For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Kondapolam Day 4 collections: చిన్న టార్గెట్ ముందు.. కుప్పకూలిన కొండపొలం కలెక్షన్స్!

    |

    ఉప్పెన సినిమాతో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ రెండో సినిమాతో కూడా అదే తరహాలో సక్సెస్ అందుకోవాలని గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే మొదటి సినిమాకు వచ్చినంత బజ్ అయితే ఈ సినిమాకు రాలేదు. అయినప్పటికీ వర్గం ప్రేక్షకులు మాత్రం కొండపొలం సినిమా భారీ అంచనాలను క్రియేట్ చేసింది. ఇక బాక్సాఫీస్ వద్ద మొదటి రోజు అంతంత మాత్రంగానే వసూళ్లను అందుకున్న కొండపొలం సినిమా సోమవారం నాటికి మరింత కిందకు జారిపోయింది. అయితే సినిమా బ్రేక్ ఈవెన్ లోకి రావాలి అంటే ఈ కలెక్షన్స్ మాత్రం సరిపోవు. ఇక ఏరియాల వారీగా మొత్తం ఏ స్థాయిలో వసూళ్లను అందుకుందో ఒకసారి చూద్దాం.

    హడావుడి లేకుండా

    హడావుడి లేకుండా

    వైష్ణవ్ తేజ్ మొదట ఉప్పెన సినిమాతో ఏ రేంజ్ లో హిట్ అందుకున్నాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గతంలో ఎప్పుడు లేని విధంగా మొదటి సినిమాతోనే బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో లాభాలను అందుకున్న మొదటి హీరోగా కూడా రికార్డు సృష్టించాడు. ఇక ఉప్పెన తరువాత మాత్రం పెద్దగా హడావుడి లేకుండా కొండపొలం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాను క్రిష్ తెరకెక్కించగా ఎమ్ఎమ్.కీరవాణి మ్యూజిక్ అందించాడు.

    తగ్గిన కలెక్షన్స్

    తగ్గిన కలెక్షన్స్

    కొండపొలం సినిమా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో 7.5 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ మార్కెట్లోకి ప్రవేశించగా.. ప్రపంచవ్యాప్తంగా 8 కోట్ల వరకు బిజినెస్ చేసినట్లు సమాచారం. అంటే బాక్సాఫీస్ వద్ద హిట్ అవ్వాలి అంటే 8.5కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంటుంది. కానీ సినిమా అనుకున్నంతగా ఓపెనింగ్స్ అయితే రాబట్టలేదు. ఎవరు ఊహించని విధంగా మొదటి వీకెండ్ లోనే కలెక్షన్స్ తగ్గుతూ వచ్చాయి.

    4వ రిజు కలెక్షన్స్

    4వ రిజు కలెక్షన్స్

    4వ రోజు తెలుగు రాష్ట్రాల్లో ఏరియాల వారిగా చూసుకుంటే.. నైజాంలో రూ. 10 లక్షలు, సీడెడ్‌లో రూ. 5 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 4 లక్షలు, ఈస్ట్‌లో రూ. 3 లక్షలు, వెస్ట్‌లో రూ. 2 లక్షలు, గుంటూరులో రూ. 2.6 లక్షలు, కృష్ణాలో రూ. 2.4లక్షలు, నెల్లూరులో రూ. 2 లక్షలతో...మొత్తంగా రూ. 0.31కోట్ల షేర్ రాగా.. 0.51కోట్ల గ్రాస్ వసూళ్ళని రాబట్టింది.

     4 రోజుల్లో వచ్చిన మొత్తం కలెక్షన్స్

    4 రోజుల్లో వచ్చిన మొత్తం కలెక్షన్స్

    4 రోజుల్లో కొండపొలం సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన మొత్తం కలెక్షన్స్ ఏరియాల వారిగా చూసుకుంటే.. నైజాంలో రూ. 82లక్షలు, సీడెడ్‌లో రూ. 34 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 56 లక్షలు, ఈస్ట్‌లో రూ. 30 లక్షలు, వెస్ట్‌లో రూ. 23 లక్షలు, గుంటూరులో రూ. 35 లక్షలు, కృష్ణాలో రూ. 24లక్షలు, నెల్లూరులో రూ. 18 లక్షలతో...మొత్తంగా రూ. 3.02కోట్ల షేర్ రాగా.. 4.62కోట్ల గ్రాస్ వసూళ్ళని రాబట్టింది.

    SSMB 28 : Mahesh Babu, Trivikram నుంచి 11 ఏళ్ల తర్వాత.. హీరోయిన్ ఆమెనా? || Filmibeat Telugu
    ఇంకా ఎంత రావాలి అంటే..

    ఇంకా ఎంత రావాలి అంటే..

    ఇక ప్రపంచవ్యాప్తంగా కొండపొలం సినిమా నాలుగు రోజుల్లో 3.28కోట్ల కోట్ల షేర్ ను రాబట్టింది. కొండపొలం సినిమా బడ్జెట్ కు తగ్గట్టుగా ప్రపంచ వ్యాప్తంగా మంచి బిజినెస్ తోనే విడుదల అయ్యింది. అన్ని ఏరియాల్లో కలుపుకొని రూ. 7.5కోట్ల మేర వ్యాపారం జరిగింది. ఇక బ్రేక్ ఈవెంట్ టార్గెట్ రూ. 8కోట్లుగా నమోదైంది. ఇక. ఈ సినిమా నాలుగు రోజుల్లో రూ.3.28 కోట్లు వసూలు చేసింది. దీంతో మరో రూ. 4.72 కోట్లు వసూలు చేస్తే బాక్సాఫీస్ హిట్ గా నిలుస్తుంది.

    English summary
    Vaishnav tej Kondapolam Day 4 box office collections,
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X