Ustaad Bhagat Singh: ఓవర్సీస్ లో దుమ్మురేపుతున్న ఉస్తాద్.. అడ్వాన్స్ బుకింగ్స్ మాములుగా లేదుగా..!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - మాస్ దర్శకుడు హరీష్ శంకర్ కాంబో మూవీ 'ఉస్తాద్ భగత్ సింగ్' ( Ustaad Bhagat Singh). గబ్బర్ సింగ్ లాంటి భారీ బ్లాక్ బస్టర్ మూవీ అందించిన కాంబోలో వస్తున్న మూవీ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ తో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఈ సినిమా మార్చి 19న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. ప్రారంభం నుంచే ఈ సినిమాపై పవన్ కళ్యాణ్ అభిమానుల్లో భారీ క్రేజ్ నెలకొంది. విడుదలకు 10 రోజుల సమయం ఉన్నా.. ఈ సమయంలో నార్త్ అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలో సెన్సేషన్ క్రియేట్ చేసింది.
ఈ మూవీలో పవన్ కళ్యాణ్ సరసన శ్రీలీల, రాశీ ఖన్నా లు నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై ఉన్న అంచనాలు మరింత పెరిగాయి. ఇందులో ముఖ్యంగా టీజర్, సాంగ్స్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పిస్తున్నాయి. అతి త్వరలోనే ఒక సాలిడ్ ట్రైలర్‌ను వదిలేందుకు హరీష్ శంకర్ ప్లాన్ చేస్తున్నారు. వాస్తవానికి ఈ సినిమాను మొదట మార్చి 26న విడుదల చేయాలని భావించారు. అయితే కన్నడ హీరో యష్ (Yash) నటించిన టాక్సిక్ (Toxic) సినిమా రిలీజ్ వాయిదా పడింది. దీంతో 'ఉస్తాద్ భగత్ సింగ్' రిలీజ్‌ను మార్చి 19కు మార్చారు. దీంతో ఈ సినిమా బాలీవుడ్ స్టార్ రణ్ వీర్ సింగ్ 'ధురంధర్ 2' తో బాక్సాఫీస్ పోటీకి సిద్ధమవుతోంది.

ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ప్రయాణం దాదాపు మూడు సంవత్సరాల క్రితం ప్రారంభమైంది. కానీ, ఈ ప్రాజెక్ట్ పలు కారణాల వల్ల షూటింగ్ వాయిదాపడు వస్తుంది. మొదట ఈ సినిమాకు 'భవదీయుడు భగత్ సింగ్' అనే టైటిల్‌ను ప్రకటించారు. తర్వాత కథలో మార్పులు, ప్లానింగ్ కారణంగా టైటిల్‌ను 'ఉస్తాద్ భగత్ సింగ్'గా మార్చారు. మరోవైపు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ కావడం వల్ల కూడా షూటింగ్ ఆలస్యం అయింది. ఈ మధ్యలో ఆయన మరో సినిమా OGపై ముందుగా దృష్టి పెట్టి ఆ ప్రాజెక్ట్‌ను పూర్తి చేశారు. ఆ తర్వాత మళ్లీ ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్‌ను పూర్తి చేశారు.
భారీ బిజినెస్
ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫిక్స్ (Netflix) దాదాపు రూ. 80 కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ గత సినిమా OG డిజిటల్ రైట్స్ దాదాపు రూ. 92 కోట్లకు అమ్ముడయ్యాయి. ఇప్పుడు 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆయన కెరీర్‌లో సెకండ్ హయ్యెస్ట్ డిజిటల్ డీల్ గా నిలిచింది. ఈ సినిమా మొత్తం బడ్జెట్ దాదాపు రూ.150 కోట్ల వరకు అయ్యిందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే డిజిటల్ మరియు ఇతర హక్కుల ద్వారా భారీ రికవరీ జరిగిందని సమాచారం.
ఓవర్సీస్‌లో భారీ బుకింగ్స్
ఈ సినిమాకు సంబంధించిన ఓవర్సీస్ బుకింగ్స్ ఇప్పటికే సంచలనం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తర అమెరికా (యూఎస్ఏ,కెనడా)లో ప్రీమియర్ షోల అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం కావడంతో పవన్ కళ్యాణ్ మేనియా స్పష్టంగా కనిపిస్తోంది. తాజా సమాచారం ప్రకారం.. నార్త్ అమెరికా ప్రీమియర్ ప్రీ-సేల్స్ ఇప్పటికే $100K (లక్ష డాలర్లు)దాటాయి. భారత కరెన్సీలో ఇది దాదాపు రూ .90 లక్షలకు పైగా.ఇంకా రిలీజ్‌కు పది రోజులు ఉండగానే ఈ స్థాయిలో బుకింగ్స్ రావడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇక నార్త్ అమెరికాలో ఈ సినిమాకు భారీ స్థాయిలో ప్రీమియర్ షోలు ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం అక్కడ 500కు పైగా షోలు షెడ్యూల్ చేసినట్లు సమాచారం. విడుదల తేదీ దగ్గరపడే కొద్దీ ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
ఓవర్సీస్ కలెక్షన్లపై అంచనాలు
గతంలో పవన్ కళ్యాణ్ సినిమాలు ఓవర్సీస్ మార్కెట్‌లో 2 మిలియన్ డాలర్స్ నుంచి 5 మిలియన్ డాలర్లు వరకు గ్రాస్ వసూలు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో 'ఉస్తాద్ భగత్ సింగ్' కూడా 1 మిలియన్ డాలర్లకు పైగా ఓపెనింగ్ సాధించే అవకాశముందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక మూవీ నార్త్ అమెరికాలో బ్రేక్ ఈవెన్ సాధించాలంటే.. దాదాపు 2.3 మిలియన్ డాలర్లను నుంచి 2.4 మిలియన్ కలెక్షన్స్ అవసరమని సమాచారం. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి .


Click it and Unblock the Notifications











