Ustaad Bhagat Singh Day 5 Collections: ఉస్తాద్ కలెక్షన్స్‌పై గట్టి దెబ్బ.. పవన్ మూవీకి నష్టాలు తప్పాలంటే?

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నెనీ, వై రవిశంకర్‌ నిర్మాతలుగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. దాదాపు 14 ఏళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ - హరీశ్ శంకర్‌ల కాంబోలో మూవీ రావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. రాశీఖన్నా, శ్రీలీలలు పవన్ సరసన హీరోయిన్లుగా నటించారు. పార్ధిబన్, అశుతోష్ రాణా, నవాబ్ షా, గౌతమి, రాజీవ్ కనకాల, చమ్మక్ చంద్ర, పోసాని కృష్ణమురళి, రావు రమేశ్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా... థమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించారు. అయనంకా బోస్ సినిమాటోగ్రాఫర్‌గా, ఛోటా కే ప్రసాద్ ఎడిటర్‌గా వ్యవహరించారు. ఉగాది, రంజాన్ పండుగలను పురస్కరించుకుని మార్చి 19న ఉస్తాద్ భగత్ సింగ్ వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలో ఉస్తాద్ భగత్ సింగ్ బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ఈవెన్ టార్గెట్ ఎంత? ఐదో రోజు ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా ఎన్ని కోట్లు రాబట్టిందో పరిశీలిస్తే..

ఉస్తాద్ భగత్ సింగ్ బడ్జెట్
ఉస్తాద్ భగత్ సింగ్ బడ్జెట్ నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికం, ప్రొడక్షన్ కాస్ట్, ప్రమోషనల్ కార్యక్రమాలతో కలిపి ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి దాదాపు 150 కోట్ల రూపాయల బడ్జెట్ అయినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. భారీ హైప్‌కు తగినట్లుగానే ఉస్తాద్‌కు ఓ రేంజ్‌లో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. నైజాం థియేట్రికల్ రైట్స్ 50 కోట్ల రూపాయలు, ఆంధ్రా థియేట్రికల్ రైట్స్ 54 కోట్లు రూపాయలు, సీడెడ్‌ థియేట్రికల్ రైట్స్ 16 కోట్ల రూపాయలు చొప్పున 120 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేశాడు ఉస్తాద్.

Ustaad Bhagat Singh Day 5 Expected Box Office Collections Worldwide Pawan Kalyan s film struggles to cross Rs 90 cr mark

ఉస్తాద్ భగత్ సింగ్ బ్రేక్ఈవెన్ టార్గెట్
తెలుగేతర రాష్ట్రాల విషయానికి వస్తే.. కర్ణాటక థియేట్రికల్ రైట్స్ 5 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌ థియేట్రికల్ రైట్స్ 12 కోట్ల రూపాయల మేర బిజినెస్ చేశాయి. దాంతో ఉస్తాద్ భగత్ సింగ్‌కు వరల్డ్ వైడ్‌గా దాదాపు 137 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది అని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. దాంతో పవన్ కళ్యాణ్ మూవీ లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద 140 కోట్ల రూపాయల షేర్.. 280 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టాల్సి ఉంటుంది విశ్లేషకులు విలువ కట్టారు.

ఉస్తాద్ భగత్ సింగ్ కలెక్షన్స్
ఉస్తాద్ భగత్ సింగ్‌కు తొలిరోజున ఇండియాలో 34.75 కోట్ల రూపాయలు, రెండో రోజున 9.25 కోట్ల రూపాయలు, మూడో రోజున 9.15 కోట్ల రూపాయలు, నాలుగో రోజున 8 కోట్ల రూపాయలు వసూలు చేసింది. నాలుగు రోజుల వరకు పవన్ కళ్యాణ్ మూవీ ఇండియాలో 60.8 కోట్ల రూపాయలు నెట్.. 71.75 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టినట్లు సాక్‌నిక్ తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లో తొలిరోజున 34.75 కోట్ల రూపాయలు, రెండో రోజున 9 కోట్ల రూపాయలు, మూడో రోజున 9.05 కోట్ల రూపాయలు, నాలుగో రోజున 8 కోట్ల రూపాయలు వసూలు చేసింది. నాలుగు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో 6.30 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 5.80 కోట్ల రూపాయలు, తమిళనాడులో 80 లక్షల రూపాయలు, రెస్టాఫ్ ఇండియా 90 లక్షల రూపాయలు చొప్పున గ్రాస్ వసూలు చేసింది పవన్ కళ్యాణ్ మూవీ. ఇప్పటి వరకు నైజాంలో 26.25 కోట్ల రూపాయలు, నైజాంలో 17.25 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 7 కోట్ల రూపాయలు రాబట్టింది.

ఉస్తాద్ భగత్ సింగ్ ఓవర్సీస్ కలెక్షన్స్
ఉస్తాద్ భగత్ సింగ్‌కు నాలుగో రోజు నార్త్ అమెరికాలో 41K (38.49 లక్షల రూపాయలు) రాబట్టింది. ఇప్పటి వరకు అమెరికా, కెనడాలలో 700K డాలర్లు (6.57 కోట్ల రూపాయలు) వసూలు చేసింది. యూకే, యూరప్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తదితర దేశాలలో కలిపి ఇప్పటి వరకు ఓవర్సీస్‌లో 9 కోట్ల రూపాయలు వసూలు చేసింది ఉస్తాద్ భగత్ సింగ్. భారత్‌లో వచ్చిన గ్రాస్ + ఓవర్సీస్ కలెక్షన్స్ కలిపి నాలుగు రోజుల వరకు ఉస్తాద్ భగత్ సింగ్‌కు వరల్డ్ వైడ్‌గా 81 కోట్ల రూపాయల గ్రాస్ వసూలైనట్లు నివేదికలు చెబుతున్నాయి.

ఉస్తాద్ భగత్ సింగ్ ఐదో రోజు వసూళ్లు అంచనా
అనుకున్న దానిని మించే ధురంధర్ 2 ఎఫెక్ట్.. ఉస్తాద్ భగత్ సింగ్‌పై పడుతోంది. మార్చి 21 నుంచి తెలుగు వెర్షన్ అందుబాటులోకి రావడంతో అర్బన్ ఏరియాలతో పాటు రూరల్ ఏరియాలలో ఉస్తాద్‌పై ధురంధర్ 2 పైచేయి సాధించింది. అయినప్పటికీ వీకెండ్ కావడంతో పవన్ మూవీ చెప్పుకోదగ్గ స్థాయిలో పుంజుకుంది. బుక్ మై షోలో ఉస్తాద్‌ భగత్ సింగ్‌కు 10 లక్షల టికెట్లు అమ్ముడయ్యాయి. ధురంధర్ ప్రభంజనంలోనూ ఈ ఫీట్ సాధించడం పవన్ స్టామినాకు నిదర్శనమని విశ్లేషకులు చెబుతున్నారు. ఉగాది, రంజాన్, లాంగ్ వీకెండ్ కారణంగా నెట్టుకొచ్చిన ఉస్తాద్ భగత్ సింగ్‌కు సోమవారం నుంచి పెద్ద పరీక్ష మొదలుకానుంది. సోమవారం నుంచి వర్కింగ్ డేస్ మొదలు కావడంతో ఉస్తాద్ ఎలా నెగ్గుకొస్తాడన్నది ఆసక్తికరంగా మారింది. తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్, తదితర పరీక్షలు ముగియడం సానుకూల పరిణామంగా చెబుతున్నారు.

ఐదో రోజున మధ్యాహ్నం 1 గంట వరకు ఉస్తాద్ భగత్ సింగ్‌కు ఇండియా వైడ్‌గా 1200 షోలు ప్రదర్శితమవ్వగా.. 17 శాతం మేర థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైనట్లు సాక్‌నిక్ నివేదించింది. ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం ఐదో రోజున ఉస్తాద్‌కు ఇండియాలో 33 లక్షల రూపాయల నికర వసూలు రాబట్టింది. పవన్ మూవీకి ఐదో రోజున తెలుగు రాష్ట్రాల్లో 3 కోట్ల రూపాయలు, రెస్టాఫ్ ఇండియాలో కోటి రూపాయలు, ఓవర్సీస్‌లో కోటి రూపాయలు చొప్పున 5 కోట్ల రూపాయల రేంజ్‌లో కలెక్షన్స్ వస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు. దాంతో ఐదు రోజుల వరకు ఉస్తాద్ భగత్ సింగ్ ఓవరాల్‌గా వరల్డ్ వైడ్‌గా 86 కోట్ల రూపాయలు రాబడుతుందని అంచనా వేస్తున్నారు. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద 185 కోట్ల రూపాయల గ్రాస్.. 90 కోట్ల రూపాయల షేర్ రాబట్టాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X