Uppena 15 Days Collections: ‘చెక్’ పెడుతూ పుంజుకున్న ఉప్పెన.. ప్రభాస్ రికార్డుకు చేరువైన వైష్ణవ్!
కొత్త దర్శకుడు.. హీరో హీరోయిన్ నూతన పరిచయం.. అయినప్పటికీ భారీ విజయాన్ని అందుకుని సత్తా చాటిన చిత్రం 'ఉప్పెన'. రెండు వారాల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా.. భారీ విజయాన్ని అందుకోవడంతో పాటు కలెక్షన్ల సునామీ సృష్టించింది. తద్వారా రెండు వారాలుగా ఎన్నో రికార్డులను బద్దలు కొడుతూ దూసుకుపోతోంది. రెండు మూడు రోజులుగా భారీగా పడిపోయిన ఈ మూవీ కలెక్షన్లు.. శుక్రవారం అనూహ్యంగా పుంజుకున్నాయి. పోటీగా ఎన్నో సినిమాలు ఉన్నప్పటికీ.. ఊహించని విధంగా మరోసారి పుంజుకుని సత్తా చాటింది. ఆ వివరాలు మీకోసం!

అంతా కొత్త వాళ్లే.. కానీ సత్తా చాటారు
వైష్ణవ్ తేజ్.. కృతి శెట్టి హీరో హీరోయిన్లుగా పరిచయం అయిన చిత్రం 'ఉప్పెన'. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సన ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి తొలిసారి తెలుగులో పూర్తి స్థాయి పాత్రను పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఈ సినిమాతో అందరూ సత్తా చాటారు.

మూడు రోజుల్లోనే టార్గెట్‌ను దాటేసింది
'నీ కన్ను నీలి సముద్రం' అనే పాట, టీజర్, ట్రైలర్‌లతో విడుదలకు ముందే 'ఉప్పెన' మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. తద్వారా ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కలుపుకుని రూ. 20.50 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. దీంతో ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 21 కోట్లైంది. ఈ టార్గెట్‌ను కేవలం మూడు రోజుల్లోనే పూర్తి చేసిన 'ఉప్పెన' కొత్త రికార్డు క్రియేట్ చేసింది.

15వ రోజు ఎక్కడ? ఎంత రాబట్టిందంటే
'చెక్', 'అక్షర' వంటి సినిమాలు రిలీజైనా 15వ రోజు 'ఉప్పెన' మళ్లీ పుంజుకుంది. నైజాంలో రూ. 12 లక్షలు, సీడెడ్‌లో రూ. 6 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 10 లక్షలు, ఈస్ట్‌లో రూ. 5 లక్షలు, వెస్ట్‌లో రూ. 1.50 లక్షలు, గుంటూరులో రూ. 1.80 లక్షలు, కృష్ణాలో రూ. 2.40 లక్షలు, నెల్లూరులో రూ. 1.3 లక్షలు రాబట్టింది. మొత్తంగా 15వ రోజు రూ. 40 లక్షలు షేర్, రూ. 65 లక్షలు గ్రాస్ వచ్చింది.

15 రోజులకు మొత్తం ఎంత కలెక్ట్ చేసింది?
'ఉప్పెన' మొదటి రోజు రూ. 9.35 కోట్లు, 2వ రోజు రూ. 6.86 కోట్లు, 3వ రోజు రూ. 8.26 కోట్లు, 4వ రోజు రూ. 4.17 కోట్లు, 5వ రోజు రూ. 3.12 కోట్లు, 6వ రోజు రూ. 1.93 కోట్లు, 7వ రోజు రూ. 1.44 కోట్లు, 8వ రోజు రూ. 1.13 కోట్లు, 9వ రోజు రూ. 1.49 కోట్లు, 10వ రోజు రూ. 2.61 కోట్లు, 11వ రోజు రూ. 1.15 కోట్లు, 12వ రోజు రూ. 80 లక్షలు, 13వ రోజు రూ. 49 లక్షలు, 14వ రోజు రూ. 34 లక్షలు, 15వ రోజు రూ. 40 లక్షలతో మొత్తంగా రూ. 43.56 కోట్ల షేర్, రూ. 70.20 కోట్ల గ్రాస్ అందుకుంది.

ప్రపంచ వ్యాప్తంగా ఇంత.. సగానికి సగం
రెండు తెలుగు రాష్ట్రాల్లో అదరగొట్టిన 'ఉప్పెన'.. 15 రోజుల్లో కర్నాటకతో పాటు రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.22 కోట్లు రాబట్టింది. అలాగే, ఓవర్సీస్‌లో రూ. 1.32 కోట్లు వసూలు చేసింది. దీంతో మొత్తంగా 15 రోజుల్లో 47.08 కోట్లు రాబట్టింది. అలాగే, రూ. 75.68 కోట్ల గ్రాస్‌ను అందుకుంది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ 21 కోట్లు కాగా... ఇప్పటి వరకు రూ. 26.08 కోట్లు లాభాలను ఆర్జించింది.

ప్రభాస్ రికార్డుకు చేరువైన వైష్ణవ్ తేజ్
వైష్ణవ్ తేజ్ నటించిన ఉప్పెన మూవీ 15 రోజుల్లో 47.08 కోట్లు రాబట్టింది. తద్వారా ఫిబ్రవరి నెలలో విడుదలై.. భారీ కలెక్షన్లు అందుకున్న తెలుగు చిత్రాల జాబితాలో రెండో స్థానంలో నిలిచింది. యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన 'మిర్చి' సినిమా రూ. 48.50 కోట్లతో దీని కంటే ముందు స్థానంలో ఉంది. అంటే.. రూ. 1.42 కోట్లు వసూలు చేస్తే ఉప్పెన టాలీవుడ్‌లోనే టాప్ ఫిల్మ్ అవుతుంది.


Click it and Unblock the Notifications











