10 కోట్ల బడ్జెట్.. 7 రోజుల్లో 100 కోట్ల కలెక్షన్లు.. దుమ్మురేపుతున్న చిన్న సినిమా!
మలయాళంలో న్యూఏజ్ కామెడీ చిత్రంగా రూపొందిన వజా 2: బయోపిక్ ఆఫ్ ఏ బిలియన్ బ్రోస్ చిత్రం కేరళ బాక్సాఫీస్ వద్ద రికార్డు లెవెల్ కలెక్షన్లను రాబడుతూ కేవలం 6 రోజుల్లోనే 100 కోట్ల రూపాయలను వసూలు చేసింది. విపిన్ దాస్ తొలిసారి దర్శకత్వం వహించి తెరకెక్కించిన ఈ చిత్రం సరికొత్త రికార్డులు నమోదు చేసత్ూ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్నది. అంతా కొత్తవాళ్లే నటించిన ఈ చిత్రం స్టార్ హీరోల సినిమాలకు సమానంగా వసూళ్లను రాబడుతూ కేరళలో ధురంధర్ 2 సినిమాను మించి భారీగా కలెక్షన్లను రాబడుతున్నది.
కామెడీ, ఫన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాలో హషిర్, అలన్ బిన్, అజిన్, దేవరాజ్, విజయ్ బాబు, బిజుకుట్టన్, అజు వర్గీస్, అల్ఫోన్సే పుత్రెన్ లాంటి యాక్టర్లు నటించారు. ఈ సినిమాకు విపిన్ దాస్, హారీస్ దేసోమ్, సాహు గారపాటి, పీబీ అనిష్, ఆదర్శ్ నారాయణ్, ఐకాన్ స్టూడియోస్ నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ మూవీకి అఖిల్ లైలాసురన్ సినిమాటోగ్రఫిని, కన్నన్ మోహన్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు.

డబ్ల్యూబీటీఎస్ ప్రొడక్షన్స్, ఇమాజిన్ సినిమాస్, షైన్ స్క్రీన్స్, సిగ్నేచర్ స్టూడియోస్, ఐకాన్ స్టూడియోస్ బ్యానర్లపై రూపొందిన ఈచిత్రం తక్కువ బడ్జెట్‌తో క్వాలిటీ కంటెంట్‌తో తెరకెక్కించారనే విషయాన్ని క్రిటిక్స్ వెల్లడించారు. ఈ చిత్రాన్ని సుమారుగా 10 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఈ చిత్రం 11 కోట్ల రూపాయల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బాక్సాఫీస్ జర్నీ మొదలుపెట్టిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ చిత్రం బడ్జెట్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? గత మూడు రోజుల్లో ఏ మేరకు వసూళ్లను సాధించింది? అనే వివరాల్లోకి వెళితే..
ఈ సినిమా కేరళ, ఇతర రాష్ట్రాల్లో రోజు రోజుకు కలెక్షన్లను పెంచుకొంటూ పోతున్నది. ఈ సినిమా తొలి రోజు 4.75 కోట్ల రూపాయలు, రెండో రోజు 5.25 కోట్ల రూపాయలు, మూడో రోజు 7 కోట్ల రూపాయలు, నాలుగో రోజు 8.55 కోట్ల రూపాయలు, 5వ రోజు 7.10 కోట్ల రూపాయలు, ఆరో రోజు 7.10 కోట్ల రూపాయలు, ఏడో రోజు 6.95 కోట్ల రూపాయలు వసూలు చేసింది. మొత్తం 7 రోజుల్లో ఈ సినిమా 47 కోట్ల రూపాయలకుపైగా నెట్ కలెక్షన్లను రాబట్టింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
ఇక ఈ చిత్రం కేవలం ఇండియాకే పరిమితం కాలేదు. ఓవర్సీస్‌లో బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపుతున్నది. మిడిల్ ఈస్ట్‌లో 3 మిలియన్ డాలర్లు, యూకేలో 350K, నార్త్ అమెరికాలో 400K డాలర్లు, ఆస్ట్రేలియాలో 100K డాలర్లు రాబట్టింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాంతో ఈ సినిమా ఓవర్సీస్‌లో సుమారుగా 49 కోట్ల రూపాయలు వసూలు చేసింది.
యూత్‌ఫుల్ కామెడీగా రూపొందిన ఈ సినిమా వరల్డ్ వైడ్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఇండియాలో 47 కోట్ల రూపాయల నెట్, 55 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఓవర్సీస్ కలెక్షన్లను కలుపుకొని 104 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది. ఈ సినిమా భారీ బడ్జెట్ చిత్రాలు లూసిఫర్, ఎంపురాన్, తుడరం, మార్కో, లోక లాంటి స్టార్ హీరోల సినిమాలకు సమానంగా,.. మంజుమ్మేల్ బాయ్స్, ప్రేమలు, ఆడు 3, సర్వం మాయ లాంటి చిన్న సినిమాలకు మంచి కలెక్షన్లను సాధించడం డిస్టిబ్యూటర్లకు మంచి జోష్ కలిగిస్తున్నది.


Click it and Unblock the Notifications

















