Ustaad Bhagat Singh Day 3 Collections: ఉస్తాద్ భగత్ సింగ్ 3వ రోజు కలెక్షన్స్.. పవన్ మూవీకి ఎన్ని కోట్లంటే?
ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నెనీ, వై రవిశంకర్ నిర్మించిన చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. రాశీ ఖన్నా, శ్రీలీలు హీరోయిన్లుగా నటించారు. పార్ధిబన్, అశుతోష్ రాణా, నవాబ్ షా, గౌతమి, రాజీవ్ కనకాల, చమ్మక్ చంద్ర, పోసాని కృష్ణమురళి, రావు రమేశ్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తుండగా.. థమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించారు. అయనంకా బోస్ సినిమాటోగ్రాఫర్‌గా, ఛోటా కే ప్రసాద్ ఎడిటర్‌గా వ్యవహరించారు. ఉగాది, రంజాన్ పండుగలను పురస్కరించుకుని మార్చి 19న ఉస్తాద్ భగత్ సింగ్ వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలో ఉస్తాద్ భగత్ సింగ్ బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ఈవెన్ టార్గెట్ ఎంత? మూడో రోజు ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా ఎన్ని కోట్లు రాబట్టిందో పరిశీలిస్తే..
ఉస్తాద్ భగత్ సింగ్ బడ్జెట్
ఉస్తాద్ భగత్ సింగ్ బడ్జెట్ నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికం, ప్రొడక్షన్ కాస్ట్, ప్రమోషనల్ కార్యక్రమాలతో కలిపి ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి దాదాపు 150 కోట్ల రూపాయల బడ్జెట్ అయినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. భారీ హైప్‌కు తగినట్లుగానే ఉస్తాద్‌కు ఓ రేంజ్‌లో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. నైజాం థియేట్రికల్ రైట్స్ 50 కోట్ల రూపాయలు, ఆంధ్రా థియేట్రికల్ రైట్స్ 54 కోట్లు రూపాయలు, సీడెడ్ థియేట్రికల్ రైట్స్ 16 కోట్ల రూపాయలు చొప్పున 120 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేశాడు ఉస్తాద్.

ఉస్తాద్ భగత్ సింగ్ బ్రేక్ఈవెన్ టార్గెట్
తెలుగేతర రాష్ట్రాల విషయానికి వస్తే.. కర్ణాటక థియేట్రికల్ రైట్స్ 5 కోట్ల రూపాయలు, ఓవర్సీస్ థియేట్రికల్ రైట్స్ 12 కోట్ల రూపాయల మేర బిజినెస్ చేశాయి. దాంతో ఉస్తాద్ భగత్ సింగ్‌కు వరల్డ్ వైడ్‌గా దాదాపు 137 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది అని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. దాంతో పవన్ కళ్యాణ్ మూవీ లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద 140 కోట్ల రూపాయల షేర్.. 280 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టాల్సి ఉంటుంది విశ్లేషకులు విలువ కట్టారు.
ఉస్తాద్ భగత్ సింగ్ కలెక్షన్స్
ఉస్తాద్ భగత్ సింగ్‌కు తొలిరోజున ఇండియాలో 34.75 కోట్ల రూపాయలు, రెండో రోజున 9.25 కోట్ల రూపాయలు చొప్పున ఇప్పటి వరకు 44 కోట్ల రూపాయల నెట్.. 52 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టినట్లు సాక్‌నిక్ వెల్లడించింది. రెండ్రోజుల్లో ఏపీ- తెలంగాణలలో 47.30 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 3.45 కోట్ల రూపాయలు, తమిళనాడు+ కేరళలో 55 లక్షల రూపాయలు, రెస్టాఫ్ ఇండియాలో 62 లక్షల రూపాయలు చొప్పున పవన్ కళ్యాణ్ రాబట్టాడు.
ఉస్తాద్ తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్
నైజాంలో 17.50 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 6.80 కోట్ల రూపాయలు, ఉత్తరాంధ్రలో 5.80 కోట్ల రూపాయలు, ఈస్ట్ గోదావరిలో 4.95 కోట్ల రూపాయలు, గుంటూరులో 3.85 కోట్ల రూపాయలు, వెస్ట్ గోదావరిలో 3.30 కోట్ల రూపాయలు, కృష్ణాలో 3.20 కోట్ల రూపాయలు, నెల్లూరులో 1.45 కోట్ల రూపాయలు చొప్పున ఉస్తాద్ భగత్ సింగ్ తెలుగు రాష్ట్రాల్లో 47 కోట్ల రూపాయల గ్రాస్.. 29 కోట్ల రూపాయల షేర్ రాబట్టింది.
ఉస్తాద్ భగత్ సింగ్ ఓవర్సీస్ కలెక్షన్స్
ఇక ఉస్తాద్ భగత్ సింగ్ ఓవర్సీస్ కలెక్షన్స్ పరిశీలిస్తే.. నార్త్ అమెరికాలో ఇప్పటి వరకు 600K డాలర్లు (భారత కరెన్సీలో 5.64 కోట్ల రూపాయలు) రాబట్టింది. యూకే, యూరప్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తదితర దేశాలతో వచ్చిన వసూళ్లతో కలిపి మొత్తంగా ఓవర్సీస్‌లో ఉస్తాద్ భగత్ సింగ్‌కు 7 కోట్ల రూపాయలు వసూలైంది. ఓవర్సీస్‌లో వచ్చిన గ్రాస్ + ఇండియా కలెక్షన్స్ కలిపి ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ మూవీకి వరల్డ్ వైడ్‌గా 59 కోట్ల రూపాయల కలెక్షన్స్ వచ్చాయి.
ఉస్తాద్ భగత్ సింగ్ మూడో రోజు వసూళ్లు అంచనా
రెండో రోజుతో పోలిస్తే ఉస్తాద్ భగత్ సింగ్ కలెక్షన్స్ పడిపోయాయి. ధురంధర్ 2 తెలుగు వెర్షన్ ఈరోజు నుంచి అందుబాటులోకి రావడంతో ఉస్తాద్‌పై బలమైన ఇంపాక్ట్ చూపిస్తోంది. రంజాన్‌కు తోడు వీకెండ్ కావడంతో ఉస్తాద్‌కు ఫర్వాలేదనిపించే స్థాయిలో బుకింగ్స్ జరుగుతున్నాయి. మూడో రోజు మధ్యాహ్నం 2 గంటల వరకు ఇండియాలో ధురంధర్ 2కు 1609 షోలు ప్రదర్శితమై.. 27 శాతం థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైనట్లు సాక్‌నిక్ నివేదించింది. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం మూడో రోజు ఉస్తాద్ భగత్ సింగ్ ఇండియాలో 2.52 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్స్ రాబట్టింది. పవన్ కళ్యాణ్ మూవీ మూడో రోజున తెలుగు రాష్ట్రాల్లో 8 కోట్ల రూపాయలు, కర్ణాటక + రెస్టాఫ్ ఇండియాలో 2 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌లో కోటి రూపాయలు చొప్పున 12 కోట్ల రూపాయలు రాబడుతుందని భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications



















