Ustaad Bhagat Singh Day 6 Collections: భారీగా క్షీణించిన ఉస్తాద్ కలెక్షన్స్.. పవన్ మూవీకి 6వ రోజు ఎంతంటే?

ఏపీ డిప్యూటీ సీఎం, పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. మార్చి 19న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. సరిగ్గా రణ్‌వీర్ సింగ్ నటించిన ధురంధర్ 2 రిలీజ్ రోజున విడుదల కావడంతో ఈ సినిమా పర్ఫార్మెన్స్‌ను విశ్లేషకులు ఆసక్తిగా గమనిస్తున్నారు. ముందుగా ఊహించినట్లుగానే ఉస్తాద్‌ భగత్ సింగ్‌పై ధురంధర్ 2 ఎఫెక్ట్ గట్టిగానే పడింది. ఈ నేపథ్యంలో ఆరో రోజు ఉస్తాద్ భగత్ సింగ్‌కు వరల్డ్ వైడ్‌గా ఎన్ని కోట్ల కలెక్షన్స్ వచ్చాయి? పవన్ కళ్యాణ్ మూవీ లాభాల్లోకి రావాలంటే ఎన్ని కోట్లు రావాలో గమనిస్తే..

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నెనీ, వై రవిశంకర్‌ నిర్మించిన ఉస్తాద్ భగత్ సింగ్ మూవీని హరీశ్ శంకర్ తెరకెక్కించారు. రాశీఖన్నా, శ్రీలీలలు పవన్ సరసన హీరోయిన్లుగా నటించారు. పార్ధిబన్, అశుతోష్ రాణా, నవాబ్ షా, గౌతమి, రాజీవ్ కనకాల, చమ్మక్ చంద్ర, పోసాని కృష్ణమురళి, రావు రమేశ్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా... థమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించారు. అయనంకా బోస్ సినిమాటోగ్రాఫర్‌గా, ఛోటా కే ప్రసాద్ ఎడిటర్‌గా వ్యవహరించారు.

Ustaad Bhagat Singh Day 6 Expected Box Office Collections Worldwide Pawan Kalyan s film

ఉస్తాద్ భగత్ సింగ్ బడ్జెట్
ఉస్తాద్ భగత్ సింగ్ బడ్జెట్ నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికం, ప్రొడక్షన్ కాస్ట్, ప్రమోషనల్ కార్యక్రమాలతో కలిపి ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి దాదాపు 150 కోట్ల రూపాయల బడ్జెట్ అయినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. భారీ హైప్‌కు తగినట్లుగానే ఉస్తాద్‌కు ఓ రేంజ్‌లో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. నైజాం థియేట్రికల్ రైట్స్ 50 కోట్ల రూపాయలు, ఆంధ్రా థియేట్రికల్ రైట్స్ 54 కోట్లు రూపాయలు, సీడెడ్‌ థియేట్రికల్ రైట్స్ 16 కోట్ల రూపాయలు చొప్పున 120 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేశాడు ఉస్తాద్.

ఉస్తాద్ భగత్ సింగ్ బ్రేక్ఈవెన్ టార్గెట్
తెలుగేతర రాష్ట్రాల విషయానికి వస్తే.. కర్ణాటక థియేట్రికల్ రైట్స్ 5 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌ థియేట్రికల్ రైట్స్ 12 కోట్ల రూపాయల మేర బిజినెస్ చేశాయి. దాంతో ఉస్తాద్ భగత్ సింగ్‌కు వరల్డ్ వైడ్‌గా దాదాపు 137 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది అని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. దాంతో పవన్ కళ్యాణ్ మూవీ లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద 140 కోట్ల రూపాయల షేర్.. 280 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టాల్సి ఉంటుంది విశ్లేషకులు విలువ కట్టారు.

ఉస్తాద్ భగత్ సింగ్ కలెక్షన్స్
ఉస్తాద్ భగత్ సింగ్‌కు తొలిరోజున ఇండియాలో 34.75 కోట్ల రూపాయలు, రెండో రోజున 9.00 కోట్ల రూపాయలు, మూడో రోజున 9.05 కోట్ల రూపాయలు, నాలుగో రోజున 7.50 కోట్ల రూపాయలు, ఐదో రోజున 1.96 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఐదు రోజుల వరకు పవన్ కళ్యాణ్ మూవీ ఇండియాలో 62.52 కోట్ల రూపాయలు నెట్.. 73.66 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టినట్లు సాక్‌నిక్ తెలిపింది. ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో 63.55 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 5.75 కోట్ల రూపాయలు, తమిళనాడులో 85 లక్షల రూపాయలు, రెస్టాఫ్ ఇండియాలో 3.20 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఐదు రోజుల వరకు నైజాం ఏరియాలో 19.75 కోట్ల రూపాయలు, కోస్తా ఆంధ్రలో 28 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 8 కోట్ల రూపాయలు చొప్పున ఉస్తాద్ భగత్ సింగ్ వసూలు చేసింది.

ఉస్తాద్ భగత్ సింగ్ ఓవర్సీస్ కలెక్షన్స్
వీకెండ్ వరకు నార్త్ అమెరికాలో ఎలాగోలా నెట్టుకొచ్చిన ఉస్తాద్ భగత్ సింగ్‌కు సోమవారం ఇక్కడ కూడా వసూళ్లు పడిపోయాయి. నిన్న నార్త్ అమెరికాలో పవన్ కళ్యాణ్ మూవీకి కేవలం 12కే డాలర్లు (11.25 లక్షల రూపాయలు) మాత్రమే వచ్చాయి. నార్త్ అమెరికాతో పాటు యూకే, యూరప్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తదితర దేశాలలో కలిపి మొత్తంగా ఓవర్సీస్‌లో ఇప్పటి వరకు ఉస్తాద్ భగత్ సింగ్‌కు 9.6 కోట్ల రూపాయలు వసూలు చేసింది. భారత్‌లో వచ్చిన గ్రాస్+ ఓవర్సీస్ కలెక్షన్స్ కలిపి ఐదు రోజుల్లో వరల్డ్ వైడ్‌గా 84 కోట్ల రూపాయలు రాబట్టినట్లు ట్రేడ్ పండితులు చెబుతున్నారు.

ఉస్తాద్ భగత్ సింగ్ ఆరో రోజు వసూళ్లు అంచనా
ఊహించినట్లుగానే సోమవారం నాటి టెస్ట్‌లో ఉస్తాద్ భగత్ సింగ్ ఫెయిలైంది. ఐదో రోజు వరల్డ్ వైడ్‌గా కేవలం 2.20 కోట్ల రూపాయల గ్రాస్ మాత్రమే రాబట్టింది. ధురంధర్ 2 దూసుకెళ్తుండగా.. ఉస్తాద్ భగత్ సింగ్‌ మాత్రం నిర్మాతలకు షాకిస్తోంది. ట్రెండ్స్‌ను పరిశీలిస్తే మంగళవారం కూడా ఉస్తాద్ కోలుకునే పరిస్దితులు కనిపించడం లేదు. ఆరో రోజు మధ్యాహ్నం 2 గంటల వరకు ఇండియా వైడ్‌గా ఉస్తాద్ భగత్ సింగ్‌కు 1309 షోలు ప్రదర్శితమై.. కేవలం 17 శాతం థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైనట్లు సాక్‌నిక్ పేర్కొంది. ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం ఇండియాలో ఉస్తాద్ భగత్ సింగ్‌కు కేవలం 26 లక్షల రూపాయలు మాత్రమే వసూలైనట్లు ట్రేడ్ పండితులు చెబుతున్నారు.

పవన్ మూవీకి ఆరో రోజున తెలుగు రాష్ట్రాల్లో 2 కోట్ల రూపాయలు, రెస్టాఫ్ ఇండియాలో 50 లక్షల రూపాయలు, ఓవర్సీస్‌లో 25 లక్షల రూపాయలు చొప్పున 3 కోట్ల రూపాయల రేంజ్‌లో కలెక్షన్స్ వస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు. దాంతో ఆరు రోజుల వరకు ఉస్తాద్ భగత్ సింగ్ ఓవరాల్‌గా వరల్డ్ వైడ్‌గా 86 కోట్ల రూపాయలు రాబడుతుందని అంచనా వేస్తున్నారు. ఉస్తాద్ భగత్ సింగ్‌కు నష్టాలు తప్పాలంటే బాక్సాఫీస్ వద్ద ఇంకా 90 కోట్ల రూపాయల షేర్ రాబట్టాల్సి ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X