twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Ranga Ranga Vaibhavanga Collections: మెగా హీరోకు షాక్.. 5 రోజుల్లో ఇంతేనా.. ఎన్ని కోట్లు రావాలంటే!

    |

    మెగా ఫ్యామిలీ నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా.. మొదటి చిత్రంతోనే ప్రేక్షకులను అలరించి అందరినీ తనవైపు చూసేలా చేశాడు పంజా వైష్ణవ్ తేజ్. అంతేకాదు, ఈ సినిమాతో వంద కోట్ల క్లబ్‌లో చేరిన ఈ కుర్రాడు.. రెట్టించిన ఉత్సాహంతో సినిమాల మీద సినిమాలు చేస్తూ ముందుకు వెళ్తోన్నాడు. ఇలా ఇప్పటికే పలు చిత్రాలను కూడా ప్రేక్షకులకు అందించాడు.

    ఈ క్రమంలోనే వైష్ణవ్ తేజ్ ఇటీవలే 'రంగరంగ వైభవంగా' అనే సినిమాతో వచ్చాడు. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రానికి తెలుగు ప్రేక్షకుల నుంచి సరైన స్పందన రావడం లేదు. దీంతో కలెక్షన్లు కూడా క్రమంగా పడిపోతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో 'రంగరంగ వైభవంగా' 5 రోజుల్లో ఎంత వసూలు చేసింది? ఇంకెంత రావాల్సి ఉంటుంది? అనేవి చూద్దాం పదండి!

    రంగరంగ వైభవంగా వచ్చేశారు

    రంగరంగ వైభవంగా వచ్చేశారు

    పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన తాజా చిత్రమే 'రంగరంగ వైభవంగా'. గిరీశయ్య తెరకెక్కించిన ఈ మూవీలో కేతిక శర్మ హీరోయిన్‌గా నటించింది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. దేవీ శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు. ఈ మూవీలో చాలా మంది ప్రముఖులు కీలక పాత్రలను పోషించారు.

    ఏమీ లేకుండా పాయల్ సెల్ఫీ వీడియో: అన్ని యాంగిల్స్ నుంచి చూపిస్తూ!ఏమీ లేకుండా పాయల్ సెల్ఫీ వీడియో: అన్ని యాంగిల్స్ నుంచి చూపిస్తూ!

    రంగరంగ వైభవంగాకు బిజినెస్

    రంగరంగ వైభవంగాకు బిజినెస్

    క్రేజీ కాంబోలో వచ్చిన 'రంగరంగ వైభవంగా' మూవీకి నైజాంలో రూ. 2.60 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.30 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 3.60 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 7.50 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, కర్నాటక, రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్‌ ఏరియాల్లో కలిపి రూ. 1 కోటి బిజినెస్ అయింది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా రూ. 8.50 కోట్లు బిజినెస్ చేసింది.

    5వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?

    5వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?

    'రంగరంగ వైభవంగా'కి తెలుగు రాష్ట్రాల్లో ఐదో రోజు భారీ దెబ్బ తగిలింది. ఫలితంగా నైజాంలో రూ. 8 లక్షలు, సీడెడ్‌లో రూ. 2 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 2 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 2 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 1 లక్షలు, గుంటూరులో రూ. 1 లక్షలు, కృష్ణాలో రూ. 2 లక్షలు, నెల్లూరులో రూ. 1 లక్షలతో.. ఏపీ, తెలంగాణలో రూ. 19 లక్షలు షేర్, రూ. 35 లక్షలు గ్రాస్ వసూలైంది.

    Bigg Boss Telugu 6: బయటపడిన బిగ్ బాస్ భారీ మోసం.. వాళ్లిద్దరూ కనిపించకపోవడంతో విమర్శలుBigg Boss Telugu 6: బయటపడిన బిగ్ బాస్ భారీ మోసం.. వాళ్లిద్దరూ కనిపించకపోవడంతో విమర్శలు

    5 రోజుల్లో ఎక్కడ? ఎంతొచ్చింది

    5 రోజుల్లో ఎక్కడ? ఎంతొచ్చింది

    'రంగరంగ వైభవంగా'కి ఏపీ, టీఎస్‌లో 5 రోజుల్లో నిరాశే ఎదురైంది. ఫలితంగా నైజాంలో రూ. 1.00 కోట్లు, సీడెడ్‌లో రూ. 27 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 35 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 25 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 17 లక్షలు, గుంటూరులో రూ. 29 లక్షలు, కృష్ణాలో రూ. 23 లక్షలు, నెల్లూరులో రూ. 14 లక్షలతో కలుపుకుని రూ. 2.70 కోట్లు షేర్, రూ. 4.65 కోట్లు గ్రాస్ వసూలైంది.

    ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లు ఇలా

    ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లు ఇలా

    తెలుగు రాష్ట్రాల్లో 5 రోజుల్లో కేవలం రూ. 2.70 కోట్లు రాబట్టిన 'రంగరంగ వైభవంగా' ప్రపంచ వ్యాప్తంగా నిరాశ పరిచింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 20 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 49 లక్షలు మాత్రమే వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే 5 రోజుల్లో ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా రూ. 3.39 కోట్లు షేర్‌తో పాటు రూ. 6.15 కోట్లు గ్రాస్ మాత్రమే వచ్చింది.

    ఒంటిపై నూలుపోగు లేకుండా హీరోయిన్: ప్రైవేటు పార్టులను చూపిస్తూ దారుణంగా!ఒంటిపై నూలుపోగు లేకుండా హీరోయిన్: ప్రైవేటు పార్టులను చూపిస్తూ దారుణంగా!

    బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?

    బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?

    వైష్ణవ్ తేజ్ - కేతిక శర్మ జంటగా నటించిన 'రంగరంగ వైభవంగా' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 8.50 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 9 కోట్లుగా నమోదైంది. ఇక, 5 రోజుల్లో దీనికి రూ. 3.39 కోట్లు వచ్చాయి. అంటే మరో 5.61 కోట్లు రాబడితేనే ఇది క్లీన్ హిట్‌గా నిలుస్తుంది.

     మెగా హీరోకు మరో దెబ్బ తగిలిద్దా?

    మెగా హీరోకు మరో దెబ్బ తగిలిద్దా?

    మెగా హీరో వైష్ణవ్ తేజ్ నటించిన 'రంగరంగ వైభవంగా' మూవీ ఎన్నో అంచనాలతో వచ్చినా నిరాశను కలిగించేలా మిక్స్‌డ్ టాక్‌ను తెచ్చుకుంది. ఫలితంగా ఆంధ్రా, తెలంగాణలో అంతగా రాణించడం లేదు. ప్రపంచ వ్యాప్తంగానూ దీనికి వసూళ్లు అంతగా రావడం లేదు. దీంతో ఈ సినిమాకు కూడా నష్టాలు ఎదురయ్యే ప్రమాదం ఉన్నట్లు ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

    English summary
    Vaishnav Tej Did Ranga Ranga Vaibhavanga Movie Under Gireeshaaya Direction. This Movie Collects Rs 3.39 Crore in 5 Days.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X