Uppena 20 Days Collections: బుధవారం సత్తా చాటిన ‘ఉప్పెన’.. అన్నింటికంటే ఎక్కువ కలెక్షన్లు

లాక్‌డౌన్ తర్వాత వచ్చే సినిమాలన్నింటికీ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. మరీ ముఖ్యంగా సంక్రాంతి సీజన్ నుంచి గత వారం వరకు విడుదలైన చాలా చిత్రాలు సూపర్ డూపర్ హిట్లు అయ్యాయి. అన్నింటి కంటే ఎక్కువ లాభాలు అందుకుని ఈ ఏడాది బ్లాక్ బస్టర్ హిట్ల జాబితాలో మొదటి స్థానంలో కొనసాగుతోన్న చిత్రం 'ఉప్పెన'. ఆరంభం నుంచే సత్తా చాటుతోన్న ఈ సినిమా.. బుధవారం వసూళ్ల విషయంలో మరోసారి హవాను చూపించింది. ప్రస్తుతం ఉన్న సినిమాలన్నీంటి కంటే ఎక్కువ రాబట్టి అదరగొట్టేసింది. ఈ మూవీ 20 రోజుల బాక్సాఫీస్ రిపోర్టు మీకోసం!

Recommended Video

Uppena Remake కోసం ఇతర రాష్ట్రాల్లో పోటీ | Jason Sanjay Launch | Ishaan Khatter
కొత్త వాళ్లే.. కానీ సరికొత్త చరిత్రను సృష్టించారు

కొత్త వాళ్లే.. కానీ సరికొత్త చరిత్రను సృష్టించారు

పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అయిన చిత్రం 'ఉప్పెన'. కొత్త దర్శకుడు బుచ్చిబాబు సన తెరకెక్కించిన ఈ చిత్రం ద్వారా కృతి శెట్టి కూడా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. అలాగే, విజయ్ సేతుపతి ఫుల్ లెంగ్త్ రోల్ చేశాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. కొత్త వాళ్లే అయినా ఈ సినిమాతో సరికొత్త చరిత్రను సృష్టించారంతా.

మిక్స్‌డ్ టాక్‌తో షాక్.. మూడో రోజే టార్గెట్ డన్

మిక్స్‌డ్ టాక్‌తో షాక్.. మూడో రోజే టార్గెట్ డన్

పలు కారణాల వల్ల రిలీజ్‌కు ముందే భారీ స్థాయిలో అంచనాలు ఏర్పరచుకుంది 'ఉప్పెన'. ఈ కారణంగానే దీని బిజినెన్ రూ. 20.50 కోట్లు జరిగింది. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 21 కోట్లైంది. భారీ హైప్‌తో వచ్చిన దీనికి మొదట్లో మిక్స్‌డ్ టాక్‌ వచ్చింది. దీంతో ఇది హిట్ అవుతుందా అని అంతా అనుకున్నారు. కానీ, ఈ టార్గెట్‌ను కేవలం మూడు రోజుల్లోనే ఛేదించి లాభాల బాట పట్టింది.

20వ రోజు ఎక్కడ? ఎంత? రాబట్టిందో తెలుసా?

20వ రోజు ఎక్కడ? ఎంత? రాబట్టిందో తెలుసా?

20వ రోజు 'ఉప్పెన' కలెక్ష్లను బాగా వచ్చాయి. బుధవారం నైజాంలో రూ. 6 లక్షలు, సీడెడ్‌లో రూ. 5 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 3 లక్షలు, ఈస్ట్‌లో రూ. 2.80 లక్షలు, వెస్ట్‌లో రూ. 1 లక్షలు, గుంటూరులో రూ. 1.10 లక్షలు, కృష్ణాలో రూ. 1.20 లక్షలు, నెల్లూరులో రూ. 60 వేలు రాబట్టింది. మొత్తంగా 20వ రోజు ఈ మూవీకి రూ. 21 లక్షలు షేర్, రూ. 38 లక్షలు గ్రాస్ వచ్చింది.

20 రోజులకు మొత్తం ఎంత వసూలు చేసింది?

20 రోజులకు మొత్తం ఎంత వసూలు చేసింది?

'ఉప్పెన' మొదటి రోజు రూ. 9.35 కోట్లు, 2వ రోజు రూ. 6.86 కోట్లు, 3వ రోజు రూ. 8.26 కోట్లు, 4వ రోజు రూ. 4.17 కోట్లు, 5వ రోజు రూ. 3.12 కోట్లు, 6వ రోజు రూ. 1.93 కోట్లు, 7వ రోజు రూ. 1.44 కోట్లు, 8వ రోజు రూ. 1.13 కోట్లు, 9వ రోజు రూ. 1.49 కోట్లు, 10వ రోజు రూ. 2.61 కోట్లు, 11వ రోజు రూ. 1.15 కోట్లు, 12వ రోజు రూ. 80 లక్షలు, 13వ రోజు రూ. 49 లక్షలు, 14వ రోజు రూ. 34 లక్షలు, 15వ రోజు రూ. 40 లక్షలు, 16వ రోజు రూ. 55 లక్షలు, 17వ రోజు రూ. 1.28 కోట్లు, 18వ రోజు రూ. 42 లక్షలు, 19వ రోజు రూ. 29 లక్షలు, 20వ రోజు రూ. 21 లక్షలతో మొత్తంగా రూ. 46.31 కోట్ల షేర్, రూ. 75.90 కోట్ల గ్రాస్ అందుకుంది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంత? లాభాలు ఏ రేంజ్‌లో?

ప్రపంచ వ్యాప్తంగా ఎంత? లాభాలు ఏ రేంజ్‌లో?

స్థానికంగా సత్తా చాటిన 'ఉప్పెన'.. 20 రోజుల్లో కర్నాటకతో పాటు రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.29 కోట్లు రాబట్టింది. అలాగే, ఓవర్సీస్‌లో రూ. 1.36 కోట్లు వసూలు చేసింది. దీంతో మొత్తంగా ఇప్పటి వరకు 49.96 కోట్లు రాబట్టింది. అలాగే, రూ. 80.94 కోట్ల గ్రాస్‌ను అందుకుంది. తద్వారా ఈ మూవీ బ్రేక్ ఈవెన్ 21 కోట్లు కాగా... ఇప్పటి వరకు రూ. 28.96 కోట్లు లాభాలను ఆర్జించింది.

ఇంకా అంత సాధిస్తే.. మైలురాయిని చేరినట్లేగా

ఇంకా అంత సాధిస్తే.. మైలురాయిని చేరినట్లేగా

బుధవారం ఒక్కరోజే ప్రదర్శితమైన సినిమాలు అన్నింటిలోనూ 'ఉప్పెన'కే ఎక్కువ కలెక్షన్లు వచ్చాయి. మిగిలిన చిత్రాలన్నీ దీని ముందు వెలవెలబోయాయి. దీంతో ఈ సినిమా మొత్తం వసూళ్లు రూ. 49.96 కోట్లు అయ్యాయి. మరో నాలుగు వేల రూపాయలు వసూలు చేస్తే.. వైష్ణవ్ తేజ్ మొదటి సినిమా రూ. యాభై కోట్ల మైలురాయిని చేరుకుంటుంది. ఇది కొత్త చరిత్ర అవుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X