ఉప్పెన మూవీ ఫస్ట్ డే మూవీ కలెక్షన్స్.. వైష్ణవ్ తేజ్ స్టామినా ఎంతంటే!
మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతూ తెరకెక్కిన ఉప్పెన చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఉప్పెన చిత్రం విడుదలకు ముందే భారీ అంచనాలు అందుకొన్నది. బుచ్చిబాబు, కృతి శెట్టి తొలి పరిచయంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. వారికి ఈ చిత్రం ఎలాంటి ఫలితాన్ని అందించే అవకాశముందనే విషయాన్ని తెలుసుకొందాం.

22 కోట్లకుపైగా ప్రీ రిలీజ్ బిజినెస్
ఉప్పెన చిత్రం ప్రీ రిలీజ్ రికార్డు స్థాయిలో జరిగింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.22 కోట్ల మేర జరిగింది. ఒక డెబ్యూట్ హీరో సినిమాకు ఈ రేంజ్‌లో బిజినెస్ జరగడం ఈ మధ్య కాలంలో ఇదే మొదటిసారి కావడం సినీ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేసింది.

తెలుగు రాష్ట్రాల్లో 20 కోట్లు బిజినెస్
ఇక ఉప్పెన చిత్రం తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం బిజినెస్ రూ.20 కోట్ల మేర జరిగింది. ఇక కర్ణాటక, మిగితా రాష్ట్రాల్లోను, ఓవర్సీస్‌లో సుమారు కలిపి సుమారు రూ.2 కోట్ల మేర జరిగినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాంతో ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.30 కోట్ల వరకు రాబట్టాల్సి ఉంటుంది.

ప్రేమికుల రోజు కానుకగా
ఉప్పెన సినిమా బిజినెస్ విషయాన్ని పక్కన పెడితే ఈ చిత్రం ప్రేమికుల రోజు కానుకగా సినిమా రిలీజ్ అయింది. ఇటీవల కాలంలో క్రాక్ లాంటి చిత్రాల బిజినెస్‌ను అధిగమించడంతో ఉప్పెన చిత్రం బిజినెస్ జరిగిన మొత్తాన్ని రాబడుతుందా అనే చర్చ జరుగుతుంది.

డివైడ్ టాక్‌తో ఉప్పెన మూవీ
ఇలాంటి పరిస్థితుల మధ్య థియేటర్లలో 100 శాతం అక్కుపెన్సీతో రిలీజైన ఉప్పెన చిత్రం పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకోలేకపోయింది. డివైడ్ టాక్‌ను ఈ చిత్రం సొంతం చేసుకోవడం కాస్త ఆలోచించాల్సిన విషయం అనే టాక్ ఇండస్ట్రీలో మొదలైంది.

తొలి రోజు రూ.5 కోట్లకుపైగానే
ఇక ఉప్పెన చిత్రం తొలి రోజు అంచనాలు భారీగానే ఉన్నాయి. రిలీజ్‌కు ముందు ఈ సినిమాపై ఉన్న సానుకూల స్పందన కారణంతో ఓపెనింగ్స్ భారీగానే నమోదైనట్టు ట్రేడ్ వర్గాల సమాచారం. ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం తొలి రోజు ఉప్పెన చిత్రం రూ.5 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











