Ranga Ranga Vaibhavanga Collections: 9 కోట్లకు అమ్మితే.. కోట్లలో నష్టం.. మెగా హీరో చెత్త రికార్డు

మెగా ఫ్యామిలీ నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా.. మొదటి చిత్రంతోనే రికార్డులు క్రియేట్ చేయడంతో పాటు గ్రాండ్ ఎంట్రీని సొంతం చేసుకున్నాడు పంజా వైష్ణవ్ తేజ్. ఈ సినిమాతో ఏకంగా వంద కోట్ల క్లబ్‌లో చేరిన అతడు.. ఆ తర్వాత భారీ ఫ్లాప్‌ను చవి చూశాడు. ఈ క్రమంలోనే ఇటీవలే ఈ మెగా హీరో 'రంగరంగ వైభవంగా' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రానికి తెలుగు ప్రేక్షకుల నుంచి సరైన స్పందన రాలేదు. దీంతో కలెక్షన్లు చాలా తక్కువగా వచ్చాయి. ఈ నేపథ్యంలో 'రంగరంగ వైభవంగా' ఫుల్ రన్‌లో ఎంత వసూలు చేసింది? ఎన్ని కోట్ల నష్టాలను చవి చూసింది? అనే విషయాలు చూద్దాం పదండి!

రంగరంగ వైభవంగా వచ్చేశాడు

రంగరంగ వైభవంగా వచ్చేశాడు

పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా గిరీశయ్య తెరకెక్కించిన సినిమానే 'రంగరంగ వైభవంగా'. ఈ మూవీలో కేతిక శర్మ హీరోయిన్‌గా చేసింది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. దేవీ శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం సమకూర్చాడు. ఈ మూవీలో చాలా మంది ప్రముఖులు ముఖ్యమైన పాత్రలను పోషించిన విషయం తెలిసిందే.

రంగరంగ వైభవంగాకు బిజినెస్

రంగరంగ వైభవంగాకు బిజినెస్

రొమాంటిక్ లవ్ స్టోరీతో వచ్చిన 'రంగరంగ వైభవంగా' మూవీకి నైజాంలో రూ. 2.60 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.30 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 3.60 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 7.50 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, కర్నాటక, రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్‌ ఏరియాల్లో కలిపి రూ. 1 కోటితో.. ప్రపంచ వ్యాప్తంగా రూ. 8.50 కోట్లు బిజినెస్‌ను జరుపుకుంది.

బ్యాడ్ రెస్పాన్స్.. కలెక్షన్లు ఇలా

బ్యాడ్ రెస్పాన్స్.. కలెక్షన్లు ఇలా

మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన చిత్రమే 'రంగరంగ వైభవంగా'. ఈ సినిమా భారీ అంచనాలతో విడుదలైంది. కానీ, దీనికి ఆరంభంలోనే మిక్స్‌డ్ టాక్ వచ్చింది. ఫలితంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఈ సినిమాకు కలెక్షన్లు అంతగా రాలేదు. అలాగే, ప్రపంచ వ్యాప్తంగానూ ఈ సినిమా పెద్దగా ప్రభావాన్ని చూపలేకపోయింది. దీనిపై చిత్ర యూనిట్ నిరాశగా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్లు ఇలా

తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్లు ఇలా

'రంగరంగ వైభవంగా'కి తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ రన్‌లో భారీ దెబ్బ తగిలింది. ఫలితంగా నైజాంలో రూ. 1.12 కోట్లు, సీడెడ్‌లో రూ. 30 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 41 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 27 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 18 లక్షలు, గుంటూరులో రూ. 32 లక్షలు, కృష్ణాలో రూ. 28 లక్షలు, నెల్లూరులో రూ. 15 లక్షలతో కలుపుకుని రూ. 3.03 కోట్లు షేర్, రూ. 5.20 కోట్లు గ్రాస్ వసూలైంది.

వరల్డ్ వైడ్‌గా ఎంత వచ్చింది?

వరల్డ్ వైడ్‌గా ఎంత వచ్చింది?

తెలుగు రాష్ట్రాల్లో కేవలం రూ. 3.03 కోట్లు మాత్రమే రాబట్టిన 'రంగరంగ వైభవంగా' ప్రపంచ వ్యాప్తంగా నిరాశ పరిచింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 23 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 55 లక్షలు మాత్రమే వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే ముగింపు సమయానికి ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా రూ. 3.81 కోట్లు షేర్‌తో పాటు రూ. 7.05 కోట్లు గ్రాస్ మాత్రమే వచ్చింది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. నష్టమెంత

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. నష్టమెంత

వైష్ణవ్ తేజ్ - కేతిక శర్మ జంటగా నటించిన 'రంగరంగ వైభవంగా' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 8.50 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 9 కోట్లుగా నమోదైంది. ఇక, ఫుల్ రన్‌లో దీనికి రూ. 3.81 కోట్లు వచ్చాయి. అంటే రూ 5.19 కోట్లు నష్టాలతో డబుల్ డిజాస్టర్‌గా నిలిచింది.

ఆ ఓటీటీలో స్ట్రీమింగ్ మొదలు

ఆ ఓటీటీలో స్ట్రీమింగ్ మొదలు

క్రేజీ కాంబినేషన్‌లో వచ్చిన 'రంగరంగ వైభవంగా' మూవీ థియేటర్లలో ప్రేక్షకులను పెద్దగా అలరించలేకపోయింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నేటి నుంచే (అక్టోబర్ 2) నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ చిత్రం సెప్టెంబర్ 2వ తేదీన విడుదలైంది. అంటే సరిగ్గా నెల రోజులకు ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ ప్రారంభం అయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X