Ustaad Bhagat Singh Day 7 Collections: ఉస్తాద్ కలెక్షన్స్‌పై కోలుకోలేని దెబ్బ.. పవన్ మూవీ లాభాల్లోకి రావాలంటే?
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నెనీ, వై రవిశంకర్ నిర్మించిన చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఈ సినిమాకు హరీశ్ శంకర్ దర్శకత్వం వహించారు. పవన్ కళ్యాణ్ సరసన రాశీఖన్నా, శ్రీలీలలు హీరోయిన్లుగా నటించారు. పార్ధిబన్, అశుతోష్ రాణా, నవాబ్ షా, గౌతమి, రాజీవ్ కనకాల, చమ్మక్ చంద్ర, పోసాని కృష్ణమురళి, రావు రమేశ్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా... థమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించారు. అయనంకా బోస్ సినిమాటోగ్రాఫర్‌గా, ఛోటా కే ప్రసాద్ ఎడిటర్‌గా వ్యవహరించారు. మార్చి 19న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ మూవీ బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ఈవెన్ టార్గెట్ ఎంత? ఏడో రోజు ఈ సినిమా ఎన్ని కోట్లు రాబట్టిందో పరిశీలిస్తే..
ఉస్తాద్ భగత్ సింగ్ బడ్జెట్
ఉస్తాద్ భగత్ సింగ్ బడ్జెట్ నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికం, ప్రొడక్షన్ కాస్ట్, ప్రమోషనల్ కార్యక్రమాలతో కలిపి ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి దాదాపు 150 కోట్ల రూపాయల బడ్జెట్ అయినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. భారీ హైప్‌కు తగినట్లుగానే ఉస్తాద్‌కు ఓ రేంజ్‌లో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. నైజాం థియేట్రికల్ రైట్స్ 50 కోట్ల రూపాయలు, ఆంధ్రా థియేట్రికల్ రైట్స్ 54 కోట్లు రూపాయలు, సీడెడ్ థియేట్రికల్ రైట్స్ 16 కోట్ల రూపాయలు చొప్పున 120 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేశాడు ఉస్తాద్.

ఉస్తాద్ భగత్ సింగ్ బ్రేక్ఈవెన్ టార్గెట్
తెలుగేతర రాష్ట్రాల విషయానికి వస్తే.. కర్ణాటక థియేట్రికల్ రైట్స్ 5 కోట్ల రూపాయలు, ఓవర్సీస్ థియేట్రికల్ రైట్స్ 12 కోట్ల రూపాయల మేర బిజినెస్ చేశాయి. దాంతో ఉస్తాద్ భగత్ సింగ్‌కు వరల్డ్ వైడ్‌గా దాదాపు 137 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది అని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. దాంతో పవన్ కళ్యాణ్ మూవీ లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద 140 కోట్ల రూపాయల షేర్.. 280 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టాల్సి ఉంటుంది విశ్లేషకులు విలువ కట్టారు.
ఉస్తాద్ భగత్ సింగ్ కలెక్షన్స్
ఉస్తాద్ భగత్ సింగ్‌కు తొలిరోజున ఇండియాలో 34.75 కోట్ల రూపాయలు, రెండో రోజున 9.00 కోట్ల రూపాయలు, మూడో రోజున 9.05 కోట్ల రూపాయలు, నాలుగో రోజున 7.50 కోట్ల రూపాయలు, ఐదో రోజున 1.96 కోట్ల రూపాయలు, ఆరో రోజున 1.75 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఆరు రోజుల వరకు పవన్ కళ్యాణ్ మూవీ ఇండియాలో 64.81 కోట్ల రూపాయలు నెట్.. 76.30 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టినట్లు సాక్‌నిక్ తెలిపింది. ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో 67.90 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 6.15 కోట్ల రూపాయలు, తమిళనాడులో 93 లక్షల రూపాయలు, రెస్టాఫ్ ఇండియాలో 1.07 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఆరు రోజుల వరకు నైజాం ఏరియాలో 22.15 కోట్ల రూపాయలు, కోస్తా ఆంధ్రలో 32.50 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 8.95 కోట్ల రూపాయలు చొప్పున ఉస్తాద్ భగత్ సింగ్ వసూలు చేసింది.
ఉస్తాద్ భగత్ సింగ్ ఓవర్సీస్ కలెక్షన్స్
ఉస్తాద్ భగత్ సింగ్‌కు ఆరో రోజున 26K డాలర్లు (భారత కరెన్సీలో 24.41 లక్షల రూపాయలు) వసూలు చేసింది. నార్త్ అమెరికాలో 738k డాలర్లు (6.93 కోట్ల రూపాయలు), యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో 2.50 కోట్ల రూపాయలు చొప్పున మొత్తంగా ఓవర్సీస్‌లో 1.25 మిలియన్ డాలర్లు (10.42 కోట్ల రూపాయలు) రాబట్టినట్లు ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఇండియాలో వచ్చిన గ్రాస్ + ఓవర్సీస్ కలెక్షన్స్ కలిపి ఇప్పటి వరకు ఉస్తాద్ భగత్ సింగ్‌కు వరల్డ్ వైడ్‌గా 87 కోట్ల రూపాయలు రాబట్టింది.
ఉస్తాద్ భగత్ సింగ్ ఏడో రోజు వసూళ్లు అంచనా
వర్కింగ్ డేస్ మొదలైన నాటి నుంచి ఉస్తాద్ భగత్ సింగ్ ఏమాత్రం ప్రభావం చూపలేకపోతోంది. ధురంధర్ 2 సునామీలా విరుచుకుపడుతుండగా.. పవన్ సినిమాకు బుకింగ్స్ అంతంత మాత్రంగానే జరుగుతున్నాయి. వారం రోజులు కావొస్తున్నా ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ 100 కోట్ల రూపాయల క్లబ్‌లో చేరలేకపోవడం ట్రేడ్ వర్గాలను, పవన్ అభిమానులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇకపోతే ఏడో రోజున ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి మధ్యాహ్నం 2 గంటల వరకు 1188 షోలు ప్రదర్శితమై... కేవలం 16 శాతం మాత్రమే ఆక్యూపెన్సీ నమోదైనట్లు సాక్‌నిక్ వెల్లడించింది. కడపటి సమాచారం అందేసరికి ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి ఇండియాలో బుధవారం 21 లక్షల రూపాయల నెట్ వసూలైంది.
పవన్ మూవీకి ఏడో రోజున తెలుగు రాష్ట్రాల్లో 1.50 కోట్ల రూపాయలు, రెస్టాఫ్ ఇండియాలో 25 లక్షల రూపాయలు, ఓవర్సీస్‌లో 25 లక్షల రూపాయలు చొప్పున 2 కోట్ల రూపాయల రేంజ్‌లో కలెక్షన్స్ వస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు. దాంతో ఏడు రోజుల వరకు ఉస్తాద్ భగత్ సింగ్ ఓవరాల్‌గా వరల్డ్ వైడ్‌గా 89 కోట్ల రూపాయలు రాబడుతుందని అంచనా వేస్తున్నారు. ఉస్తాద్ భగత్ సింగ్‌కు నష్టాలు తప్పాలంటే బాక్సాఫీస్ వద్ద ఇంకా 88 కోట్ల రూపాయల షేర్ రాబట్టాల్సి ఉంది.


Click it and Unblock the Notifications



















