Uppena Collection: చరిత్ర సృష్టించిన వైష్ణవ్ తేజ్.. ఫస్ట్ మూవీకే ఈ రేంజ్‌లో.. ఆ హీరోలంతా వెనక్కే!

మెగా ఫ్యామిలీ నుంచి తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంతో మంది హీరోలుగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. వాళ్లలో చాలా మంది స్టార్లుగా వెలుగొందుతున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం మరొకరు కూడా హీరోగా పరిచయం అయ్యాడు. అతడే.. పంజా వైష్ణవ్ తేజ్. ఇండస్ట్రీలో పేరున్న ఫ్యామిలీ నుంచి వస్తుండడంతో ఇతగాడిపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. అందుకు అనుగుణంగానే అతడి మొదటి సినిమా 'ఉప్పెన' శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అయింది. ప్యూర్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ మూవీ మొదటి రోజు ఎంత వసూలు చేసిందో ఓ సారి చూద్దాం పదండి!

 కొత్త దర్శకుడితోనే పరిచయం అయ్యాడు

కొత్త దర్శకుడితోనే పరిచయం అయ్యాడు

సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దర్శకత్వంలో పంజా వైష్ణవ్ తేజ్ నటిస్తోన్న చిత్రమే 'ఉప్పెన'. బడా ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోన్న ఈ సినిమాలో కృతీ శెట్టి హీరోయిన్‌గా నటించింది. తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి నెగెటివ్ పాత్రను పోషించారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమా ప్యూర్ లవ్ స్టోరీతో తెరకెక్కింది. ఈ మూవీ శుక్రవారం విడుదలైంది.

అన్ని చోట్లా అదే టాక్.. క్లైమాక్స్ మాత్రం

అన్ని చోట్లా అదే టాక్.. క్లైమాక్స్ మాత్రం

'ఉప్పెన'లోని 'నీ కన్ను నీలి సముద్రం' పాటతో ఒక్కసారిగా హైప్ వచ్చింది. అందుకు అనుగుణంగానే మొదటి రోజు విడుదలైన అన్ని ప్రాంతాల్లో ఈ సినిమాకు మంచి టాక్ వచ్చింది. మొదటి సినిమానే అయినా హీరోహీరోయిన్లు ఆకట్టుకున్నారు. విజయ్ సేతుపతి, దేవీ శ్రీ ప్రసాద్ సినిమాకు హైలైట్ అని చెప్పొచ్చు. ఇక, ఇందులోని డిఫరెంట్ క్లైమాక్స్ గురించి అంతా మాట్లాడుతున్నారు.

భారీ రేంజ్‌లో బిజినెస్.. బ్రేక్ ఈవెన్ ఎంత?

భారీ రేంజ్‌లో బిజినెస్.. బ్రేక్ ఈవెన్ ఎంత?

మెగా హీరో ఇంట్రో సినిమా కావడంతో 'ఉప్పెన' సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా జరిగింది. ఈ సినిమా నైజాం హక్కులు రూ. 6 కోట్లు, సీడెడ్ రైట్స్ రూ. 3 కోట్లు, ఆంధ్రా ప్రాంత హక్కులు రూ 10 కోట్లు వరకూ అమ్ముడు పోయాయి. ఓవర్సీస్‌తో కలుపుకుంటే మొత్తంగా రూ. 20.50 కోట్ల వ్యాపారం జరిగింది. దీంతో ఈ మూవీ రూ. 21 కోట్లు వసూలు చేస్తే బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను చేరుకుంటుంది.

మొదటి రోజు కలెక్షన్లు.. రికార్డులు బద్దలు

మొదటి రోజు కలెక్షన్లు.. రికార్డులు బద్దలు

పాటతో అంచనాలు పెరిగిపోవడం.. మెగా ఫ్యామిలీ కూడా మద్దతుగా ఉండడంతో 'ఉప్పెన' సినిమాకు రికార్డు స్థాయిలో కలెక్షన్లు వచ్చాయి. ఈ సినిమా మొదటి రోజు రూ. 9.35 కోట్లు షేర్ రాబట్టింది. అలాగే, రూ. 15.10 కోట్లు గ్రాస్ కూడా సంపాదించింది. దీంతో ఈ సినిమా పేరిట ఎన్నో రికార్డులు నమోదయ్యాయి. తద్వారా మొదటి సినిమాతోనే సత్తా చాటాడు మెగా హీరో వైష్ణవ్ తేజ్.

ప్రాంతాల వారిగా ఇది ఎంత రాబట్టిందంటే

ప్రాంతాల వారిగా ఇది ఎంత రాబట్టిందంటే

ఉప్పెన' ప్రపంచ వ్యాప్తంగా వెయ్యికి పైగా థియేటర్లలో విడుదలైంది. మంచి స్పందన రావడంతో కలెక్షన్లూ భారీగానే వచ్చాయి. ప్రాంతాల వారిగా చూస్తే.. నైజాంలో రూ. 3.04 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.38 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 1.45 కోట్లు, ఈస్ట్‌లో రూ. 1.02 కోట్లు, వెస్ట్‌లో రూ. 81 లక్షలు, గుంటూరులో రూ. 66 లక్షలు, కృష్ణాలో రూ. 62 లక్షలు, నెల్లూరులో రూ. 37 లక్షలు రాబట్టింది.

 చరిత్ర సృష్టించిన వైష్ణవ్ తేజ్.. అవి వెనక్కి

చరిత్ర సృష్టించిన వైష్ణవ్ తేజ్.. అవి వెనక్కి

మొదటి రోజు నమోదైన రికార్డులను పరిశీలిస్తే.. మీడియం రేంజ్ హీరోలలో ఏపీ తెలంగాణలో మొదటి రోజు ఎక్కువ కలెక్షన్లు అందుకున్న చిత్రాల జాబితాలో 'ఉప్పెన' (రూ. 9.35 కోట్లు) టాప్ ప్లేస్‌కు చేరింది. అక్కినేని అఖిల్ నటించిన 'అఖిల్' మూవీ (రూ. 7.60 కోట్లు)ని వెనక్కి నెట్టింది. అలాగే, నైజాంలో ఎక్కువ వసూలు చేసిన చిత్రాల జాబితాలో మూడో స్థానంలో నిలిచింది.

మొదటి సినిమాకే రికార్డులు క్రియేట్ చేశాడు

మొదటి సినిమాకే రికార్డులు క్రియేట్ చేశాడు

తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోల పరిచయ సినిమాలకు భారీ బజ్ ఉంటుంది. వైష్ణవ్ తేజ్ 'ఉప్పెన'కు కూడా ఇదే రీతిలో అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే ఫస్ట్ డే ఈ మూవీ రూ. 9.35 కోట్లు రాబట్టింది. దీంతో పరిచయ సినిమాకే ఎక్కువ కలెక్షన్లు సాధించిన హీరోగా వైష్ణవ్ చరిత్ర సృష్టించాడు. అతడి తర్వాత అఖిల్ (రూ. 7.60 కోట్లు), చరణ్ (రూ. 3.75 కోట్లు) ఉన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X