19 రోజుల్లో 210 కోట్ల కలెక్షన్లు.. 5 కోట్ల బడ్జెట్‌తో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన చిన్న సినిమా!
మలయాళంలో న్యూఏజ్ కామెడీ చిత్రంగా రూపొందిన వాలా 2: బయోపిక్ ఆఫ్ ఏ బిలియన్ బ్రోస్ చిత్రం కేరళ బాక్సాఫీస్ వద్ద రికార్డు లెవెల్ కలెక్షన్లను రాబడుతూ కేవలం 6 రోజుల్లోనే 100 కోట్ల రూపాయలను వసూలు చేసింది. విపిన్ దాస్ తొలిసారి దర్శకత్వం వహించి తెరకెక్కించిన ఈ చిత్రం సరికొత్త రికార్డులు నమోదు చేసత్ూ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్నది. అంతా కొత్తవాళ్లే నటించిన ఈ చిత్రం స్టార్ హీరోల సినిమాలకు సమానంగా వసూళ్లను రాబడుతూ కేరళలో ధురంధర్ 2 సినిమాను మించి భారీగా కలెక్షన్లను రాబడుతున్నది.
కామెడీ, ఫన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాలో హషిర్, అలన్ బిన్, అజిన్, దేవరాజ్, విజయ్ బాబు, బిజుకుట్టన్, అజు వర్గీస్, అల్ఫోన్సే పుత్రెన్ లాంటి యాక్టర్లు నటించారు. ఈ సినిమాకు విపిన్ దాస్, హారీస్ దేసోమ్, సాహు గారపాటి, పీబీ అనిష్, ఆదర్శ్ నారాయణ్, ఐకాన్ స్టూడియోస్ నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ మూవీకి అఖిల్ లైలాసురన్ సినిమాటోగ్రఫిని, కన్నన్ మోహన్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు.

డబ్ల్యూబీటీఎస్ ప్రొడక్షన్స్, ఇమాజిన్ సినిమాస్, షైన్ స్క్రీన్స్, సిగ్నేచర్ స్టూడియోస్, ఐకాన్ స్టూడియోస్ బ్యానర్లపై రూపొందిన ఈచిత్రం తక్కువ బడ్జెట్‌తో క్వాలిటీ కంటెంట్‌తో తెరకెక్కించారనే విషయాన్ని క్రిటిక్స్ వెల్లడించారు. ఈ చిత్రాన్ని సుమారుగా 5 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఈ చిత్రం 11 కోట్ల రూపాయల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బాక్సాఫీస్ జర్నీ మొదలుపెట్టిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ చిత్రం బడ్జెట్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? గత 19 రోజుల్లో ఏ మేరకు వసూళ్లను సాధించింది? అనే వివరాల్లోకి వెళితే..
వాలా 2 సినిమా తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్లింది. రోజులు గడుస్తున్న కొద్ది కలెక్షన్లను పెంచుకొంటూ వెళ్లింది. ఈ చిత్రం తొలి రోజున 5.5 కోట్ల రూపాయలు వసూలు చేయగా, అందులో ప్రధాన మొత్తం కేరళ నుంచే రావడం గమనార్హం. తొలివారం ముగిసే సమయానికి ఈ చిత్రం 55 కోట్లకుపైగా కలెక్షన్లను ఇండియాలో వసూలు చేసింది.
యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్, డ్రామాగా రూపొందిన ఈ చిత్రం రెండో వారంలో కూడా అదే జోష్‌ను కొనసాగించింది. ఈ చిత్రం రెండో వారంలో 42 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇక మూడో వారంలో కూడా చాలా స్టడీగా కలెక్షన్లను నమోదు చేసింది. 16వ రోజున 3.5 కోట్ల రూపాయలు, 17వ రోజున 3.9 కోట్లు, 18వ రోజున 5 కోట్ల రూపాయలు, 19వ రోజున 2.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం 19 రోజుల్లో 110 కోట్ల రూపాయలకుపైగా వసూళ్లను రాబట్టింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
ఈ సినిమా విషయంలో ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేసిన విషయం ఏమిటంటే.. ఇండియాలో బాక్సాఫీస్ కలెక్షన్లకు సమానంగా ఓవర్సీస్‌లో కూడా రాబట్టింది. ఈ చిత్రం నార్త్ అమెరికా, గల్ఫ్, యూకే, ఇతర దేశాల్లో కలిపి 84 కోట్ల రూపాయల కలెక్షన్లను రాబట్టింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్లను పరిశీలిస్తే.. ఇండియాలో 126 కోట్ల రూపాయల గ్రాస్, 110 కోట్ల రూపాయల నెట్ వసూళ్లను, అలాగే ఓవర్సీస్‌లో 84 కోట్ల రూపాయల వసూళ్లను నమోదు చేయడం ద్వారా మొత్తంగా 210 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది. సంచలన విజయం సాధించిన ఈ చిత్రం తెలుగు వెర్షన్‌ను ఏప్రిల్ 24వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications