షాకిస్తున్న ‘ఉయ్యాలా జంపాలా’కలెక్షన్స్
హైదరాబాద్ : ప్రముఖ నిర్మాత డి.సురేష్‌బాబు సమర్పణలో సన్‌షైన్ సినిమాస్, అన్నపూర్ణ స్టూడియోస్ పతాకాలపై విరించివర్మ అనే నూతన దర్శకుడుని పరిచయం చేస్తూ రూపొందించిన చిత్రం 'ఉయ్యాలా జంపాలా'. నాగార్జున, హిట్ చిత్రాల నిర్మాత రామ్మోహన్ పి. నిర్మించిన ఈ విభిన్న కథా చిత్రం బావా మరదళ్ల ప్రేమ కథగా రూపొంది విడుదలైంది. ఈ చిత్రం రిలీజైన రోజు నుంచి మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. పబ్లిసిటీ తో కలిపి రెండున్నర కోట్లు బడ్జెట్ అయిన ఈ చిత్రం 17 కోట్లు(గ్రాస్)కలెక్టు చేసిందని ట్రేడ్ వర్గాల సమాచారం. చిన్న సినిమాగా రిలీజైన ఈ చిత్రం కలెక్షన్స్ లో పెద్ద సినిమాతో పోటీ పడటం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది.

విరించివర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ద్వారా రాజ్ తరుణ్, అవిక ('చిన్నారి పెళ్లికూతురు' ఫేమ్ ఆనంది) హీరో హీరోయిన్లుగా పరిచయమయ్యారు. డి. సురేశ్‌బాబు సమర్పించారు. సన్నీ ఎం.ఆర్. సంగీతం సమకూర్చారు. ఈ చిత్రానికి ఫొటోగ్రఫీ: విశ్వ డి.బి., ఎడిటింగ్: మార్తాండ్ కె.వెంకటేశ్, కల: ఎస్.రవీందర్, సంగీతం: సన్నీ ఎం.ఆర్. నిర్మాతలు: నాగార్జున అక్కినేని, రామ్మోహన్ పి., దర్శకత్వం: విరించి వర్మ.


Click it and Unblock the Notifications











