Don't Miss!
- News మంగళగిరిలో దుమ్మురేపిన నారా లోకేష్ నామినేషన్ ర్యాలీ!!
- Finance 9 రోజులుగా 54 శాతం పెరిగిన స్టాక్.. బ్రోకరేజ్ తాజా టార్గెట్ ధర ఇదే.. మీరూ కొంటున్నారా..??
- Sports CSK జట్టులో కొత్త ప్లేయర్: రోహిత్-కోహ్లి వికెట్లు తీసిన ఘనుడు
- Technology 24GB వరకు RAM, 50MP సెల్ఫీ కెమెరా, మూడు 50MP వెనక కెమెరాలతో కొత్త ఫోన్ లాంచ్!
- Lifestyle Gruha Pravesham Wishes in Telugu : గృహప్రవేశం శుభాకాంక్షలను ఇలా తెలపండి..
- Automobiles జాన్ అబ్రహం మనసుదోచిన కొత్త బైక్ ఇదే!.. మీరూ చూడండి
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
Uppena Collections: నాలుగు సినిమాలను దాటిన ‘ఉప్పెన’.. వైష్ణవ్ తేజ్ ఖాతాలో మరో రికార్డు
2020వ సంవత్సరం రెండు భారీ ఇండస్ట్రీ హిట్లతో మొదలైంది. అయితే, ఆ తర్వాత కరోనా వల్ల సినిమాల విడుదల ఆగిపోవడంతో.. 2021 బాక్సాఫీస్ ఫైట్ గురించే అంతా ఆసక్తిగా ఎదురు చూశారు. ఇలాంటి పరిస్థితుల్లో సంక్రాంతి సీజన్లో విడుదలైన దాదాపు అన్ని సినిమాలూ సూపర్ డూపర్ హిట్లుగా నిలవడంతో పాటు కలెక్షన్ల పరంగానూ దుమ్ము దులిపేశాయి. ఈ క్రమంలోనే ఫిబ్రవరి నెల కూడా 'ఉప్పెన' విజయంతో గ్రాండ్‌గా జరిగింది. ఈ చిత్రం ఊహించని రీతిలో స్పందనను అందుకొని ఎనిమిదో రోజు కూడా భారీ కలెక్షన్లు రాబట్టింది. తద్వారా మరో రికార్డును సాధించింది. ఆ వివరాలు మీకోసం!
వాళ్ల పరిచయం గ్రాండ్‌గా.. మంచి ఔట్పుట్
మెగా ఫ్యామిలీ నుంచి వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అయిన చిత్రమే 'ఉప్పెన'. కృతి శెట్టి హీరో హీరోయిన్గా నటించిన ఈ సినిమాను సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సన తెరకెక్కించాడు. స్టార్ హీరో విజయ్ సేతుపతి తెలుగులో తొలిసారి ఫుల్ లెంగ్త్ రోల్ చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. వీళ్లంతా మంచి ఔట్పుట్ ఇచ్చారు.
టాక్ ఒకలా.. స్పందన మరోలా.. అదిరింది
ప్రేమికుల రోజు సందర్భంగా 'ఉప్పెన' మూవీ ఫిబ్రవరి 12న విడుదలైంది. మొదటి రోజే మిక్స్డ్ టాక్‌ను తెచ్చుకుందీ సినిమా. దీంతో ఈ మూవీ ఫలితంపై అందరిలోనూ ఎన్నో అనుమానాలు వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లోనూ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో సక్సెస్ అయిందీ సినిమా. తద్వారా కలెక్షన్లు కూడా భారీగానే వస్తున్నాయి. దీంతో ఎన్నో రికార్డులు బద్దలయ్యాయి.
ఉఫ్ అన్న ఉప్పెన టార్గెట్... లాభాల పంట
పాట, టీజర్, ట్రైలర్‌తో రిలీజ్‌కు ముందే 'ఉప్పెన'పై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. దీంతో ఈ చిత్రానికి రూ. 20.50 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగడంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 21 కోట్లు అనుకున్నారు. హీరో మొదటి సినిమా కావడంతో అది కష్టం అని టాక్ వినిపించింది. కానీ, అందరి అంచనాలనూ తలకిందులు చేస్తూ దీన్ని కేవలం మూడు రోజుల్లోనే పూర్తి చేసిందీ మూవీ.
ఎనిమిదో రోజు ఎక్కడ? ఎంత రాబట్టింది?
ఉప్పెన ఎనిమిదో రోజూ మంచి స్పందననే అందుకుంది. ప్రాంతాల వారిగా చూస్తే.. నైజాంలో రూ. 31 లక్షలు, సీడెడ్‌లో రూ. 18 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 26 లక్షలు, ఈస్ట్‌లో రూ. 13 లక్షలు, వెస్ట్‌లో రూ. 6 లక్షలు, గుంటూరులో రూ. 7 లక్షలు, కృష్ణాలో రూ. 7.1 లక్షలు, నెల్లూరులో రూ. 5 లక్షలు రాబట్టింది. మొత్తంగా నాలుగో రోజు రూ. 1.13 కోట్లు షేర్, రూ. 1.9 కోట్ల గ్రాస్ వచ్చింది.
ఎనిమిదో రోజు అలా.. మొత్తంగా ఎంతంటే?
మొదటి నుంచీ 'ఉప్పెన' మంచి కలెక్షన్లు రాబడుతోంది. రెండు రాష్ట్రాల్లో మొదటి రోజు రూ. 9.35 కోట్లు, రెండో రోజు రూ. 6.86 కోట్లు, మూడో రోజు రూ. 8.26 కోట్లు, నాలుగో రోజు రూ. 4.17 కోట్లు, ఐదో రోజు రూ. 3.12 కోట్లు, ఆరో రోజు రూ. 1.93 కోట్లు, ఏడో రోజు రూ. 1.44 కోట్లు, ఎనిమిదో రోజు రూ. 1.13 కోట్లు రాబట్టింది. మొత్తంగా రూ. 36.26 కోట్ల షేర్, రూ. 58.50 కోట్ల గ్రాస్ అందుకుంది.
వైష్ణవ్ తేజ్ ఖాతాలో మరో రికార్డు నమోదు
మొదటి రోజు నుంచి వైష్ణవ్ తేజ్ ఖాతాలో అరుదైన రికార్డులు వచ్చి చేరుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఎనిమిదో రోజు ఉప్పెన మూవీ రూ. 1.13 కోట్లు వసూలు చేయడంతో.. ఎక్కువ కలెక్ట్ చేసిన మీడియం రేంజ్ చిత్రాల్లో ఇది ఏడో స్థానంలో నిలిచింది. ఎనిమిదో రోజు జాబితాలో గీత గోవిందం రూ. 3.25 కోట్లతో మొదటి స్థానంలో ఉండగా.. 'అఆ' రెండో స్థానంలో ఉంది.