twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Uppena 18 Days Collections: దారుణంగా పడిపోయిన ‘ఉప్పెన’ కలెక్షన్లు.. అయినా వైష్ణవ్ తేజ్‌దే హవా!

    |

    తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంతో మంది వారసులు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. కానీ, వారిలో చాలా తక్కువ మంది మాత్రమే తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు. అందులోనూ ఒకరిద్దరే మొదటి సినిమాతోనే భారీ విజయాలను అందుకున్నారు. ఈ జాబితాలోకే వస్తాడు మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన కొత్త హీరో పంజా వైష్ణవ్ తేజ్. 'ఉప్పెన'తో హీరోగా పరిచయం అయిన అతడు.. మూడు వారాలుగా హవాను చూపిస్తున్నాడు. తద్వారా ఎన్నో రికార్డులను క్రియేట్ చేశాడు. ఈ క్రమంలోనే మరో మైలురాయిని చేరుకునేందుకు చేరువయ్యాడు. ఆ వివరాలు మీకోసం!

    గ్రాండ్‌గా లాంచింగ్.. రికార్డుల వేట మొదలు

    గ్రాండ్‌గా లాంచింగ్.. రికార్డుల వేట మొదలు

    పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సన తెరకెక్కించిన చిత్రం 'ఉప్పెన'. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్‌గా చేసింది. కోలీవుడ్ సూపర్ స్టార్ విజయ్ సేతుపతి తొలిసారి ఫుల్ లెంగ్త్ రోల్ చేశాడు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చాడు. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.

    మూడో రోజే ముగిసింది.. లాభాల బాటలోకి

    మూడో రోజే ముగిసింది.. లాభాల బాటలోకి

    'నీ కన్ను నీలి సముద్రం' అనే పాటతో 'ఉప్పెన' సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ తర్వాత వచ్చిన టీజర్, ట్రైలర్‌తో అవి రెట్టింపయ్యాయి. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 20.50 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. దీంతో ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 21 కోట్లైంది. ఈ టార్గెట్‌ను కేవలం మూడు రోజుల్లోనే ఛేదించి లాభాల బాట పట్టిందీ సినిమా.

    18వ రోజు ఎక్కడ ఎంత రాబట్టిందో తెలుసా?

    18వ రోజు ఎక్కడ ఎంత రాబట్టిందో తెలుసా?

    18వ రోజు 'ఉప్పెన' కలెక్ష్లను భారీగా పడిపోయాయి. సోమవారం నైజాంలో రూ. 18 లక్షలు, సీడెడ్‌లో రూ. 8 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 4 లక్షలు, ఈస్ట్‌లో రూ. 4.50 లక్షలు, వెస్ట్‌లో రూ. 2 లక్షలు, గుంటూరులో రూ. 1.90 లక్షలు, కృష్ణాలో రూ. 2 లక్షలు, నెల్లూరులో రూ. 1.20 లక్షలు రాబట్టింది. మొత్తంగా 18వ రోజు రూ. 42 లక్షలు షేర్, రూ. 72 లక్షలు గ్రాస్ వచ్చింది.

    18 రోజులకు మొత్తం ఎంత వసూలు చేసింది?

    18 రోజులకు మొత్తం ఎంత వసూలు చేసింది?


    'ఉప్పెన' మొదటి రోజు రూ. 9.35 కోట్లు, 2వ రోజు రూ. 6.86 కోట్లు, 3వ రోజు రూ. 8.26 కోట్లు, 4వ రోజు రూ. 4.17 కోట్లు, 5వ రోజు రూ. 3.12 కోట్లు, 6వ రోజు రూ. 1.93 కోట్లు, 7వ రోజు రూ. 1.44 కోట్లు, 8వ రోజు రూ. 1.13 కోట్లు, 9వ రోజు రూ. 1.49 కోట్లు, 10వ రోజు రూ. 2.61 కోట్లు, 11వ రోజు రూ. 1.15 కోట్లు, 12వ రోజు రూ. 80 లక్షలు, 13వ రోజు రూ. 49 లక్షలు, 14వ రోజు రూ. 34 లక్షలు, 15వ రోజు రూ. 40 లక్షలు, 16వ రోజు రూ. 55 లక్షలు, 17వ రోజు రూ. 1.28 కోట్లు, 18వ రోజు రూ. 42 లక్షలతో మొత్తంగా రూ. 45.81 కోట్ల షేర్, రూ. 75 కోట్ల గ్రాస్ అందుకుంది.

    ప్రపంచ వ్యాప్తంగా ఎంత? లాభాలు ఏ మేర?

    ప్రపంచ వ్యాప్తంగా ఎంత? లాభాలు ఏ మేర?

    రెండు రాష్ట్రాల్లో సత్తా చాటిన 'ఉప్పెన'.. 18 రోజుల్లో కర్నాటకతో పాటు రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.28 కోట్లు రాబట్టింది. అలాగే, ఓవర్సీస్‌లో రూ. 1.35 కోట్లు వసూలు చేసింది. దీంతో మొత్తంగా ఇప్పటి వరకు 49.44 కోట్లు రాబట్టింది. అలాగే, రూ. 80 కోట్ల గ్రాస్‌ను అందుకుంది. తద్వారా ఈ మూవీ బ్రేక్ ఈవెన్ 21 కోట్లు కాగా... ఇప్పటి వరకు రూ. 28.44 కోట్లు లాభాలను ఆర్జించింది.

    పడిపోయినా... వాటితో పోల్చుకుంటే గొప్పే

    పడిపోయినా... వాటితో పోల్చుకుంటే గొప్పే

    17వ రోజు రూ. 1.28 కోట్లు రాబట్టిన 'ఉప్పెన'.. 18వ రోజు మాత్రం కేవలం రూ. 42 లక్షలే వసూలు చేసింది. అంటే ఈ సినిమా ప్రభావం తగ్గిపోయిందని కాదు.. సోమవారం ప్రదర్శన అయిన మిగిలిన చిత్రాలతో పోల్చుకుంటే ఇవే బెస్ట్ ఫిగర్స్ అని చెప్పొచ్చు. అందులోనూ మూడో వారంలో కూడా వైష్ణవ్ తేజ్ సినిమా ఈ మొత్తం రాబట్టిందంటే గొప్పే అని అంటున్నారు ట్రేడ్ పండితులు.

    English summary
    Vaishnav Tej is a young actor who will soon be introduced as a hero from the mega family. Uppena, produced by Sukumar Production, is to be released in the summer. But an unexpectedly delayed release of the lock-down blow. Official announcement has not yet been received from the film unit as to when it will be released.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X