Ustaad Bhagat Singh Day 8 Collections: దారుణంగా ఉస్తాద్ కలెక్షన్స్.. ధురంధర్ 2 సునామీలో పవన్ మూవీకి ఎంతంటే?

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, శ్రీలీల, రాశీ ఖన్నాలు హీరో హీరోయిన్లు హరీశ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నెనీ, వై రవిశంకర్‌ నిర్మించారు. పార్ధిబన్, అశుతోష్ రాణా, నవాబ్ షా, గౌతమి, రాజీవ్ కనకాల, చమ్మక్ చంద్ర, పోసాని కృష్ణమురళి, రావు రమేశ్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా... థమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించారు. అయనంకా బోస్ సినిమాటోగ్రాఫర్‌గా, ఛోటా కే ప్రసాద్ ఎడిటర్‌గా వ్యవహరించారు. మార్చి 19న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చింది. మార్చి 25తో తొలి వారాన్ని పూర్తి చేసుకున్న పవన్ కళ్యాణ్ మూవీ.. రెండో వారంలోకి అడుగుపెట్టింది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ మూవీ బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ఈవెన్ టార్గెట్ ఎంత? 8వ రోజు ఈ సినిమా ఎన్ని కోట్లు రాబట్టిందో పరిశీలిస్తే..

ఉస్తాద్ భగత్ సింగ్ బడ్జెట్
ఉస్తాద్ భగత్ సింగ్ బడ్జెట్ నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికం, ప్రొడక్షన్ కాస్ట్, ప్రమోషనల్ కార్యక్రమాలతో కలిపి ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి దాదాపు 150 కోట్ల రూపాయల బడ్జెట్ అయినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. భారీ హైప్‌కు తగినట్లుగానే ఉస్తాద్‌కు ఓ రేంజ్‌లో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. నైజాం థియేట్రికల్ రైట్స్ 50 కోట్ల రూపాయలు, ఆంధ్రా థియేట్రికల్ రైట్స్ 54 కోట్లు రూపాయలు, సీడెడ్‌ థియేట్రికల్ రైట్స్ 16 కోట్ల రూపాయలు చొప్పున 120 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేశాడు ఉస్తాద్. తెలుగేతర రాష్ట్రాల విషయానికి వస్తే.. కర్ణాటక థియేట్రికల్ రైట్స్ 5 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌ థియేట్రికల్ రైట్స్ 12 కోట్ల రూపాయల మేర బిజినెస్ చేశాయి. దాంతో ఉస్తాద్ భగత్ సింగ్‌కు వరల్డ్ వైడ్‌గా దాదాపు 137 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది అని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి.

Ustaad Bhagat Singh Day 8 Expected Box Office Collections Worldwide Pawan Kalyan s film yet to cross 100 crore

ఉస్తాద్ భగత్ సింగ్ కలెక్షన్స్
ఉస్తాద్ భగత్ సింగ్‌కు తొలిరోజున ఇండియాలో 34.75 కోట్ల రూపాయలు, రెండో రోజున 9.00 కోట్ల రూపాయలు, మూడో రోజున 9.10 కోట్ల రూపాయలు, నాలుగో రోజున 7.50 కోట్ల రూపాయలు, ఐదో రోజున 2.50 కోట్ల రూపాయలు, ఆరో రోజున 1.75 కోట్ల రూపాయలు, ఏడో రోజున 1.14 కోట్ల రూపాయలు వసూలు చేసింది. మొత్తంగా తొలి వారం పవన్ కళ్యాణ్ ఇండియాలో 65.74 కోట్ల రూపాయల నెట్.. 77.36 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాడు. 7 రోజుల వరకు తెలుగు రాష్ట్రాల్లో 68.05 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 6.15 కోట్ల రూపాయలు, తమిళనాడులో 91 లక్షల రూపాయలు, రెస్టాఫ్ ఇండియాలో కోటి రూపాయలు వసూలు చేసింది ఈ చిత్రం.

ఉస్తాద్ భగత్ సింగ్ ఓవర్సీస్ కలెక్షన్స్
ఉస్తాద్ భగత్ సింగ్‌కు నార్త్ అమెరికాలో నిన్న అత్యల్పంగా 9K డాలర్లు (భారత కరెన్సీలో 8.46 లక్షల రూపాయలు) మాత్రమే వసూలు చేసింది. నార్త్ అమెరికా, యూకే, యూరప్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో కలిపి ఇప్పటి వరకు ఓవర్సీస్‌లో పవన్ కళ్యాణ్ మూవీకి 11.3 కోట్ల రూపాయల కలెక్షన్స్ వచ్చాయి. భారత్‌లో వచ్చిన గ్రాస్ + ఓవర్సీస్ కలెక్షన్స్ కలిపి ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి ఇప్పటి వరకు వరల్డ్ వైడ్‌గా 88.60 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

నైజాంలో 24.50 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 11.20 కోట్ల రూపాయలు, ఉత్తరాంధ్రలో 8.15 కోట్ల రూపాయలు, ఈస్ట్ గోదావరిలో 5.90 కోట్ల రూపాయలు, గుంటూరులో 5.25 కోట్ల రూపాయలు, వెస్ట్ గోదావరిలో 4.80 కోట్ల రూపాయలు, కృష్ణాలో 4.60 కోట్ల రూపాయలు, నెల్లూరులో 3.65 కోట్ల రూపాయలు చొప్పున రాబట్టింది.

ఉస్తాద్ భగత్ సింగ్ 8వ రోజు వసూళ్ల అంచనా
ధురంధర్ సునామీకి తోడు మిక్స్‌డ్ టాక్ కారణంగా ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ కలెక్షన్స్ నానాటికీ దిగజారిపోతున్నాయి. ఏ, బీ, సీ సెంటర్స్‌లోనూ పరిస్ధితి ఏమాత్రం మారడం లేదు. పరిస్ధితి ఇలాగే కొనసాగితే పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే భారీ డిజాస్టర్‌గా ఉస్తాద్ నిలిచిపోనుంది. 8వ రోజు మధ్యాహ్నం 2 గంటల వరకు ఇండియాలో ఉస్తాద్‌కు 889 షోలు ప్రదర్శితమై... 16 శాతం ఆక్యూపెన్సీ నమోదైనట్లు సాక్‌నిక్ నివేదించింది. ఇప్పటి వరకు ఉస్తాద్‌కు ఇండియాలో కేవలం 17 లక్షల రూపాయల నెట్ వసూలైనట్లుగా గణాంకాలు చెబుతున్నాయి. ఎనిమిదో రోజు పవన్ కళ్యాణ్ మూవీకి వరల్డ్ వైడ్‌గా కోటి 50 లక్షల రూపాయల వసూళ్లు లభించే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద 140 కోట్ల రూపాయల షేర్.. 280 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టాల్సి ఉంటుంది విశ్లేషకులు విలువ నిర్దేశించారు. ఇప్పటి వరకు ఉస్తాద్‌కు 88 కోట్ల రూపాయల గ్రాస్.. 53 కోట్ల రూపాయల షేర్ మాత్రమే లభించింది. పవన్ మూవీ నష్టాలు తప్పించుకోవాలంటే 190 కోట్ల రూపాయల గ్రాస్.. 87 కోట్ల రూపాయల షేర్ వసూలు చేయాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X