్ల రూపాయలు, రెండో రోజున 9.00 కోట్ల రూపాయలు, మూడో రోజున 9.10 కోట్ల రూపాయలు, నాలుగో రోజున 7.50 కోట్ల రూపాయలు, ఐదో రోజున 2.50 కోట్ల రూపాయలు, ఆరో రోజున 1.75 కోట్ల రూపాయలు, ఏడో రోజున 1.35 కోట్ల రూపాయలు, ఎనిమిదో రోజున కోటి రూపాయలు, తొమ్మిదో రోజున 1.10 కోట్ల రూపాయలు, పదో రోజున 86 లక్షల రూపాయలు, పదకొండో రోజున 1.03 కోట్ల రూపాయలు, పన్నెండవ రోజున 35 లక్షల రూపాయలు, పదమూడో రోజున 35 లక్షల రూపాయలు వసూలు చేసింది. తద్వారా 13 రోజుల వరకు ఇండియాలో 70.70 కోట్ల రూపాయల నెట్.. 83.07 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు సాక్‌నిక్ వెల్లడించింది. ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో 75.20 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 6.63 కోట్ల రూపాయలు, తమిళనాడులో 1.20 కోట్ల రూపాయలు, రెస్టాఫ్ ఇండియాలో కోటి రూపాయలకు పైగా వసూలు చేసింది.

ఉస్తాద్ భగత్ సింగ్ ఓవర్సీస్ కలెక్షన్స్
ఓవర్సీస్‌లో ఇప్పటికే ఉస్తాద్ భగత్ సింగ్ థియేట్రికల్ రన్ ముగిసినట్లుగానే కనిపిస్తోంది. సోమ, మంగళవారాల్లో నార్త్ అమెరికాలో దారుణమైన కలెక్షన్స్ నమోదు చేసింది ఉస్తాద్. ధురంధర్ 2 ఇప్పటికీ తన హవా చూపిస్తుండగా యూత్, ఆడు 3, బ్యాండ్ మేళం సినిమాలు ఉస్తాద్ కంటే ముందున్నాయి. నార్త్ అమెరికాతో పాటు యూకే, యూరప్, ఆస్ట్రేలియా గల్ఫ్ దేశాలలో కలిపి ఉస్తాద్ భగత్ సింగ్‌కు ఓవర్సీస్‌లో ఇప్పటి వరకు 12.20 కోట్ల రూపాయలు మాత్రమే వసూలైంది. కనీసం అక్కడ బ్రేక్ఈవెన్ కూడా కాలేదు. శుక్రవారం నుంచి కొత్త సినిమాలు రానున్న నేపథ్యంలో ఉస్తాథ్ కథ ముగిసినట్లేనని విశ్లేషకులు చెబుతున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో ఉస్తాద్ కలెక్షన్స్
11 రోజుల వరకు నైజాంలో 15.93 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 6.97 కోట్ల రూపాయలు, ఉత్తరాంధ్రలో 6.42 కోట్ల రూపాయలు, ఈస్ట్ గోదావరిలో 5.02 కోట్ల రూపాయలు, వెస్ట్ గోదావరి 3.51 కోట్ల రూపాయలు, గుంటూరులో 4.10 కోట్ల రూపాయలు, కృష్ణాలో 3.94 కోట్ల రూపాయలు, నెల్లూరులో 1.74 కోట్ల రూపాయలు, కర్ణాటక + రెస్టాఫ్ ఇండియాలో 3.50 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌లో 6 కోట్ల రూపాయలు చొప్పున ఇప్పటి వరకు 56.32 కోట్ల రూపాయల షేర్ రాబట్టాడు ఉస్తాద్.

ఉస్తాద్ భగత్ సింగ్ 14వ రోజు వసూళ్ల అంచనా
రెండో వారం ముగుస్తుండగా ఉస్తాద్ భగత్ సింగ్ ఏమాత్రం కోలుకునే పరిస్ధితులు కనిపించడం లేదు. అర్బన్‌తో పాటు రూరల్ ఏరియాలలో పవన్ కళ్యాణ్ మూవీకి ఆదరణ లభించడం లేదు. శుక్రవారం నుంచి బైకర్, రాకాసతో పాటు చిన్న సినిమాలు పోటెత్తుతుండటంతో చాలా ఏరియాలలో ఉస్తాద్‌కు థియేటర్లను ఎత్తేసే పరిస్ధితులు కనిపిస్తున్నాయి. 14వ రోజు ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి మధ్యాహ్నం 2 గంటల వరకు ఇండియాలో 505 షోలకు గాను 16 శాతం మేర థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైనట్లు సాక్‌నిక్ నివేదించింది. ఇప్పటి వరకకు పవన్ కళ్యాణ్ మూవీకి కేవలం 7 లక్షల రూపాయల నికర వసూళ్లు మాత్రమే వచ్చాయి. 14వ రోజు ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి వరల్డ్ వైడ్‌గా 50 లక్షల రూపాయల కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఉస్తాద్ లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద మరో 81 కోట్ల రూపాయల షేర్ రాబట్టాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X