Uppena day 2 Collections: టాలీవుడ్ టాప్ 10 సినిమాల్లో ‘ఉప్పెన’.. చరిత్ర సృష్టించబోతున్న వైష్ణవ్ తేజ్!

సాధారణంగా హీరో పరిచయ సినిమా అంటే ఎన్నో అంచనాలు ఉంటాయి. అలాంటిది తెలుగు సినీ ఇండస్ట్రీలోనే ప్రత్యేకమైన ఫ్యామిలీ మెగా కాంపౌండ్‌ నుంచి వచ్చే హీరో అయితే.. ఏ రేంజ్ ఎక్స్‌పెక్టెషన్స్ ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందులోనూ ప్యూర్ లవ్ స్టోరీతో ఆ హీరో ఎంట్రీ ఇస్తుంటో.. అందరి దృష్టీ ఆ సినిమా మీదే ఉంటుంది. ఇప్పుడిదే పరిస్థితిని ఎదుర్కొంటోన్నాడు పంజా వైష్ణవ్ తేజ్. రెండు రోజుల క్రితం 'ఉప్పెన' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అతడు.. ఫస్ట్ హిట్‌ను అందుకున్నాడు. అదే సమయంలో కలెక్షన్ల పరంగా రికార్డులు క్రియేట్ చేశాడు. ఆ వివరాలు మీకోసం!

కొత్త డైరెక్టర్‌ను నమ్మిన కొత్త హీరో వైష్ణవ్ తేజ్

కొత్త డైరెక్టర్‌ను నమ్మిన కొత్త హీరో వైష్ణవ్ తేజ్

సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దర్శకత్వంలో పంజా వైష్ణవ్ తేజ్ నటిస్తోన్న చిత్రమే 'ఉప్పెన'. బడా ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోన్న ఈ సినిమాలో కృతీ శెట్టి హీరోయిన్‌గా నటించింది. తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి నెగెటివ్ పాత్రను పోషించారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమా ప్యూర్ లవ్ స్టోరీతో తెరకెక్కింది. ఈ మూవీ శుక్రవారం విడుదలైంది.

అంచనాలకు తగ్గట్లుగానే... వాళ్లంతా అదుర్స్

అంచనాలకు తగ్గట్లుగానే... వాళ్లంతా అదుర్స్


'ఉప్పెన'లోని 'నీ కన్ను నీలి సముద్రం' పాటతో ఒక్కసారిగా హైప్ వచ్చింది. అందుకు అనుగుణంగానే మొదటి రోజు విడుదలైన అన్ని ప్రాంతాల్లో ఈ సినిమాకు మంచి టాక్ వచ్చింది. మొదటి సినిమానే అయినా హీరోహీరోయిన్లు ఆకట్టుకున్నారు. విజయ్ సేతుపతి, దేవీ శ్రీ ప్రసాద్ సినిమాకు హైలైట్ అని చెప్పొచ్చు. ఇక, ఇందులోని డిఫరెంట్ క్లైమాక్స్ గురించి అంతా మాట్లాడుతున్నారు.

భారీ స్థాయిలో బిజినెస్... బ్రేక్ ఈవెన్ టార్గెట్

భారీ స్థాయిలో బిజినెస్... బ్రేక్ ఈవెన్ టార్గెట్

మెగా హీరో ఇంట్రో సినిమా కావడంతో 'ఉప్పెన' సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా జరిగింది. ఈ సినిమా నైజాం హక్కులు రూ. 6 కోట్లు, సీడెడ్ రైట్స్ రూ. 3 కోట్లు, ఆంధ్రా ప్రాంత హక్కులు రూ 10 కోట్లు వరకూ అమ్ముడు పోయాయి. ఓవర్సీస్‌తో కలుపుకుంటే మొత్తంగా రూ. 20.50 కోట్ల వ్యాపారం జరిగింది. దీంతో ఈ మూవీ రూ. 21 కోట్లు వసూలు చేస్తే బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను చేరుకుంటుంది.

టాక్‌తో సంబంధం లేకుండా... కలెక్షన్ల వర్షం

టాక్‌తో సంబంధం లేకుండా... కలెక్షన్ల వర్షం

పాటతో అంచనాలు పెరిగిపోవడం.. మెగా ఫ్యామిలీ కూడా మద్దతుగా ఉండడంతో 'ఉప్పెన' సినిమాకు రికార్డు స్థాయిలో కలెక్షన్లు వచ్చాయి. ఈ సినిమా మొదటి రోజు రూ. 9.35 కోట్లు షేర్ రాబట్టింది. అలాగే, రూ. 15.10 కోట్లు గ్రాస్ కూడా సంపాదించింది. దీంతో ఈ సినిమా పేరిట ఎన్నో రికార్డులు నమోదయ్యాయి. తద్వారా మొదటి సినిమాతోనే సత్తా చాటాడు మెగా హీరో వైష్ణవ్ తేజ్.

రెండో రోజూ అదే రేంజ్‌లో... కలెక్షన్ల ‘ఉప్పెన’

రెండో రోజూ అదే రేంజ్‌లో... కలెక్షన్ల ‘ఉప్పెన’


మొదటి రోజు అదిరిపోయే కలెక్షన్లు సాధించి ఎన్నో రికార్డులను క్రియేట్ చేసిన 'ఉప్పెన'.. రెండో రోజు కూడా అదే జోరును చూపించింది. తద్వారా చాలా ప్రాంతాల్లో హౌస్‌ఫుల్ షోలలో అదరగొట్టేసింది. దీంతో రెండో రోజు రికార్డు స్థాయిలో రూ. 6.86 కోట్లు షేర్.. రూ. 10.80 కోట్లు గ్రాస్ వసూలు చేసింది. మొత్తంగా రెండు రోజులకు కలిపి రూ. 16.21 కోట్ల షేర్, రూ. 25.80 కోట్ల గ్రాస్ అందుకుంది.

రెండు రోజు ఎక్కడ? ఎంత? వసూలు చేసింది?

రెండు రోజు ఎక్కడ? ఎంత? వసూలు చేసింది?

ప్రపంచ వ్యాప్తంగా వెయ్యికి పైగా థియేటర్లలో విడుదలైన ఉప్పెన.. రెండో రోజూ మంచి స్పందనను అందుకుంది. తద్వారా ప్రాంతాల వారిగా చూస్తే.. నైజాంలో రూ. 2.32 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.18 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 1.23 కోట్లు, ఈస్ట్‌లో రూ. 63.01 లక్షలు, వెస్ట్‌లో రూ. 32 లక్షలు, గుంటూరులో రూ. 46 లక్షలు, కృష్ణాలో రూ. 49 లక్షలు, నెల్లూరులో రూ. 23 లక్షలు రాబట్టింది.

టాలీవుడ్ టాప్ -10 చిత్రాల జాబితాలో ఉప్పెన

టాలీవుడ్ టాప్ -10 చిత్రాల జాబితాలో ఉప్పెన

రెండో రోజు రూ. 6.86 కోట్లు షేర్ అందుకున్న ఉప్పెన టాలీవుడ్‌లోనే టాప్ -10 చిత్రాల జాబితాలో చేరింది. రెండో రోజు అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో 'సాహో' (రూ. 10.55 కోట్లు) మొదటి స్థానంలో ఉండగా.. వైష్ణవ్ తేజ్ మూవీ పదో స్థానానికి చేరుకుంది. అలాగే, మీడియం రేంజ్ చిత్రాల జాబితాలో మొదటి స్థానంలో నిలిచింది. రెండో స్థానంలో 'మజిలీ' ఉంది.

Recommended Video

Uppena Movie First Day Collections | Vaishnav Tej Record
అది కూడా వస్తే టాలీవుడ్ రికార్డు బద్దలే!

అది కూడా వస్తే టాలీవుడ్ రికార్డు బద్దలే!


ఉప్పెన సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 20.50 కోట్లు వరకూ జరిగింది. దీంతో బ్రేక్ ఈవెన్ చేరుకోవాలంటే రూ. 21 కోట్లు వసూలు చేయాలి. అలాంటిది రెండో రోజుల్లోనే రూ. 16.21 కోట్ల షేర్ రాబట్టిందీ సినిమా. అంటే మరో రూ. 4.30 లక్షలు వసూలు చేస్తే ఈ సినిమా క్లీన్ హిట్‌గా నిలుస్తుంది. దీనితో పాటు అత్యధిక కలెక్షన్లు సాధించిన డెబ్యూ హీరోగానూ వైష్ణవ్ తేజ్ చరిత్ర సృష్టిస్తాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X