Ustaad Bhagat Singh Business: ఉస్తాద్ భగత్ సింగ్ బిజినెస్.. పవన్ కల్యాణ్ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

పవర్ స్టార పవన్ కల్యాణ్, సెన్సేషనల్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ ఈ సినిమాను అట్టహాసంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో శ్రీలీల, రాశీ ఖన్నా, గౌతమీ, చమ్మక్ చంద్ర, అశుతోష్ రాణా, నవాబ్ షా,నర్రా శ్రీను, నాగ మహేష్, చమ్మక్ చంద్ర, రెడిన్ కింగ్స్ లే, టెంపర్ వంశీ నటిస్తున్నారు.

ఈ సినిమాకు సంగీతాన్ని దేవీ శ్రీ ప్రసాద్ అందిస్తుండగా, ఎస్ థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫి: ఆయనంకా బోస్, ఎడిటర్‌: కార్తీక్ శ్రీనివాస్ వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా ఉగాది పండుగను పురస్కరించుకొని మార్చి 19వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్నది. ఈ సినిమా బడ్జెట్ ఎంత? ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత వాల్యూ చేశారు? ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? అనే వివరాల్లోకి వెళితే..

Ustaad Bhagat Singh Pre Release Business

ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను భారీ లెవెల్‌లో చిత్రీకరించారు. పాటలు, కీలక సన్నివేశాలను ఖర్చుకు వెనకాడకుండా సెట్స్ వేశారు. పవన్ కల్యాణ్ రెమ్యునరేషన్ మినహాయించి ఈ చిత్రంలో నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికం, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ సినిమా బడ్జెట్ సుమారుగా 150 కోట్ల రూపాయల మేర అయింది. ఈ సినిమాను దాదాపు మైత్రీ మూవీ మేకర్స్ సొంతంగా, అలాగే కమిషన్ బేస్ మీద రిలీజ్ చేస్తున్నట్టు సమాచారం.

ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూషన్ వివరాల్లోకి వెళితే.. నైజాంలో మైత్రీ మూవీ మేకర్స్, ఉత్తరాంధ్రంలో గాయత్రి ఫిల్మ్స్, సీడెడ్‌లో అభిషేక్ రెడ్డి, ఈస్ట్ గోదావరి జిల్లాలో మైత్రీ మూవీ మేకర్స్, పశ్చిమ గోదావరి జిల్లాలో ఆదిత్య ఫిల్మ్స్ ఎల్‌వీఆర్, కృష్ణా జిల్లాలో ఉషా ఫిల్మ్స్, గుంటూరు జిల్లాలో భాస్కర్ రెడ్డి రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాను కర్ణాటకలో హోంబలే ఫిల్మ్స్, నార్త్ అమెరికాతోపాటు ఓవర్సీస్‌లో ప్రత్యాంగీరా సినిమాస్ రిలీజ్ చేస్తున్నది.

ఇక ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. నైజాంలో 50 కోట్ల రూపాయల మేర వాల్యూ చేశారు. ఆంధ్రాలో 54 కోట్లు రూపాయలు, సీడెడ్‌లో 16 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 5 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌లో 12 కోట్ల రూపాయల మేర బిజినెస్ వాల్యూ కట్టారు. ఈ సినిమా బిజినెస్ దాదాపు 137 కోట్ల రూపాయల మేర జరిగింది అని ట్రేడ్ వర్గాలు ధృవీకరించాయి.

ఇక ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ విషయానికి వస్తే.. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే కనీసం 140 కోట్ల రూపాయలు వసూలు చేయాల్సి ఉంటుంది. జీఎష్టీ అదనంగా చేర్చాల్సి ఉంటుంది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే.. ఈ చిత్రం థియేట్రికల్ రన్‌లో ప్రపంచవ్యాప్తంగా సుమారుగా 250 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టాల్సి ఉంటుంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X