Don't Miss!
- Sports Sachin Tendulkar: కన్నీటిని ఆపుకుంటూ సెంచరీ!
- News కాంగ్రెస్ ఖమ్మం సీటు పంచాయితీలో అనూహ్య మలుపు..!!
- Technology జియో సినిమా యాప్‌లో IPL మ్యాచ్‌లను ఉచితంగా చూస్తున్నారా.. రేపు కీలక ప్రకటన??
- Automobiles క్రాష్ టెస్ట్‌లో హోండా అమేజ్‌కు గట్టి షాక్.. ఆ విభాగంలో ‘0' రేటింగ్.!!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
Ranga Ranga Vaibhavanga Collections: వైష్ణవ్‌కు మరో దెబ్బ.. 6వ రోజే దారుణంగా.. కోట్ల నష్టాల దిశగా!
మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటికే ఎంతో మంది కుర్రాళ్లు హీరోలుగా పరిచయం అయ్యారు. అయితే, అందులో చాలా తక్కువ మంది మాత్రమే ఆరంభంలోనే విజయాన్ని అందుకుని, విశేషమైన గుర్తింపును సొంతం చేసుకున్నారు. అలాంటి వారిలో పంజా వైష్ణవ్ తేజ్ ఒకడు. మొదటి చిత్రంతోనే వంద కోట్ల క్లబ్లో చేరిన అతడు.. అప్పటి నుంచి రెట్టించిన ఉత్సాహంతో సినిమాలు చేస్తున్నాడు.
ఈ క్రమంలోనే ఇటీవలే వైష్ణవ్ తేజ్ 'రంగరంగ వైభవంగా' అనే సినిమాతో వచ్చాడు. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రానికి తెలుగు ప్రేక్షకుల నుంచి సరైన స్పందన రావడం లేదు. దీంతో కలెక్షన్లు కూడా క్రమంగా పడిపోతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో 'రంగరంగ వైభవంగా' 6 రోజుల్లో ఎంత వసూలు చేసిందో మీరే చూడండి!
రంగరంగ వైభవంగా వైష్ణవ్ తేజ్
పంజా వైష్ణవ్ తేజ్ - గిరీశయ్య కాంబినేషన్లో రూపొందిన సినిమానే 'రంగరంగ వైభవంగా'. ఈ మూవీలో కేతిక శర్మ హీరోయిన్గా చేసింది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. దేవీ శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం సమకూర్చాడు. ఈ మూవీలో చాలా మంది ప్రముఖులు ముఖ్యమైన పాత్రల్లో కనిపించారు.
ఒంటిపై నూలుపోగు లేకుండా హీరోయిన్: ప్రైవేటు పార్టులను చూపిస్తూ దారుణంగా!
రంగరంగ వైభవంగాకు బిజినెస్
ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వచ్చిన 'రంగరంగ వైభవంగా' మూవీకి నైజాంలో రూ. 2.60 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.30 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 3.60 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 7.50 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, కర్నాటక, రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్ ఏరియాల్లో కలిపి రూ. 1 కోటితో.. ప్రపంచ వ్యాప్తంగా రూ. 8.50 కోట్లు బిజినెస్‌ను చేసుకుంది.
6వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?
'రంగరంగ వైభవంగా'కి తెలుగు రాష్ట్రాల్లో ఆరో రోజు మరో దెబ్బ తగిలింది. ఫలితంగా నైజాంలో రూ. 4 లక్షలు, సీడెడ్‌లో రూ. 1 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 2 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 1 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 1 లక్షలు, గుంటూరులో రూ. 1 లక్షలు, కృష్ణాలో రూ. 1 లక్షలు, నెల్లూరులో రూ. 1 లక్షలతో.. ఏపీ, తెలంగాణలో రూ. 12 లక్షలు షేర్, రూ. 20 లక్షలు గ్రాస్ వసూలైంది.
ఏమీ లేకుండా పాయల్ సెల్ఫీ వీడియో: అన్ని యాంగిల్స్ నుంచి చూపిస్తూ!
6 రోజుల్లో ఎక్కడ? ఎంతొచ్చింది
'రంగరంగ వైభవంగా'కి ఏపీ, టీఎస్‌లో 6 రోజుల్లో నిరాశే ఎదురైంది. ఫలితంగా నైజాంలో రూ. 1.04 కోట్లు, సీడెడ్‌లో రూ. 28 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 37 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 26 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 18 లక్షలు, గుంటూరులో రూ. 30 లక్షలు, కృష్ణాలో రూ. 24 లక్షలు, నెల్లూరులో రూ. 15 లక్షలతో కలుపుకుని రూ. 2.82 కోట్లు షేర్, రూ. 4.85 కోట్లు గ్రాస్ వసూలైంది.
ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లు ఇలా
తెలుగు రాష్ట్రాల్లో 6 రోజుల్లో కేవలం రూ. 2.82 కోట్లు రాబట్టిన 'రంగరంగ వైభవంగా' ప్రపంచ వ్యాప్తంగా నిరాశ పరిచింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 21 లక్షలు, ఓవర్సీస్లో రూ. 51 లక్షలు మాత్రమే వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే 6 రోజుల్లో ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా రూ. 3.54 కోట్లు షేర్‌తో పాటు రూ. 6.40 కోట్లు గ్రాస్ మాత్రమే వచ్చింది.
టాప్ కిందకి జరిపి షాకిచ్చిన శ్యామల: ఇది అట్టాంటిట్టాంటి షో కాదుగా!
బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?
వైష్ణవ్ తేజ్ - కేతిక శర్మ హీరో హీరోయిన్లుగా చేసిన 'రంగరంగ వైభవంగా' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 8.50 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 9 కోట్లుగా నమోదైంది. ఇక, 6 రోజుల్లో దీనికి రూ. 3.54 కోట్లు వచ్చాయి. అంటే మరో 5.46 కోట్లు రాబడితేనే ఇది క్లీన్ హిట్‌గా నిలుస్తుంది.