Adikeshava Closing Collections: మెగా మూవీకి మైండ్ బ్లాక్.. వారంలోనే ఔట్.. ఏకంగా అన్ని కోట్ల నష్టాలా!

టాలీవుడ్‌లోకి మెగా ఫ్యామిలీ హీరోగా ఎంట్రీ ఇచ్చి.. మొదటి చిత్రంతోనే వంద కోట్లు కొల్లగొట్టి సంచలనం సృష్టించాడు పంజా వైష్ణవ్ తేజ్. దీంతో అతడు చాలా తక్కువ సమయంలోనే స్టార్ అయిపోతాడని అంతా అనుకున్నారు. కానీ, ఊహించని విధంగా ఆ తర్వాత వరుస ఫ్లాపులను చవి చూశాడు. దీంతో ఈ సారి హిట్ కొట్టాలన్న కసితో 'ఆదికేశవ' అనే మూవీని చేశాడు. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ చిత్రం కూడా నిరాశనే మిగిల్చింది. దీంతో ఇది కోట్ల నష్టాలతో రన్‌ను ముగించేసింది. మరి 'ఆదికేశవ' మూవీ మొత్తంగా ఎంత వసూలు చేసిందో మీరే చూసేయండి!

ఆదికేశవగా వైష్ణవ్ ఎంటర్:పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన తాజా చిత్రమే 'ఆదికేశవ'. శ్రీకాంత్ ఎన్ రెడ్డి తెరకెక్కించిన ఈ చిత్రాన్ని సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమా బ్యాన‌ర్లపై నాగ‌వంశి, సాయి సౌజ‌న్య నిర్మించారు. ఇందులో శ్రీలీల హీరోయిన్‌గా నటించింది. అలాగే, రాధిక శరత్ కుమార్, జోజు జార్జ్, సుమన్, సుదర్శన్ నటించారు. జీవి ప్రకాశ్ కుమార్ సంగీతం సమకూర్చాడు.

Vaishnav tej Starrer Adikeshava Movie Closing Worldwide Box Office Collections

ఆదికేశవ బిజినెస్ ఎంత?:మాస్ అండ్ కమర్షియల్ స్టోరీతో రూపొందిన 'ఆదికేశవ' సినిమాపై ఆరంభంలోనే మంచి హైప్ ఏర్పడింది. అందుకు అనుగుణంగానే దీని నుంచి వచ్చిన అప్‌డేట్లు అన్నీ ఆకట్టుకున్నాయి. ఫలితంగా ఈ సినిమా హక్కులకు తీవ్ర స్థాయిలో పోటీ ఏర్పడింది. అందుకు అనుగుణంగానే ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా దీనికి రూ. 8.50 కోట్లు మేర థియేట్రికల్ బిజినెస్ జరుపుకుంది.

అలాంటి టాక్‌తో డల్‌గా:వైష్ణవ్ తేజ్ - శ్రీలీల హీరో హీరోయిన్లుగా నటించిన సినిమానే 'ఆదికేశవ'. కమర్షియల్ స్టోరీతో రూపొందిన ఈ చిత్రానికి ప్రీమియర్స్ నుంచే నెగెటివ్ టాక్ వచ్చింది. ఫలితంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా ఓపెనింగ్స్ సరిగా రాలేదు. ఆ తర్వాత కూడా ఈ చిత్రం మంచి ప్రదర్శన చేయలేదు. దీంతో కేవలం వారం రోజుల్లోనే థియేట్రికల్ రన్‌ను దాదాపుగా పూర్తి చేసుకోవాల్సి వచ్చింది.

Vaishnav tej Starrer Adikeshava Movie Closing Worldwide Box Office Collections

తెలుగు రాష్ట్రాల్లో ఎంత?:క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కిన 'ఆదికేశవ' మూవీకి ఆరంభంలోనే మిక్స్‌డ్ టాక్ రావడంతో ప్రేక్షకుల నుంచి చాలా తక్కువ రెస్పాన్స్ లభించింది. దీంతో ఎన్నో రోజులు పాటు ఇది రన్ కంటిన్యూ చేయలేకపోయింది. ఫలితంగా నైజాంలో రూ. 80 లక్షలు, ఆంధ్రా మొత్తంలో రూ. 1.20 కోట్లు వసూలు చేసింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో ఇది రూ. 2 కోట్లు షేర్ మాత్రమే రాబట్టింది.

ప్రపంచ వ్యాప్తంగా ఇలా:వైష్ణవ్ తేజ్ హీరోగా శ్రీకాంత్ రెడ్డి తెరకెక్కించిన 'ఆదికేశవ' మూవీకి దేశంలోని వేరే ప్రాంతాలతో పాటు ఓవర్సీస్‌లోనూ మోస్తరు స్పందనే వచ్చింది. ఫలితంగా ఈ కమర్షియల్ సినిమాకు కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్‌లో కలిసి రూ. 40 లక్షలు షేర్ వచ్చింది. వీటితో కలిపి ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం రూ. 2.40 కోట్లు షేర్, 4.50 కోట్లు గ్రాస్ మాత్రమే వచ్చింది.

Vaishnav tej Starrer Adikeshava Movie Closing Worldwide Box Office Collections

టార్గెట్‌కు ఎంత రావాలి?:మెగా హీరో వైష్ణవ్ తేజ్ నటించిన 'ఆదికేశవ' చిత్రం ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలనూ కలుపుకుని రూ. 8.50 కోట్లు వరకూ థియేట్రికల్ బిజినెస్ చేసుకున్నట్లు తెలిసింది. అంటే ఈ చిత్రం రూ. 9.00 కోట్లు షేర్ బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో వచ్చింది. ఫుల్ రన్‌లో దీనికి కేవలం రూ. 2.40 కోట్లు షేర్ వచ్చింది. తద్వారా ఇది రూ. 6.60 కోట్లు నష్టాలతో డిజాస్టర్‌గా మిగిలిపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X