Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్‌మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
Uppena 22 Days Collections: అన్ని సినిమాలున్నా తగ్గని ‘ఉప్పెన’.. వాటితో పోల్చితే కలెక్షన్లు ఎక్కువే
టాలీవుడ్లోనే మెగా ఫ్యామిలీది ప్రత్యేకమైన స్థానం. అలాంటి కుటుంబం నుంచి ఎవరైనా హీరోగా పరిచయం అవుతుంటే.. ఆ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఉంటాయి. వాటిని అందుకోగలిగేలా ఆ మూవీ ఉంటేనే హిట్ అవుతుంది. ఏమాత్రం తేడా వచ్చినా ఇక అంతే సంగతులు. ఇలాంటి పరిస్థితుల్లో 'ఉప్పెన' అనే సినిమా ద్వారా తెలుగు సినీ ఇండస్ట్రీకి హీరోగా పరిచయం అయ్యాడు పంజా వైష్ణవ్ తేజ్. మూడు వారాల క్రితం విడుదలైన ఈ చిత్రం ఘన విజయాన్ని అందుకుంది. కలెక్షన్ల పరంగానూ సత్తా చాటింది. ఈ సినిమా 22 రోజుల బాక్సాఫీస్ రిపోర్టు మీకోసం!
సరైన సినిమాతోనే లాంచ్ అయిన వైష్ణవ్ తేజ్
పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా బుచ్చిబాబు సన తెరకెక్కించిన చిత్రమే 'ఉప్పెన'. ఈ సినిమా ద్వారా కృతి శెట్టి కూడా టాలీవుడ్‌కు హీరోయిన్గా పరిచయం అయింది. అలాగే, విజయ్ సేతుపతి తొలిసారి పూర్తి స్థాయి పాత్రలో నటించాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఈ చిత్రం ద్వారా హీరో, హీరోయిన్, దర్శకుడికి సరైన లాంచింగ్ దక్కింది.
టాక్ అలా.. కలెక్షన్లు ఇలా.. మూడు రోజుల్లోనే
రిలీజ్‌కు ముందే మంచి బజ్ ఏర్పరచుకుంది ఉప్పెన మూవీ. ఈ కారణంగానే ఈ చిత్రానికి బిజినెస్ ప్రపంచ వ్యాప్తంగా రూ. 20.50 కోట్లు జరిగింది. రూ. 21 కోట్లు వసూలు చేస్తే హిట్ అయినట్లు లెక్క. ఇలాంటి పరిస్థితుల్లో ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది. దీంతో ఈ సినిమా కలెక్షన్లపై ప్రభావం ఉంటుందనుకున్నారంతా. కానీ, ఊహించని విధంగా మూడు రోజుల్లోనే టార్గెట్ పూర్తయింది.
22వ రోజు ఎక్కడ? ఎంత? వసూలు చేసింది?
శుక్రవారం దాదాపు ఆరేడు సినిమాలు విడుదలయ్యాయి. గత వారంలో నితిన్ నటించిన 'చెక్' సహా కొన్ని సినిమాలు ఇంకా ప్రదర్శితం అవుతున్నాయి. అయినప్పటికీ 22వ రోజు 'ఉప్పెన' కలెక్షన్లు బాగానే వచ్చాయి. శుక్రవారం ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ. 9 లక్షలు రాబ్టటింది. దీంతో వైష్ణవ్ తేజ్ సినిమా ప్రభావం ఇంకా తగ్గలేదని నిరూపణ అయింది.
22 రోజులకు కలిపి మూవీ ఎంత రాబట్టిందంటే?
'ఉప్పెన' మొదటి రోజు రూ. 9.35 కోట్లు, 2వ రోజు రూ. 6.86 కోట్లు, 3వ రోజు రూ. 8.26 కోట్లు, 4వ రోజు రూ. 4.17 కోట్లు, 5వ రోజు రూ. 3.12 కోట్లు, 6వ రోజు రూ. 1.93 కోట్లు, 7వ రోజు రూ. 1.44 కోట్లు, 8వ రోజు రూ. 1.13 కోట్లు, 9వ రోజు రూ. 1.49 కోట్లు, 10వ రోజు రూ. 2.61 కోట్లు, 11వ రోజు రూ. 1.15 కోట్లు, 12వ రోజు రూ. 80 లక్షలు, 13వ రోజు రూ. 49 లక్షలు, 14వ రోజు రూ. 34 లక్షలు, 15వ రోజు రూ. 40 లక్షలు, 16వ రోజు రూ. 55 లక్షలు, 17వ రోజు రూ. 1.28 కోట్లు, 18వ రోజు రూ. 42 లక్షలు, 19వ రోజు రూ. 29 లక్షలు, 20వ రోజు రూ. 21 లక్షలు, 21వ రోజు రూ. 14లక్షలు, 22వ రోజు రూ. 9 లక్షలతో మొత్తంగా రూ. 46.54 కోట్ల షేర్, రూ. 76.28 కోట్ల గ్రాస్ అందుకుంది.
ప్రపంచ వ్యాప్తంగా ఎంత? లాభాలు ఏ రేంజ్?
తెలుగు రాష్ట్రాల్లో రాణించిన 'ఉప్పెన'.. 22 రోజుల్లో కర్నాటకతో పాటు రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.30 కోట్లు రాబట్టింది. అలాగే, ఓవర్సీస్లో రూ. 1.37 కోట్లు వసూలు చేసింది. దీంతో మొత్తంగా రూ. 50.21 కోట్లు రాబట్టింది. అలాగే, రూ. 81.40 కోట్ల గ్రాస్‌ను అందుకుంది. తద్వారా ఈ మూవీ బ్రేక్ ఈవెన్ 21 కోట్లు కాగా... ఇప్పటి వరకు రూ. 29.21 కోట్లు లాభాలను అందుకుంది.