Ustaad Bhagat Singh Day 2 Collections: ఉస్తాద్ కలెక్షన్స్‌పై ధురంధర్ 2 దెబ్బ.. పవన్ మూవీకి ఎన్ని కోట్లంటే?

హరీశ్ శంకర్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాతలు నవీన్ యెర్నెనీ, వై రవిశంకర్‌లు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను నిర్మించారు. పవన్ సరసన రాశీ ఖన్నా, శ్రీలీలు హీరోయిన్లుగా నటించారు. పార్ధిబన్, అశుతోష్ రాణా, నవాబ్ షా, గౌతమి, రాజీవ్ కనకాల, చమ్మక్ చంద్ర, పోసాని కృష్ణమురళి, రావు రమేశ్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తుండగా.. థమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించారు. అయనంకా బోస్ సినిమాటోగ్రాఫర్‌గా, ఛోటా కే ప్రసాద్ ఎడిటర్‌గా వ్యవహరించారు. ఉగాది, రంజాన్ పండుగలను పురస్కరించుకుని మార్చి 19న ఉస్తాద్ భగత్ సింగ్ వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలో ఉస్తాద్ భగత్ సింగ్ బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ఈవెన్ టార్గెట్ ఎంత? రెండో రోజు పవన్ కళ్యాణ్ మూవీ ఎన్ని కోట్ల రూపాయలు రాబట్టిందో పరిశీలిస్తే..

ఉస్తాద్ భగత్ సింగ్ బడ్జెట్ అండ్ బిజినెస్
నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికం, ప్రొడక్షన్ కాస్ట్, ప్రమోషనల్ కార్యక్రమాలతో కలిపి ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి దాదాపు 150 కోట్ల రూపాయల బడ్జెట్ అయినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. భారీ హైప్‌కు తగినట్లుగానే ఉస్తాద్‌కు ఓ రేంజ్‌లో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. నైజాం థియేట్రికల్ రైట్స్ 50 కోట్ల రూపాయలు, ఆంధ్రా థియేట్రికల్ రైట్స్ 54 కోట్లు రూపాయలు, సీడెడ్‌ థియేట్రికల్ రైట్స్ 16 కోట్ల రూపాయలు, కర్ణాటక థియేట్రికల్ రైట్స్ 5 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌ థియేట్రికల్ రైట్స్ 12 కోట్ల రూపాయల మేర బిజినెస్ చేశాయి. దాంతో ఉస్తాద్ భగత్ సింగ్‌కు వరల్డ్ వైడ్‌గా దాదాపు 137 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది అని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. దాంతో పవన్ కళ్యాణ్ మూవీ లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద 140 కోట్ల రూపాయల షేర్.. 280 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టాల్సి ఉంటుంది విశ్లేషకులు విలువ కట్టారు.

Ustaad Bhagat Singh Day 2 Expected Box Office Collections Worldwide Pawan kalyan s film faces tough fight from dhurandhar 2

ఉస్తాద్ భగత్ సింగ్ తొలిరోజు కలెక్షన్స్
ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి తొలిరోజున ఇండియాలో 34.75 కోట్ల రూపాయలు నెట్.. 41 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు సాక్‌నిక్ నివేదించింది. నైజాంలో 7.4 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 3.9 కోట్ల రూపాయలు, ఉత్తరాంధ్రలో 4.1 కోట్ల రూపాయలు, గుంటూరులో 2.85 కోట్ల రూపాయలు, కృష్ణాలో 2.4 కోట్ల రూపాయలు, ఈస్ట్ గోదావరిలో 3.6 కోట్ల రూపాయలు, వెస్ట్ గోదావరిలో 2.5 కోట్ల రూపాయలు, నెల్లూరులో 95 లక్షల రూపాయలు, రెస్టాఫ్ ఇండియాలో 1.6 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌లో 2.4 కోట్ల రూపాయలు చొప్పున వరల్డ్ వైడ్‌గా తొలిరోజున 31.7 కోట్ల రూపాయల షేర్.. 50 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది ఉస్తాద్ భగత్ సింగ్.

ఉస్తాద్ భగత్ సింగ్ ఓవర్సీస్ కలెక్షన్స్
ఉస్తాత్ భగత్ సింగ్‌ నార్త్ అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్, ప్రీమియర్స్ + డే 1 కలెక్షన్స్ కలిపి ఇప్పటి వరకు 500K డాలర్లు (దాదాపు 4.66 కోట్ల రూపాయలు) వసూలు చేసినట్లు ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ వెల్లడించారు. యూకే, యూరప్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తదితర దేశాలలో కలిపి ఈ మొత్తం 5 కోట్ల రూపాయలకు పైమాటేనని విశ్లేషకులు చెబుతున్నారు.

ఉస్తాద్ భగత్ సింగ్ రెండో రోజు కలెక్షన్స్ అంచనా
ధురంధర్ 2 నుంచి గట్టి పోటీకి తోడు, మిక్స్‌డ్ టాక్ కారణంగా ఉస్తాద్ భగత్ సింగ్‌ బుకింగ్స్‌పై ప్రభావం చూపుతోంది. రెండో రోజు మధ్యాహ్నం 2 గంటల వరకు ఇండియాలో 1483 షోలు ప్రదర్శితమై.. 25 శాతం థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైనట్లు సాక్‌నిక్ వెల్లడించింది. ఇప్పటి వరకు అందుతున్న సమాచారాన్ని బట్టి ఉస్తాద్ భగత్ సింగ్‌కు రెండో రోజు ఇండియాలో 1.48 కోట్ల రూపాయల నెట్ వసూలైంది. పవన్ కళ్యాణ్ మూవీకి రెండో రోజు తెలుగు రాష్ట్రాల్లో 20 కోట్ల రూపాయలు, కర్ణాటక + రెస్టాఫ్ ఇండియాలో 3 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌లో 2 కోట్ల రూపాయలు చొప్పున 25 కోట్ల రూపాయలు రాబట్టవచ్చని అంచనా వేస్తున్నారు. రెండ్రోజల్లో వరల్డ్ వైడ్‌గా ఉస్తాద్ భగత్ సింగ్ 80 కోట్ల రూపాయల మార్క్ చేరుకోవచ్చని భావిస్తున్నారు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X