Adikeshava 2 Days Collections: ఆదికేశవకు దిమ్మతిరిగే వసూళ్లు.. 2 రోజుల్లో అంతే.. ఇంకెంత రావాలంటే!
మెగా ఫ్యామిలీ నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. మొదటి సినిమాతోనే సంచలన విజయాన్ని సొంతం చేసుకున్నాడు పంజా వైష్ణవ్ తేజ్. తనకు దక్కిన గ్రాండ్ ఎంట్రీని వాడుకోలేకపోయిన ఈ హీరో.. ఆ తర్వాత వరుసగా ఫ్లాపులను చవి చూశాడు.
దీంతో ఈసారి కచ్చితంగా హిట్ కొట్టాలని 'ఆదికేశవ' అనే సినిమాతో ఆడియెన్స్ ముందుకు వచ్చాడు. అయితే, దీనికి ఆరంభంలోనే మిక్స్‌డ్ టాక్ వచ్చింది. ఫలితంగా దీనికి ఓపెనింగ్స్ సరిగా రాలేదు. తర్వాత కూడా ఇది ఢీలా పడిపోయింది. ఈ నేపథ్యంలో 2 రోజుల్లో ఇది ఎంత వసూలు చేసిందో మీరే చూసేయండి!

ఆదికేశవగా మారిన వైష్ణవ్: వైష్ణవ్ తేజ్ హీరోగా చేసిన లేటెస్ట్ మూవీనే 'ఆదికేశవ'. శ్రీకాంత్ ఎన్ రెడ్డి తెరకెక్కించిన ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమా బ్యానర్లపై నాగవంశి, సాయి సౌజన్య నిర్మించారు. ఇందులో శ్రీలీల హీరోయిన్‌గా నటించింది. అలాగే, రాధిక శరత్ కుమార్, జోజు జార్జ్, సుమన్, సుదర్శన్ నటించారు. జీవి ప్రకాశ్ కుమార్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించాడు.

ఆదికేశవ బిజినెస్ ఎంత?: ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'ఆదికేశవ' సినిమాపై ఆరంభంలోనే మంచి హైప్ క్రియేట్ అయింది. అందుకు అనుగుణంగానే దీని నుంచి వచ్చిన అప్‌డేట్లు అన్నీ ఆకట్టుకున్నాయి. ఫలితంగా ఈ సినిమా హక్కులకు తీవ్ర స్థాయిలో పోటీ ఏర్పడింది. అందుకు అనుగుణంగానే ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా దీనికి రూ. 8.50 కోట్లు మేర థియేట్రికల్ బిజినెస్ జరుపుకుంది.

2వ రోజు తెలుగులో ఇలా: వైష్ణవ్ తేజ్ - శ్రీలీల హీరో హీరోయిన్లుగా నటించిన సినిమానే 'ఆదికేశవ'. కమర్షియల్ స్టోరీతో రూపొందిన ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో ఓపెనింగ్స్ సరిగా రాలేదు. శనివారం అయినా వసూళ్లు పెరుగుతాయని అంతా భావించారు. కానీ, అది కూడా జరగలేదు. ఫలితంగా 'ఆదికేశవ' మూవీ రెండో రోజు ఆంధ్రా, తెలంగాణలో కలిపి రూ. 50 లక్షలు షేర్ మాత్రమే వసూలు చేసింది.
2 రోజులకూ కలిపి ఎంత: క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కిన 'ఆదికేశవ' మూవీకి ఆరంభంలోనే మిక్స్‌డ్ టాక్ రావడంతో మొదటి రోజు అనుకున్న దానికంటే తక్కువ రెస్పాన్స్ లభించింది. రెండో రోజు కూడా నిరాశ పరిచింది. ఫలితంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి రెండు రోజులకు కలిపి రూ. 1.30 కోట్లు షేర్ మాత్రమే వసూలు చేసింది. అలాగే, కేవలం రూ. 2.50 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

ప్రపంచ వ్యాప్తంగా ఇలా: వైష్ణవ్ తేజ్ హీరోగా శ్రీకాంత్ రెడ్డి తెరకెక్కించిన 'ఆదికేశవ' మూవీకి దేశంలోని వేరే ప్రాంతాలతో పాటు ఓవర్సీస్‌లోనూ మోస్తరు స్పందనే వచ్చింది. ఫలితంగా ఈ కమర్షియల్ సినిమాకు కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్‌లో కలిసి 2 రోజుల్లో రూ. 30 లక్షలు షేర్ వచ్చింది. వీటితో కలిపి ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం రూ. 1.60 కోట్లు షేర్, 3.00 కోట్లు గ్రాస్ వచ్చింది.

టార్గెట్‌కు ఎంత రావాలి?: మెగా హీరో వైష్ణవ్ తేజ్ నటించిన 'ఆదికేశవ' చిత్రం ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలనూ కలుపుకుని రూ. 8.50 కోట్లు వరకూ థియేట్రికల్ బిజినెస్ చేసుకున్నట్లు తెలిసింది. అంటే ఈ చిత్రం రూ. 9.00 కోట్లు షేర్ బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో వచ్చింది. 2 రోజుల్లో దీనికి కేవలం రూ. 1.60 కోట్లు షేర్ వచ్చింది. అంటే ఇది హిట్ కావాలంటే మరో రూ. 7.40 కోట్లు షేర్ రాబట్టాలి.


Click it and Unblock the Notifications











