Ustaad Bhagat Singh: ప్రీ రిలీజ్ బిజినెస్‌లో పవన్ హవా..ఉస్తాద్ భగత్ సింగ్ ఆంధ్రా, నైజాం హక్కులు ఎన్ని కోట్లంటే
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత వస్తోన్న మూడో చిత్రం, అలాగే గబ్బర్ సింగ్ తర్వాత దాదాపు 14 ఏళ్లకు హరీశ్ శంకర్- పవన్ కళ్యాణ్ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో ఉస్తాద్ భగత్ సింగ్‌పై చిత్ర పరిశ్రమలో భారీ అంచనాలు నెలకొన్నాయి. పైగా ఓజీ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత పవన్ కళ్యాణ్ కొద్ది నెలల గ్యాప్‌లో వస్తుండటంతో ఉస్తాద్‌పై ఎక్స్‌పెక్టేషన్స్ భారీగా ఉన్నాయి. ఈ క్రమంలోనే ఉస్తాద్ భగత్ సింగ్ థియేట్రికల్, నాన్ థియేట్రికల్ బిజినెస్ అంచనాలకు మించి జరుగుతున్నట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఆంధ్రా, తెలంగాణ రైట్స్ ఓ రేంజ్ సేల్ జరిగినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ వివరాల్లోకి వెళితే..
ఉస్తాద్ భగత్ సింగ్ బడ్జెట్ ఎంత?
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నెనీ, వై రవిశంకర్‌లు దాదాపు 150 కోట్ల బడ్జెట్‌తో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో పవన్ సరసన రాశీ ఖన్నా, శ్రీలీలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. అశుతోష్ రాణా, నవాబ్ షా, గౌతమి, చమ్మక్ చంద్ర తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నారు. అయనంకా బోస్ సినిమాటోగ్రాఫర్‌గా, ఛోటా కే ప్రసాద్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. మార్చి 26న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి సెకండ్ సింగిల్
ఇప్పటికే షూటింగ్, డబ్బింగ్ పనులను పూర్తి చేసిన హరీశ్ శంకర్.. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌ను పరుగులు పెట్టిస్తున్నాడు. సినిమాపై హైప్ పెంచేందుకు గాను ఉస్తాద్ నుంచి సెకండ్ సింగ్‌ను ఫిబ్రవరి 22వ తేదీన విడుదల చేయాలని భావిస్తున్నారు. పవర్‌స్టార్ ఆరా ఇన్ పవర్‌ఫుల్ ఆంథమ్ అంటూ సాగే సెకండ్ సింగిల్‌ను రెడీ చేశారు. ఇటీవల చిత్ర యూనిట్ మొత్తం పవన్ కళ్యాణ్‌ను కలిసి సరదాగా గడిపింది. ఈ సందర్భంగా హరీశ్ ఏదో అనగా పవన్ కళ్యాణ్ ఆయన భుజం మీద కొడుతూ నవ్వుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఉస్తాద్ భగత్ సింగ్ రైట్స్‌కి భారీ డిమాండ్
ఇదిలాఉండగా.. ఉస్తాద్ భగత్ సింగ్‌పై అంచనాల నేపథ్యంలో ఈ సినిమా థియేట్రికల్, నాన్ థియేట్రికల్ బిజినెస్ ఓ రేంజ్‌లో జరిగే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. తెలుగు రాష్ట్రాలు, తమిళనాడు, హిందీ, కర్ణాటక, ఓవర్సీస్ ఏరియాల థియేట్రికల్ రైట్స్ కోసం డిస్ట్రిబ్యూటర్ల నుంచి భారీ డిమాండ్ ఉంది. ఏరియాల వారీగా నిర్మాతలకు కళ్లు చెదిరే ఆఫర్లు ఇస్తున్నట్లుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇటీవల పవన్ కళ్యాణ్ మూవీ డిజిటల్ రైట్స్‌ను ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ భారీ ధరకు సొంతం చేసుకున్నట్లు అధికారికంగా ప్రకటించింది.
ఆంధ్రా, నైజాంలో ఉస్తాద్‌కు రికార్డ్ బిజినెస్
తాజాగా తెలుగు రాష్ట్రాల్లో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ బిజినెస్‌కు సంబంధించి ఓ వార్త వైరల్ అవుతోంది. పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే ఎప్పుడూ లేని స్థాయిలో ఈ సినిమా బిజినెస్ జరుగుతున్నట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఒక్క ఆంధ్రా, తెలంగాణ థియేట్రికల్ రైట్స్ కలిపి 110 కోట్ల రూపాయలకు పైగా బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది. అదే నిజమైతే తెలుగు రాష్ట్రాల్లో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే 120 కోట్ల రూపాయల షేర్.. 200 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ రాబట్టాల్సి ఉందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే పరిస్ధితి ఇలా ఉంటే రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్ కలిపి ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ వరల్డ్ వైడ్‌గా 200 కోట్ల రూపాయలకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications











