Ustaad Bhagat Singh: మిక్స్‌డ్ టాక్‌లోనూ ఉస్తాద్ ఊచకోత.. ధురంధర్ 2 సునామీలో పవన్ కళ్యాణ్ రికార్డ్!

ఆదిత్యధర్ దర్శకత్వంలో రణ్‌వీర్ సింగ్ హీరోగా గతేడాది విడుదలైన ధురంధర్‌కు సీక్వెల్‌గా వచ్చిన చిత్రమే ధురంధర్ ది రివెంజ్ (ధురంధర్ 2). తొలి భాగం చరిత్ర సృష్టించడంతో పాటు ఏకంగా 1300 కోట్లకు పైగా వసూళ్లతో అత్యధిక కలెక్షన్స్ సాధించిన భారతీయ చిత్రాల్లో టాప్ 5లో చోటు దక్కించుకుంది. ఈ మూవీకి సీక్వెల్‌గా విడుదలైన ధురంధర్ 2పై అంతకుమించి హైప్, క్రేజ్ ఉంది. దానిని ఏమాత్రం వమ్ము చేయకుండా వసూళ్ల వర్షం కురిపిస్తున్నాడు రణ్‌వీర్ సింగ్.

కేవలం 3 రోజుల్లోనే 500 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ధురంధర్ 2.. ఈసారి ఎట్టి పరిస్ధితుల్లోనూ 2000 కోట్ల మార్క్ చేరుకోవాలని భావిస్తోంది. పరిస్ధితులు కూడా అన్నీ అనుకూలంగా ఉండటంతో ఈ లక్ష్యం పెద్ద కష్టం కాదని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. ఇక అన్నింటిలోకి విశేషం.. సౌత్‌లో ధురంధర్ 2 డామినేషన్. పాన్ ఇండియా సినిమాల దెబ్బకు హిందీ పరిశ్రమ గడగడలాడిపోతున్న దశలో దక్షిణాదిపై సునామీలా విరుచుకుపడింది ధురంధర్ 2. తొలిభాగాన్ని థియేటర్‌లో కాకుండా ఓటీటీలో చూసిన దక్షిణాది ప్రజలు.. రెండో భాగం కోసం ఉత్కంఠగా ఎదురుచూశారు.

Ustaad Bhagat Singh vs Dhurandhar 2 Pawan Kalyan s film Crosses 1 Million Tickets on BMW Amid Tough Box Office Competition

ఆదిత్యధర్ టేకింగ్, రణ్‌వీర్ సింగ్ నటన, కథ, పాటలు, బీజీఎం, సాంకేతిక వర్గం కృషితో ధురంధర్ 2 సినిమాకు నార్త్, సౌత్ అన్న తేడా లేకుండా ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. తెలుగు రాష్ట్రాలు సహా దక్షిణాదిలోని ప్రతిచోటా థియేటర్లు చాలారోజుల తర్వాత కళకళలాడుతున్నాయి. థియేటర్లు చాలక జనం టికెట్ల కోసం ఎగబడుతున్నారంటే ధురంధర్ 2 మేనియా ఎలా ఉందో అర్దం చేసుకోవచ్చు. మార్చి 18వ తేదీన పెయిడ్ ప్రీమియర్స్‌ ప్రదర్శించాలని మేకర్స్ నిర్ణయించుకున్నారు. అయితే తెలుగు, తమిళ వెర్షన్లు సిద్ధంకాక ప్రీమియర్స్ వాయిదా పడ్డాయి. దాంతో హిందీ వెర్షన్‌‌ అయినా సరే జనం ఎగబడి చూశారు. ఇక మార్చి 21 నుంచి తెలుగు, తమిళ వెర్షన్‌ విడుదల కావడంతో ధురంధర్ 2 ఊచకోత కోస్తోంది. ఆదిత్యధర్, రణ్‌వీర్‌తో పాటు ధురంధర్ 2 చిత్ర యూనిట్‌పై సామాన్యులు, సినీ ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

అయితే ధురంధర్ 2 విధ్వంసాన్ని ముందే ఊహించిన యష్ నటించిన టాక్సిక్ యూనిట్ అలర్ట్ అయి మార్చి 19న సినిమా విడుదలను వాయిదా వేసింది జూన్‌ 4కు కొత్త డేట్ ప్రకటించింది. టాక్సిక్ వాయిదాతో ఉగాది, రంజాన్ ఫెస్టివల్స్‌తో పాటు లాంగ్ వీకెండ్‌ను క్యాష్ చేసుకోవాలని మైత్రీ మూవీ మేకర్స్ నిర్ణయించడం బూమరాంగ్ అయ్యింది. హరీశ్ శంకర్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్‌ను మార్చి 26న విడుదల చేయాలని అనుకున్నారు.. అయితే టాక్సిక్ ఎగ్జిట్ కారణంగా వారం రోజులు ముందుకు జరిపి మార్చి 19న విడుదల చేశారు.

మార్చి 18న ధురంధర్ 2 ప్రీమియర్స్ పడగా... పవన్ మూవీకి తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్స్ ఆ తర్వాతి రోజున పడ్డాయి. మిక్స్‌డ్ టాక్‌కు తోడు, ధురంధర్ 2 ప్రభంజనం తాలూకా ఎఫెక్ట్‌ ఉస్తాద్‌పై గట్టిగా పడింది. తొలిరోజు పవన్ ఛరిష్మా కాపాడినప్పటికీ .. రెండో రోజు నుంచి ఉస్తాద్ భగత్ సింగ్‌కు ధురంధర్ సెగ గట్టిగా తగిలింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లోనూ పవన్ కళ్యాణ్‌కు రణ్‌వీర్ సింగ్ గట్టిపోటీ ఇస్తోంది. మార్చి 21 నుంచి ధురంధర్ తెలుగు వెర్షన్ అందుబాటులోకి రావడం ఉస్తాద్‌ను మరింత దెబ్బతీసి కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయి. శని, ఆదివారాల్లో అడ్వాన్స్ బుకింగ్ విషయంలోనూ ధురంధర్ పైచేయి సాధించింది.

ఆంధ్రా, నైజాంలలో ధురంధర్ 2కు తొలిరోజున 2.12 కోట్ల రూపాయలు, రెండో రోజున 1.30 కోట్ల రూపాయలు, మూడో రోజున 5 కోట్ల రూపాయలు చొప్పున మూడు రోజుల్లో 8.50 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది. ఆదివారం నాటి కలెక్షన్స్‌తో రణ్‌వీర్ సింగ్ మూవీ 15 కోట్ల రూపాయల మార్క్ చేసుకునే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఓవరాల్‌గా ఇప్పటి వరకు ఇండియాలో 419 కోట్ల రూపాయల నెట్.. 438 కోట్ల రూపాయల గ్రాస్, ఓవర్సీస్‌లో 110 కోట్ల రూపాయలు చొప్పున 550 కోట్ల రూపాయల మార్క్ చేరుకున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇక ఉస్తాద్ విషయానికి వస్తే.. మూడు రోజుల వరకు ఇండియాలో 54.49 కోట్ల రూపాయల నెట్.. 64.30 కోట్ల రూపాయల గ్రాస్, ఓవర్సీస్‌లో 7.52 కోట్ల రూపాయలతో కలిపి మూడు రోజుల్లో వరల్డ్ వైడ్‌గా 72 కోట్ల రూపాయలు రాబట్టింది.

అయితే ధురంధర్ 2 ప్రభంజనం ఈ స్థాయిలో ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ ఓ అరుదైన ఘనత సాధించి తన మాస్ ఛరిష్మాను చాటి చెప్పారు. ఉస్తాద్ భగత్ సింగ్‌కు బుక్ మై షోలో 10 లక్షల టికెట్లు (1 మిలియన్) అమ్ముడైనట్లు చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ తెలిపింది. ఎంతటి టఫ్ ఫైట్ ఎదురైనా పవన్ స్టామినా ఏమాత్రం చెక్కు చెదరలేదని ఇది నిరూపిస్తోంది. వీకెండ్ కావడంతో ఆదివారం ఉస్తాద్ భగత్ సింగ్‌‌కు ఫ్యామిలీ, పవన్ అభిమానులు ఎక్కువగా టికెట్స్ బుక్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. దీని వల్లే బుక్ మై షోలో సేల్స్ పెరిగినట్లుగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఏది ఏమైనా బాక్సాఫీస్ బరిలో ఎలాంటి పోటీ ఉన్నా తనకు ఎదురులేదని పవన్ కళ్యాణ్ నిరూపించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X