Adikeshava 4 Days Collections:రూ. 9 కోట్ల సినిమా... 4 రోజుల్లో వచ్చిందంతే.. ఇంకా ఎంత రాబట్టలంటే?
మెగా ఫ్యామిలీ నుంచి ఎంతో మంది హీరోలుగా ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి తేజ్.. ఇప్పుడు వైష్ణవ్ తేజ్.. ఇలా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. అయితే ఇందులో వైష్ణవ్ తేజ్.. మొదటి సినిమాతోనే వంద కోట్ల రూపాయలు కొల్లగొట్టాడు. ఉప్పెన సినిమాతో ఇండస్ట్రీ రికార్డులు బ్రేక్ చేశాడు. ఇదిలా ఉంటే.. తాజాగా ఆయన నటించిన చిత్రం ఆదికేశవ. ఈ మూవీకి ఆశించిన స్థాయి రెస్పాన్స్ రావడం లేదు. ఇక ఈ నేపథ్యంలో 4 నాలుగు రోజుల్లో ఎంత వసూలు చేసిందో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన చిత్రం 'ఆదికేశవ'. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమా బ్యానర్లపై నాగవంశి, సాయి సౌజన్య భారీ బడ్జెట్ తో రూపొందించారు. ఇక ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ సరసన శ్రీలీల హీరోయిన్‌గా నటించింది. అలాగే, రాధిక శరత్ కుమార్, జోజు జార్జ్, సుమన్, సుదర్శన్ కీలక పాత్రల్లో నటించారు. జీవి ప్రకాశ్ కుమార్ ఈ సినిమాకు సంగీతం అందించాడు.

కమర్షియల్ అంశాలతో రూపొందిన 'ఆదికేశవ' సినిమాపై మొదటి నుంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా బిజినెస్ కూడా భారీగానే జరుపుకున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా దీనికి రూ. 8.50 కోట్లు మేర థియేట్రికల్ బిజినెస్ నమోదు చేసుకుంది. 'ఆదికేశవ' మూవీ మూడు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 1.60 కోట్లు షేర్, 3.00 కోట్లు గ్రాస్ వసూలు చేసింది.

ఇక ఈ సినిమా 4 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే... నిజం రూ 74 లక్షలు, ఆంధ్ర ప్రదేశ్ వ్యాప్తంగా రూ.1.10 కోట్లు, ఇక తెలంగాణ, ఏపీ కలిపి రూ.1.84 షేర్, రూ.3.70 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా వ్యాప్తంగా రూ.32 లక్షలు వసూలు చేసింది. ఇక ప్రపంచవ్యాప్తంగా రూ. 2.16 కోట్ల షేర్ ( రూ. 4.50కోట్ల గ్రాస్) వసూలు చేసింది.

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 9 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా ఓవరాల్ గా 4 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా 6.84 కోట్ల షేర్ ని రాబట్టాలి. ఇక వైష్ణవ్ తేజ్ సినిమా ఫ్లాప్ దిశగా కొనసాగుతోంది. చూడాలి మరి మిగతా ఆరు కోట్లు వసూలు చేస్తుందా లేదా అనేది.


Click it and Unblock the Notifications











