ధురంధర్ 2 ప్రభంజనాన్ని అడ్డుకొన్న వజా 2.. 3 రోజుల్లో ఎన్ని కోట్లంటే?

మలయాళంలో న్యూఏజ్ కామెడీ చిత్రంగా రూపొందిన వజా 2: బయోపిక్ ఆఫ్ ఏ బిలియన్ బ్రోస్ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతున్నది. విపిన్ దాస్ తొలిసారి దర్శకత్వం వహించి తెరకెక్కించిన ఈ చిత్రం ప్రశంసలు అందుకొంటూ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్నది. కేరళలో ధురంధర్ 2 సినిమాను వెనక్కి నెట్టి భారీ కలెక్షన్లను రాబడుతున్నది. ఈ చిత్రం బడ్జెట్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? గత మూడు రోజుల్లో ఏ మేరకు వసూళ్లను సాధించింది? అనే వివరాల్లోకి వెళితే..

కామెడీ, ఫన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాలో హషిర్, అలన్ బిన్, అజిన్, దేవరాజ్, విజయ్ బాబు, బిజుకుట్టన్, అజు వర్గీస్, అల్ఫోన్సే పుత్రెన్ లాంటి యాక్టర్లు నటించారు. ఈ సినిమాకు విపిన్ దాస్, హారీస్ దేసోమ్, సాహు గారపాటి, పీబీ అనిష్, ఆదర్శ్ నారాయణ్, ఐకాన్ స్టూడియోస్ నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ మూవీకి అఖిల్ లైలాసురన్ సినిమాటోగ్రఫిని, కన్నన్ మోహన్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు.

Vaazha II 3 Days Box Office Collections

డబ్ల్యూబీటీఎస్ ప్రొడక్షన్స్, ఇమాజిన్ సినిమాస్, షైన్ స్క్రీన్స్, సిగ్నేచర్ స్టూడియోస్, ఐకాన్ స్టూడియోస్ బ్యానర్లపై రూపొందిన ఈచిత్రం తక్కువ బడ్జెట్‌తో క్వాలిటీ కంటెంట్‌తో తెరకెక్కించారనే విషయాన్ని క్రిటిక్స్ వెల్లడించారు. ఈ చిత్రాన్ని సుమారుగా 10 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఈ చిత్రం 11 కోట్ల రూపాయల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బాక్సాఫీస్ జర్నీ మొదలుపెట్టిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

Also Read
Leader Movie Review: లీడర్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
Leader Movie Review: లీడర్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

వజా 2 సినిమా కథ విషయానికి వస్తే.. నేటితరం యువతీయువకుల మధ్య స్నేహం, జీవితలక్ష్యాలు, లైఫ్‌లో ఎదురయ్యే ఛాలెంజెస్ ఆధారంగా తెరకెక్కింది. ఈ సినిమా ఫస్ట్ పార్ట్ కొనసాగింపుగా ఈ సినిమా వచ్చింది. అయితే రిలీజ్ తర్వాత మలయాళంలో పాజిటివ్ టాక్ రావడంతో భారీగా కలెక్షన్లు నమోదు అవుతున్నాయి.

Recommended For You
Biker Movie Review: బైకర్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
Biker Movie Review: బైకర్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

వజా 2 చిత్రం తొలి ఆట నుంచే బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్నది. ఈ చిత్రం తొలి రోజున 4.75 కోట్ల రూపాయలు, రెండో రోజున 5.25 కోట్ల రూపాయలు, మూడో రోజున 7 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఈ సినిమా వసూళ్ల మొత్తంలో అత్యధికంగా కేరళ నుంచే రావడం విశేషం. మూడు రోజుల్లో 17 కోట్ల రూపాయలు మలయాళంలోనే వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో 20 లక్షలు, తమిళంలో 40 లక్షలు, కన్నడలో 1.5 కోట్లు, ఇతర రాష్ట్రాల్లో 40 లక్షల రూపాయలు వసూలు చేసింది. దాంతో 19.5 కోట్ల రూపాయలు ఇండియాలో వసూలు చేసింది అని సాక్ నిక్ వెల్లడించింది.

You May Also Like
Rakasa Movie Review: రాకాస మూవీ రివ్యూ అండ్ రేటింగ్
Rakasa Movie Review: రాకాస మూవీ రివ్యూ అండ్ రేటింగ్

ఇక ఈ సినిమాకు ఓవర్సీస్‌లో కూడా మంచి స్పందన వస్తుంది. ఈ చిత్రం గల్ఫ్, మలేషియా, నార్త్ అమెరికాలో భారీగా వసూళ్లను రాబడుతున్నది. నార్త్ అమెరికాలో 150K డాలర్లు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా 40 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది. కేరళలో ధురంధర్ 2 ప్రభంజాన్ని ఆడు 3 అడ్డుకోగా, ప్రస్తుతం వజా 2 చిత్రం అదే బాటలో కొనసాగుతున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X