Kondapolam Pre release bussiness: ఉప్పెనతో పోలిస్తే చాలా తక్కువ.. వైష్ణవ్ బాక్సాఫీస్ టార్గెట్ ఎంతంటే?

మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ మొదటి సినిమాతోనే ఏ స్థాయిలో విజయాన్ని అందుకున్నాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈ ఏడాది అత్యధిక వసూళ్లను అందుకున్న సినిమాగా సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. అసలు విడుదలకు ముందే సినిమా భారీ స్థాయిలో బజ్ క్రియేట్ చేసింది. ఇక అంచనాలకు తగ్గట్లుగానే మొత్తంగా 100 కోట్ల బిజినెస్ చేసిందని దర్శకుడు సుకుమార్ కూడా పలు ఇంటర్వ్యూలలో చెప్పుకున్నారు.

ఈసారి వైష్ణవ్ తేజ్ తన రెండో సినిమా కొండపొలంతో బాక్సాఫీస్ వద్ద మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. ఇక సినిమా ఫ్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే..

విబిన్నంగా ఆలోచిస్తున్న వైష్ణవ్

విబిన్నంగా ఆలోచిస్తున్న వైష్ణవ్

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో కాకుండా దేశవ్యాప్తంగా మొదటి సినిమాతోనే అత్యధిక లాభాలు అందుకున్న హీరోగా వైష్ణవ్ తేజ్ ఉప్పెన సినిమాతో ఒక రికార్డును అందుకున్నాడు. ఇక వైష్ణవ్ తేజ్ తదుపరి సినిమా విషయంలో కూడా చాలా విభిన్నంగా ఆలోచించినట్లు తెలుస్తోంది. మొదట ఒక ప్యూర్ లవ్ స్టోరీనీ సెలెక్ట్ చేసుకున్న వైష్ణవ్ ఇప్పుడు మంచి సందేశాత్మక మైన కథను సెలెక్ట్ చేసుకోవడం విశేషం.

ఈ శుక్రవారం కొండపొలం

ఈ శుక్రవారం కొండపొలం

మంచి సందేశాత్మక సినిమాలను తెరకెక్కించే దర్శకుడు క్రిష్ దర్శకత్వం వహించిన కొండపొలం సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సినిమాకు కీరవాణి సంగీతం అంధించగా ఇప్పటికే కొన్ని పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అసలైతే ఈ ఆఫర్ ఉప్పెన షూటింగ్ సమయంలోనే వచ్చిందట. ఒక విధంగా వైష్ణవ్ రెండు సినిమాలు కూడా ఒకేసారి పూర్తి చేశాడు. అయితే లాక్ డౌన్ కారణంగా చాలా రోజులు వాయిదా వేయాల్సి వచ్చింది.

బారి ఆశలు పెట్టుకున్న హీరోయిన్

బారి ఆశలు పెట్టుకున్న హీరోయిన్

ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ చదువుకున్న ఒక గొర్రెల కాపరిగా కనిపించబోతున్నాడు. అలాగే హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఈ సినిమాలో ఓబులమ్మ ఒక పల్లెటూరి అమ్మాయిగా కనిపించబోతోంది. తప్పకుండా ఈ సినిమాతో ఎలాగైనా విజయాన్ని అందుకోవాలని రకుల్ ప్రీత్ సింగ్ చాలా ఆశపడుతోంది. ఎందుకంటే ఈ బ్యూటీకి గత కొంతకాలంగా సరైన విజయాలు లేవు. అందుకే ఈ సినిమాతో బాక్సాఫీస్ హిట్ అందుకొని ట్రాక్ లోకి రావాలని చూస్తోంది.

మొదటి సినిమా కలెక్షన్స్

మొదటి సినిమా కలెక్షన్స్

మొదటి సినిమాతోనే బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో ఓపెనింగ్స్ అందుకున్న వైష్ణవ్ తేజ్ అందరికీ షాక్ ఇచ్చాడు అనే చెప్పాలి. ఉప్పెన సినిమా 24 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఇక బాక్సాఫీస్ వద్ద విడుదలైన తర్వాత మొదటి వారంలోనే భారీ స్థాయిలో ఓపెనింగ్స్ అందుకుంది. ఇక వరల్డ్ వైడ్ గా ఈ సినిమా 90 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ అందుకుంది. ఇక మిగతా నాన్ థియేట్రికల్ బిజినెస్ ద్వారా మొత్తంగా వంద కోట్ల బిజినెస్ చేసింది.

Recommended Video

Auto Ramprasad's Peep Show First Look | Poster Launch Press Meet
కొండపొలం బాక్సాఫీస్ టార్గెట్

కొండపొలం బాక్సాఫీస్ టార్గెట్

ఇక ఇప్పుడు కొండపొలం సినిమా ఏ స్థాయిలో వసూళ్లను అందుకుంటుందనేది హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుత పరిస్థితులను బట్టి సినిమా మార్కెట్ వాల్యూ 7 కోట్లకు అమ్ముడైనట్లు సమాచారం. బ్రిడ్జి ఫిలిమ్స్ సంస్థ కొండాపురం వరల్డ్ వైడ్ థియేట్రికల్ హక్కులను 7కోట్లకు దక్కించుకున్నారు. ఇక ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద 7.5 కోట్ల షేర్ కలెక్షన్స్ అందుకుంటే హిట్ అయినట్టు లెక్క ఒక విధంగా వైష్ణవ్ కొండపొలం బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను ఈజీగా అందుకుంటాడాని తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X