Vaathi/Sir Advance Booking ధనుష్ మూవీకి పాజిటివ్ బజ్.. నిర్మాత షాకింగ్ నిర్ణయంతో

ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై దక్షిణాది సూపర్ స్టార్ ధనుష్, యువ హీరోయిన్ సంయుక్త జంటగా దర్శకుడు వెంకీ అట్లూరి నిర్మించిన చిత్రం సార్ (తమిళంలో వాతి). ఈ చిత్రానికి సంబంధించిన టీజర్లు, ట్రైలర్లు క్రియేట్ చేసిన బజ్‌తో సినిమా పాజిటివ్‌గా బాక్సాఫీస్ యాత్రను చేపట్టేందుకు రెడీ అవుతున్నది. అయితే ఫిబ్రవరి 17న రిలీజ్ అవుతున్న ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ వివరాలు, అలాగే పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ గురించిన వివరాల్లోకి వెళితే..

 ఒకరోజు ముందే సార్ ప్రీమియర్లు

ఒకరోజు ముందే సార్ ప్రీమియర్లు


వాతి (సార్) సినిమా విషయానికి వస్తే.. దక్షిణాదిలో ముఖ్యంగా హైదరాబాద్, చెన్నైలో ప్రీమియర్లను ప్రదర్శించేందుకు నిర్మాత షాకింగ్ నిర్ణయం తీసుకొన్నారు. సినిమా కంటెంట్‌పై ఉన్న నమ్మకం, ధనుష్ యాక్టింగ్, సంయుక్త మీనన్ ఫెర్ఫార్మెన్స్, మ్యూజిక్ తదితర అంశాలు సినిమాకు పాజిటివ్ బజ్ క్రియేట్ చేసిందనే విషయాన్ని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

 విద్యా వ్యవస్థలోని లోపాలపై

విద్యా వ్యవస్థలోని లోపాలపై


సార్ సినిమా ఇటీవలే సెన్సార్ పూర్తి చేసుకొన్నది. సెన్సార్ అధికారుల నుంచి కూడా భారీగా ప్రశంసలు వచ్చాయనే విషయం తెలిసింది. విద్యా వ్యవస్థలోని లోపాలపై సమాజాన్ని ఆలోచింపజేసే సినిమాగా తెరకెక్కడంపై సెన్సార్ అధికారులు తమ సంతృప్తిని వ్యక్తం చేసినట్టు తెలుస్తున్నది. ఈ సినిమాకు క్లీన్ యూ సర్టిఫికెట్ ఇచ్చినట్టు సమాచారం.

హిందీ, ఓవర్సీస్‌లో సోని

హిందీ, ఓవర్సీస్‌లో సోని


ధనుష్ నటించిన సార్ (వాతి) సినిమాను ఉత్తరాదిలోను, అలాగే ఓవర్సీస్‌లోను భారీగా రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాను హిందీలో, విదేశాల్లో సోని పిక్చర్స్ రిలీజ్ చేస్తున్నది. హిందీలో ధనుష్‌కు ఉన్న మార్కెట్‌కు తగినట్టుగా ప్రధాన నగరాల్లో సినిమాను రిలీజ్ చేస్తున్నారు. ఇక పలుదేశాల్లో ఈ సినిమాను ఎక్కువ స్క్రీన్లలో రిలీజ్ చేస్తున్నారు.

ఏపీ, తెలంగాణ, తమిళనాడులో

ఏపీ, తెలంగాణ, తమిళనాడులో


తమిళనాడు, ఏపీ, తెలంగాణలో భారీగా థియేటర్లలో రిలీజ్ చేస్తున్నట్టు సమాచారం. తమిళనాడులో 500 పైగా స్క్రీన్లలో రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏపీ, తెలంగాణలో కలిపి ఈ సినిమాను సమారు 600 స్క్రీన్లలో రిలీజ్ చేస్తున్నట్టు సమాచారం. సినిమాకు మంచి టాక్ వస్తే.. స్క్రీన్లు పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

 అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్

అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్


అమెరికాలో సార్ (వాతి) సినిమా ఫీవర్ మొదలైంది. ఈ సినిమాను అమెరికాలో 161 కేంద్రాల్లో రిలీజ్ చేస్తున్నారు. తమిళం కంటే తెలుగు వెర్సన్‌కు మంచి క్రేజ్ కనిపిస్తున్నది. దాదాపు 270 షోలు ప్రదర్శిస్తున్నట్టు సమాచారం. అడ్వాన్స్ బుకింగ్ పరంగా 5250 డాలర్లు, తమిళంలో 4250 అమెరికన్ డాలర్లు అంటే.. 9 వేల డాలర్లకు పైగా వసూలు చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X