Ranga Ranga Vaibhavanga Collections: వైష్ణవ్​ తేజ్​ రంగ రంగ వైభవంగా 4వ రోజు కలెక్షన్లు ఎలా ఉన్నాయంటే?

మెగా కుటుంబం నుంచి మరో హీరోగా వచ్చి తొలి సినిమా ఉప్పెనతో మంచి విజయం సాధించాడు వైష్ణవ్​ తేజ్​. ఆ తర్వాత స్టార్​ హీరోయిన్​ రకుల్​ ప్రీత్​ సింగ్​తో జోడి కట్టిన కొండపొలం అనుకున్నంత స్థాయిలో ఆడలేకపోయింది. ఇక ముచ్చటగా మూడో సినిమా రంగ రంగ వైభవంగా అంటూ వచ్చాడు వైష్ణవ్​ తేజ్​. రొమాంటిక్ లవ్​ స్టోరీగా తెరకెక్కిన ఈ మూవీ విడుదలైన తొలి రోజు నుంచే నెగెటివ్​ టాక్​ను తెచ్చుకుంది. మొదటి రోజు నుంచే సో సోగా వసూళ్లు రాబడుతున్న ఈ మూవీ నాలుగో రోజు బాక్సాఫీస్ కలెక్షన్లు ఎలా ఉన్నాయో చూద్దామా!

వైష్ణవ్ తేజ్ మూడో సినిమాగా వచ్చింది రంగ రంగ వైభవంగా. ఈ చిత్రంలో రొమాంటిక్ బ్యూటీ కేతికా శర్మ హీరోయిన్​గా చేయడం, ట్రైలర్​ కొంచెం ఆసక్తిగా ఉండటంతో కొంతమేర క్రేజ్​ను సంపాదించుకుంది. ఈ క్రేజ్​కు మూవీ ప్రమోషన్లలో కేతికా శర్మ గ్లామర్​ కాస్తా తోడైంది. కానీ ఇవేవి సినిమా కలెక్షన్లలు పెంచడంలో సహాయం చేయలేకపోయాయి.

ప్రీ రిలీజ్​ బిజినెస్​ డీటేల్స్​..

ప్రీ రిలీజ్​ బిజినెస్​ డీటేల్స్​..

రంగ రంగ వైభవంగా మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. నైజాంలో రూ. 2.6 కోట్లు, సీడెడ్​లో రూ. 1.3 కోట్లు జరిగింది. ఇక తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్​లో రూ. 3.6 కోట్లు, తెలంగాణలో రూ. 3.9 కోట్ల బిజినెస్​ కాగా, కర్ణాటకతోపాటు రెస్టాఫ్​ ఇండియా, ఓవర్సీస్​ కలిపి రూ. 1 కోటి బిజినెస్​ జరిగింది. అయితే ఈ మొత్తం కలిపి రూ. 8.50 కోట్ల బిజినెస్​ సాధించగా.. లాభాల్లోకి (బ్రేక్​ ఈవెన్​) రావాలంటే రూ. 9 కోట్లు కలెక్ట్​ చేయాల్సి ఉంది.

4వ రోజు కలెక్షన్లు..

4వ రోజు కలెక్షన్లు..

4వ రోజు రంగ రంగ వైభవంగా సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో వసూళ్లు కాస్త పెరిగినట్లు తెలుస్తోంది. ఫలితంగా నైజాంలో రూ. 14 లక్షలు, సీడెడ్‌లో రూ. 3 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 4 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 3 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 2 లక్షలు, గుంటూరులో రూ. 2 లక్షలు, కృష్ణాలో రూ. 2 లక్షలు, నెల్లూరులో రూ. 1 లక్షలతో కలిపి రూ. 31 లక్షలు షేర్, రూ. 50 లక్షలు గ్రాస్ వసూలు అయింది.

 4 రోజులకు కలిపి వచ్చింది ఎంతంటే?

4 రోజులకు కలిపి వచ్చింది ఎంతంటే?

తెలుగు రాష్ట్రాల్లో రంగ రంగ వైభవంగా మూవీకి 4 రోజుల్లో మంచి వసూళ్లే వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 92 లక్షలు, సీడెడ్‌లో రూ. 25 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 33 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 23 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 16 లక్షలు, గుంటూరులో రూ. 28 లక్షలు, కృష్ణాలో రూ. 21 లక్షలు, నెల్లూరులో రూ. 13 లక్షలతో.. రూ. 2.51 కోట్లు షేర్, రూ. 4.30 కోట్లు గ్రాస్ వచ్చింది.

వరల్డ్​వైడ్​గా వసూళ్లు ఇలా..

వరల్డ్​వైడ్​గా వసూళ్లు ఇలా..

రంగ రంగ వైభవంగా మూవీకి తెలుగు రాష్ట్రాల్లో 4 రోజుల్లో రూ. 2.51 కోట్ల షేర్ కలెక్ట్​ చేయగా.. కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 18 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 46 లక్షలు వసూలు చేసింది. వీటన్నింటితో కలుపుకుంటే 4 రోజుల్లో ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా రూ. 3.15 కోట్లు షేర్‌, రూ. 5.70 కోట్లు గ్రాస్ వసూలైంది.

టార్గెట్​కు వచ్చిన లాభం ఎంతంటే?

టార్గెట్​కు వచ్చిన లాభం ఎంతంటే?

ఇక రంగ రంగ వైభవంగా సినిమా రూ. 9 కోట్ల బ్రేక్ ఈవెన్ లక్ష్యంతో బాక్సాఫీస్ ప్రయాణం మొదలుపెట్టింది. ప్రస్తుతం రూ. 3.15 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే కనీసం.. ఈ చిత్రం ఇంకా రూ. 5.85 కోట్లు రాబట్టాల్సి ఉంటుంది. ఈ చిత్రం ఏ మేరకు వసూళ్లను సాధిస్తుందో వేచి చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X