Ustaad Bhagat Singh Day 9 Collections: డేంజర్ జోన్‌లో ఉస్తాద్ కలెక్షన్స్.. పవన్ మూవీకి 9వ రోజు ఎంతంటే?

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నెనీ, వై రవిశంకర్‌ నిర్మించిన చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, శ్రీలీల, రాశీ ఖన్నాలు హీరో హీరోయిన్లుగా నటించగా.. హరీశ్ శంకర్ దర్శకత్వం వహించారు. పార్ధిబన్, అశుతోష్ రాణా, నవాబ్ షా, గౌతమి, రాజీవ్ కనకాల, చమ్మక్ చంద్ర, పోసాని కృష్ణమురళి, రావు రమేశ్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా... థమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించారు. అయనంకా బోస్ సినిమాటోగ్రాఫర్‌గా, ఛోటా కే ప్రసాద్ ఎడిటర్‌గా వ్యవహరించారు. మార్చి 19న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ మూవీ బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ఈవెన్ టార్గెట్ ఎంత? 9వ రోజు ఈ సినిమా ఎన్ని కోట్లు రాబట్టిందో పరిశీలిస్తే..

ఉస్తాద్ భగత్ సింగ్ బడ్జెట్
ఉస్తాద్ భగత్ సింగ్ బడ్జెట్ నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికం, ప్రొడక్షన్ కాస్ట్, ప్రమోషనల్ కార్యక్రమాలతో కలిపి ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి దాదాపు 150 కోట్ల రూపాయల బడ్జెట్ అయినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. భారీ హైప్‌కు తగినట్లుగానే ఉస్తాద్‌కు ఓ రేంజ్‌లో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. నైజాం థియేట్రికల్ రైట్స్ 50 కోట్ల రూపాయలు, ఆంధ్రా థియేట్రికల్ రైట్స్ 54 కోట్లు రూపాయలు, సీడెడ్‌ థియేట్రికల్ రైట్స్ 16 కోట్ల రూపాయలు చొప్పున 120 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేశాడు ఉస్తాద్.

Ustaad Bhagat Singh Day 9 Expected Box Office Collections Worldwide Pawan Kalyan s film heading towards risky venture

తెలుగేతర రాష్ట్రాల విషయానికి వస్తే.. కర్ణాటక థియేట్రికల్ రైట్స్ 5 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌ థియేట్రికల్ రైట్స్ 12 కోట్ల రూపాయల మేర బిజినెస్ చేశాయి. దాంతో ఉస్తాద్ భగత్ సింగ్‌కు వరల్డ్ వైడ్‌గా దాదాపు 137 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది అని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద 140 కోట్ల రూపాయల షేర్, 280 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉంది.

ఉస్తాద్ భగత్ సింగ్ కలెక్షన్స్
ఉస్తాద్ భగత్ సింగ్‌కు తొలిరోజున ఇండియాలో 34.75 కోట్ల రూపాయలు, రెండో రోజున 9.00 కోట్ల రూపాయలు, మూడో రోజున 9.10 కోట్ల రూపాయలు, నాలుగో రోజున 7.50 కోట్ల రూపాయలు, ఐదో రోజున 2.50 కోట్ల రూపాయలు, ఆరో రోజున 1.75 కోట్ల రూపాయలు, ఏడో రోజున 1.35 కోట్ల రూపాయలు, ఎనిమిదో రోజున 1.02 కోట్ల రూపాయలు వసూలు చేసింది. తద్వారా 8 రోజుల వరకు ఇండియాలో 67.15 కోట్ల రూపాయల నెట్.. 78.99 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. 8 రోజుల వరకు తెలుగు రాష్ట్రాల్లో 70.30 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 6.35 కోట్ల రూపాయలు, తమిళనాడులో 92 లక్షల రూపాయలు, రెస్టాఫ్ ఇండియాలో 1.05 కోట్ల రూపాయలు వసూలు చేసింది ఈ చిత్రం.

8 రోజుల వరకు నైజాంలో 25.80 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 14 కోట్ల రూపాయలు, ఆంధ్రలో 30.50 కోట్ల రూపాయలు చొప్పున 70.30 కోట్ల రూపాయలు వసూలైంది. విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్‌లలో మాత్రమే పవన్ మూవీకి చెప్పుకోదగ్గ స్థాయిలో డైలీ 20 శాతం మేర ఆక్యూపెన్సీ నమోదైంది. ఓవర్సీస్‌లో ఉస్తాద్ భగత్ సింగ్‌కు 8 రోజుల వరకు 11.50 కోట్ల రూపాయలు వసూలైనట్లు ట్రేడ్ పండితులు చెబుతున్నారు. దాంతో భారత్‌లో వచ్చిన గ్రాస్ + ఓవర్సీస్ కలెక్షన్స్ కలిపి పవన్ కళ్యాణ్ మూవీకి వరల్డ్ వైడ్‌గా ఇప్పటి వరకు 91 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

ఉస్తాద్ భగత్ సింగ్ 9వ రోజు వసూళ్ల అంచనా
సోమవారం నుంచి పూర్తిగా చతికిలపడ్డ ఉస్తాద్ భగత్ సింగ్‌కు శుక్రవారం నుంచి కాస్త ఊరట లభించే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. శ్రీరామనవమి సెలవు దినంతో పాటు వీకెండ్ కారణంగా పవన్ కళ్యాణ్ మూవీ పుంజుకునే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. 9వ రోజు ఉస్తాద్ భగత్ సింగ్‌కు ఇండియాలో ఇప్పటి వరకు 472 షోలు ప్రదర్శితమై.. 18 శాతం ఆక్యూపెన్సీ నమోదైనట్లు సాక్‌నిక్ పేర్కొంది. కడపటి వార్తలు అందేసరికి ఉస్తాద్ భగత్ సింగ్‌కు ఇండియాలో 18 లక్షల రూపాయల నెట్ వసూలైంది. 9వ రోజు పవన్ కళ్యాణ్ మూవీకి కోటి 50 లక్షల రూపాయలు, రెస్టాఫ్ ఇండియా + కర్ణాటకలో 30 లక్షల రూపాయలు, ఓవర్సీస్‌లో 20 లక్షల రూపాయలు వసూలయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు.

ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ 8 రోజుల వరకు కేవలం 91 కోట్ల రూపాయలు మాత్రమే వసూలు చేసి 40 శాతం రికవరీ సాధించింది. పవన్ మూవీ లాభాల్లోకి రావాలంటే ఇంకా బాక్సాఫీస్ వద్ద 188 కోట్ల రూపాయల గ్రాస్.. 80 కోట్ల రూపాయల షేర్ రాబట్టాల్సి ఉంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఏ ఏరియాలోనూ ఈ సినిమా బ్రేక్ఈవెన్ టార్గెట్‌కు దరిదాపుల్లో కూడా లేదు. ఈ వీకెండ్ గడిస్తే పవన్ కళ్యాణ్ మూవీ భవితవ్యంపై ఒక క్లారిటీ రానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X