Uppena 4 Weeks Collections: ఆ మార్క్ దాటేసిన ‘ఉప్పెన’.. నాలుగు వారాల్లో ఎంత లాభం వచ్చిందంటే!
ప్రేక్షకుల ముందుకు వచ్చే సినిమాల్లో కొన్నింటికి మాత్రమే ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. అలాంటివే విడుదలకు ముందే భారీ స్థాయిలో అంచనాలను ఏర్పరచుకుంటాయి. ఈ తరహా చిత్రాలు కంటెంట్ బాగుంటే ప్రేక్షకుల నుంచి ఆదరణను అందుకుంటాయి. లేకుంటే డిజాస్టర్లుగా మిగులుతుంటాయి. ఇలా స్పెషల్ మూవీగా విడుదలైన చిత్రమే 'ఉప్పెన'. భారీ హైప్ నడుమ ఆడియెన్స్ ముందుకు వచ్చిన ఈ చిత్రం ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఫలితంగా కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఇక, ఈ మూవీ నాలుగు వారాల బాక్సాఫీస్ రిపోర్టును ఒకసారి పరిశీలిస్తే...

‘ఉప్పెన’ మొదలైందిలాగే.. వాళ్లకిది మొదటిది
పంజా వైష్ణవ్ తేజ్ - కృతి శెట్టి జంటగా నటిస్తూ టాలీవుడ్‌కు పరిచయమైన చిత్రమే 'ఉప్పెన'. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సన రూపొందించిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. ఇందులో కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి నెగెటివ్ రోల్‌ను చేశాడు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.

అనుకున్నదొకటి.. అయిందొకటి.. మూడో రోజే
మెగా ఫ్యామిలీకి చెందిన హీరో ఎంట్రీ ఇస్తుండడంతో పాటు 'నీ కన్ను నీలి సముద్రం' పాట, టీజర్, ట్రైలర్‌లకు భారీ రెస్పాన్స్ రావడంతో ఉప్పెనపై అంచనాలు ఏర్పడ్డాయి. అందుకే ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రానికి రూ. 20.50 కోట్లు వ్యాపారం జరిగింది. రూ. 21 కోట్లు టార్గెట్‌తో రిలీజ్ అయిన దీనికి మిక్స్‌డ్ టాక్ రావడంతో కలెక్షన్లు కష్టమేనని అనుకున్నారు. మూడో రోజే టార్గెట్ ఫినీస్ చేసింది.

28వ రోజు.. వాటి వల్ల పడిపోయిన కలెక్షన్లు
'ఉప్పెన' సినిమా విడుదలై దాదాపు నెల రోజులు కావొచ్చింది. ఈ మధ్యలో ఎన్నో చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.. వెళ్లాయి. కానీ అది మాత్రం ఏవరేజ్‌గా కలెక్షన్లు అందుకుంటూ ముందుకెళ్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో మహా శివరాత్రి కానుకగా మూడు తెలుగు సినిమాలు విడుదలయ్యాయి. దీంతో 28వ రోజు ఉప్పెనకు రూ. 6 లక్షలు మాత్రమే కలెక్షన్లు వచ్చాయి.

28 రోజులకు కలిపి మొత్తం ఎంత వచ్చిదంటే?
'ఉప్పెన' మొదటి రోజు రూ. 9.35 కోట్లు, 2వ రోజు రూ. 6.86 కోట్లు, 3వ రోజు రూ. 8.26 కోట్లు, 4వ రోజు రూ. 4.17 కోట్లు, 5వ రోజు రూ. 3.12 కోట్లు, 6వ రోజు రూ. 1.93 కోట్లు, 7వ రోజు రూ. 1.44 కోట్లు, 8వ రోజు రూ. 1.13 కోట్లు, 9వ రోజు రూ. 1.49 కోట్లు, 10వ రోజు రూ. 2.61 కోట్లు, 11వ రోజు రూ. 1.15 కోట్లు, 12వ రోజు రూ. 80 లక్షలు, 13వ రోజు రూ. 49 లక్షలు, 14వ రోజు రూ. 34 లక్షలు, 15వ రోజు రూ. 40 లక్షలు, 16వ రోజు రూ. 55 లక్షలు, 17వ రోజు రూ. 1.28 కోట్లు, 18వ రోజు రూ. 42 లక్షలు, 19వ రోజు రూ. 29 లక్షలు, 20వ రోజు రూ. 21 లక్షలు, 21వ రోజు రూ. 14లక్షలు, 22వ రోజు రూ. 9 లక్షలు, 23వ రోజు రూ. 13 లక్షలు, 24వ రోజు రూ. 24 లక్షల, 25వ రోజు రూ. 13 లక్షలు, 26వ రోజు రూ. 10 లక్షలతో, 27వ రోజు రూ. 9 లక్షలు, 28వ రోజు రూ. 6 లక్షలతో మొత్తంగా రూ. 47.29 కోట్ల షేర్, రూ. 77.60 కోట్ల గ్రాస్ అందుకుంది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంత? లాభాలు ఏ రేంజ్‌లో?
28 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో రూ. 47.29 కోట్లతో కలెక్షన్ల సునామీ సృష్టించిన 'ఉప్పెన'.. కర్నాటక రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.35 కోట్లు రాబట్టింది. అలాగే, ఓవర్సీస్‌లో రూ. 1.38 కోట్లు వసూలు చేసింది. దీంతో మొత్తంగా రూ. 51.02 కోట్లు షేర్.. రూ. 83.60 కోట్ల గ్రాస్‌ను అందుకుంది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ 21 కోట్లు కాగా... ఇప్పటి వరకు రూ. 30.02 కోట్లు లాభాలను అందుకుంది.

‘ఉప్పెన’ నాలుగు వారాల్లో ఏం సాధించిందంటే!
'ఉప్పెన' సినిమా విడుదలై నాలుగు వారాలు పూర్తయ్యాయి. ఈ ప్రయాణంలో ఈ సినిమా ఎన్నో మైలురాళ్లను రికార్డులను క్రియేట్ చేసింది. మరీ ముఖ్యంగా పంజా వైష్ణవ్ తేజ్ ఖాతాలో ఎన్నో అరుదైన ఘనతలు వచ్చి చేరాయి. ఇక, ఇప్పటి వరకు ఈ సినిమా రూ. 51 కోట్లు కలెక్షన్ల మార్కును దాటేయడం కొసమెరుపు. అంతేకాదు, రూ. 30 కోట్ల లాభాలనూ దాటేసింది.


Click it and Unblock the Notifications











