Ustaad Bhagat Singh Day 4 Collections:దారుణంగా పడిపోయిన ఉస్తాద్ కలెక్షన్స్..పవన్ మూవీకి 4వ రోజు ఎన్ని కోట్లంటే

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రాశీఖన్నా, శ్రీలీల హీరోయిన్లుగా నటించిన చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నెనీ, వై రవిశంకర్‌ నిర్మించగా హరీశ్ శంకర్ దర్శకత్వం వహించారు. పార్ధిబన్, అశుతోష్ రాణా, నవాబ్ షా, గౌతమి, రాజీవ్ కనకాల, చమ్మక్ చంద్ర, పోసాని కృష్ణమురళి, రావు రమేశ్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తుండగా.. థమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించారు. అయనంకా బోస్ సినిమాటోగ్రాఫర్‌గా, ఛోటా కే ప్రసాద్ ఎడిటర్‌గా వ్యవహరించారు. ఉగాది, రంజాన్ పండుగలను పురస్కరించుకుని మార్చి 19న ఉస్తాద్ భగత్ సింగ్ వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలో ఉస్తాద్ భగత్ సింగ్ బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ఈవెన్ టార్గెట్ ఎంత? నాలుగో రోజు ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా ఎన్ని కోట్లు రాబట్టిందో పరిశీలిస్తే..

Also Read
Ustaad Bhagat Singh Day 3 Collections: ఉస్తాద్ భగత్ సింగ్ 3వ రోజు కలెక్షన్స్.. పవన్ మూవీకి ఎన్ని కోట్లంటే?
Ustaad Bhagat Singh Day 3 Collections: ఉస్తాద్ భగత్ సింగ్ 3వ రోజు కలెక్షన్స్.. పవన్ మూవీకి ఎన్ని కోట్లంటే?

ఉస్తాద్ భగత్ సింగ్ బడ్జెట్
ఉస్తాద్ భగత్ సింగ్ బడ్జెట్ నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికం, ప్రొడక్షన్ కాస్ట్, ప్రమోషనల్ కార్యక్రమాలతో కలిపి ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి దాదాపు 150 కోట్ల రూపాయల బడ్జెట్ అయినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. భారీ హైప్‌కు తగినట్లుగానే ఉస్తాద్‌కు ఓ రేంజ్‌లో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. నైజాం థియేట్రికల్ రైట్స్ 50 కోట్ల రూపాయలు, ఆంధ్రా థియేట్రికల్ రైట్స్ 54 కోట్లు రూపాయలు, సీడెడ్‌ థియేట్రికల్ రైట్స్ 16 కోట్ల రూపాయలు చొప్పున 120 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేశాడు ఉస్తాద్.

Ustaad Bhagat Singh Day 4 Expected Box Office Collections Worldwide Pawan kalyan s film saw a significant drop

ఉస్తాద్ భగత్ సింగ్ బ్రేక్ఈవెన్ టార్గెట్
తెలుగేతర రాష్ట్రాల విషయానికి వస్తే.. కర్ణాటక థియేట్రికల్ రైట్స్ 5 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌ థియేట్రికల్ రైట్స్ 12 కోట్ల రూపాయల మేర బిజినెస్ చేశాయి. దాంతో ఉస్తాద్ భగత్ సింగ్‌కు వరల్డ్ వైడ్‌గా దాదాపు 137 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది అని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. దాంతో పవన్ కళ్యాణ్ మూవీ లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద 140 కోట్ల రూపాయల షేర్.. 280 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టాల్సి ఉంటుంది విశ్లేషకులు విలువ కట్టారు.

Recommended For You
Thaai Kizhavi Closing Collections: తాయ్ కెలవి క్లోజింగ్ కలెక్షన్స్.. రాధిక మూవీకి ఎన్ని కోట్ల లాభమంటే?
Thaai Kizhavi Closing Collections: తాయ్ కెలవి క్లోజింగ్ కలెక్షన్స్.. రాధిక మూవీకి ఎన్ని కోట్ల లాభమంటే?

ఉస్తాద్ భగత్ సింగ్ కలెక్షన్స్
ఉస్తాద్ భగత్ సింగ్‌కు తొలిరోజున ఇండియాలో 34.75 కోట్ల రూపాయలు, రెండో రోజున 9.25 కోట్ల రూపాయలు, మూడో రోజున 9.15 కోట్ల రూపాయలు చొప్పున 54.49 కోట్ల రూపాయల నెట్.. 64.30 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ చొప్పున వసూలు చేసింది. మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో 56.25 కోట్ల రూపాయలు, కర్ణాటక 4.70 కోట్ల రూపాయలు, తమిళనాడులో 70 లక్షల రూపాయలు, రెస్టాఫ్ ఇండియా 75 లక్షల రూపాయలు చొప్పున వసూలు చేసింది పవన్ కళ్యాణ్ మూవీ.

You May Also Like
చైతన్యతో విడాకులపై నాన్న రియాక్షన్ అలా... ఓపెన్ అయిన నిహారిక కొణిదెల
చైతన్యతో విడాకులపై నాన్న రియాక్షన్ అలా... ఓపెన్ అయిన నిహారిక కొణిదెల

ఉస్తాద్ భగత్ సింగ్ ఓవర్సీస్ కలెక్షన్స్
పవన్ కళ్యాణ్‌కు బలమైన బేస్ ఉన్న నార్త్ అమెరికాలోనూ ఈ సినిమాకు వసూళ్లు అంతంత మాత్రంగానే వస్తున్నాయి. ఇప్పటి వరకు 650K డాలర్లు (భారత కరెన్సీలో 6 కోట్ల రూపాయలు) వసూలు అవ్వగా.. యూకే, యూరప్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తదితర దేశాలలో 800K డాలర్లు (భారత కరెన్సీలో 7.52 కోట్ల రూపాయలు) రాబట్టింది. భారత్‌లో వచ్చిన గ్రాస్ + ఓవర్సీస్ కలెక్షన్స్ కలిపి ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ మూడు రోజుల్లో వరల్డ్ వైడ్‌గా 72 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది.

40 ఏళ్లు దాటాక వెంటాడుతున్న ఆ డేంజర్... నటి ప్రియ ఎమోషనల్
40 ఏళ్లు దాటాక వెంటాడుతున్న ఆ డేంజర్... నటి ప్రియ ఎమోషనల్

ఉస్తాద్ తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్
నైజాంలో 19.85 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 8 కోట్ల రూపాయలు, ఉత్తరాంధ్రలో 6.45 కోట్ల రూపాయలు, ఈస్ట్ గోదావరిలో 5.84 కోట్ల రూపాయలు, గుంటూరులో 4.56 కోట్ల రూపాయలు, వస్ట్ గోదావరిలో 3.96 కోట్ల రూపాయలు, కృష్ణాలో 3.79 కోట్ల రూపాయలు, నెల్లూరులో 1.57 కోట్ల రూపాయలు చొప్పున ఉస్తాద్ భగత్ సింగ్ తెలుగు రాష్ట్రాల్లో 56.25 కోట్ల రూపాయల గ్రాస్.. 32 కోట్ల రూపాయల షేర్ రాబట్టింది.

Dhurandhar 2 vs Kalki: కల్కిని కొట్టలేకపోయిన ధురంధర్ 2... రణ్‌వీర్ ప్రభంజనంలోనూ ప్రభాస్‌దే టాప్ ప్లేస్!
Dhurandhar 2 vs Kalki: కల్కిని కొట్టలేకపోయిన ధురంధర్ 2... రణ్‌వీర్ ప్రభంజనంలోనూ ప్రభాస్‌దే టాప్ ప్లేస్!

ఉస్తాద్ భగత్ సింగ్ నాలుగో రోజు వసూళ్లు అంచనా
నెగిటివ్ రివ్యూలకు తోడు, ధురంధర్ 2 ఎఫెక్ట్ ఉస్తాద్ భగత్ సింగ్‌పై గట్టిగా పడింది. ఏ, బీ, సీ సెంటర్స్‌లోనూ ఇదే పరిస్ధితి నెలకొనడంతో పవన్ కళ్యాణ్ మూవీకి బుకింగ్స్ దారుణంగా పడిపోయాయి. నాలుగో రోజు మధ్యాహ్నం 2 గంటల వరకు ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి ఇండియాలో 1550 షోలు ప్రదర్శితమవగా.. 27 శాతం ఆక్యూపెన్సీ నమోదైనట్లు సాక్‌నిక్ నివేదించింది. కడపటి వార్తలు అందేసరికి ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి ఇండియాలో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి 2.15 కోట్ల రూపాయల నెట్ వచ్చింది. నాలుగో రోజు పవన్ కళ్యాణ్ మూవీకి తెలుగు రాష్ట్రాల్లో 10 కోట్ల రూపాయలు, కర్ణాటక + రెస్టాఫ్ ఇండియాలో 2 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌లో కోటి రూపాయలు చొప్పున 13 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X