Adikeshava Day 1 Collections: మెగా హీరో మూవీకి మైండ్ బ్లాక్ కలెక్షన్లు.. తొలి రోజే ఇంత తక్కువగానా!
తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి చిత్రంతోనే సంచలన విజయాన్ని నమోదు చేసుకున్న యంగ్ హీరో పంజా వైష్ణవ్ తేజ్. అయితే, ఆ తర్వాత మాత్రం ఈ మెగా హీరో ఒక్కటంటే ఒక్క హిట్‌ను కూడా ఖాతాలో వేసుకోలేదు. దీంతో ఈ సారి ఎలాగైనా బిగ్ సక్సెస్‌ను సొంతం చేసుకోవాలన్న కసితో ఉన్నాడు. ఇందుకోసం వైష్ణవ్ తేజ్ 'ఆదికేశవ' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ, దీనికి టాక్‌తో పాటు రెస్పాన్స్ కూడా ఆశించిన స్థాయిలో లభించలేదు. ఈ నేపథ్యంలో మొదటి రోజు ఇది ఎంత వసూలు చేసిందో మీరే చూసేయండి!
ఆదికేశవ అంటూ వచ్చాడు
వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన తాజా చిత్రమే 'ఆదికేశవ'. శ్రీకాంత్ ఎన్ రెడ్డి తెరకెక్కించిన ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమా బ్యానర్లపై నాగవంశి, సాయి సౌజన్య నిర్మించారు. జీవి ప్రకాశ్ కుమార్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించాడు. ఇందులో శ్రీలీల హీరోయిన్‌గా నటించింది. అలాగే, రాధిక శరత్ కుమార్, జోజు జార్జ్, సుమన్, సుదర్శన్ నటించారు.

ఆదికేశవ బిజినెస్ ఎంత?
కమర్షియల్ హంగులతో రూపొందిన 'ఆదికేశవ' సినిమాపై ఆరంభంలోనే మంచి హైప్ క్రియేట్ అయింది. అందుకు అనుగుణంగానే దీని నుంచి వచ్చిన అప్‌డేట్లు అన్నీ ఆకట్టుకున్నాయి. ఫలితంగా ఈ సినిమా హక్కులకు తీవ్ర స్థాయిలో పోటీ ఏర్పడింది. అందుకు అనుగుణంగానే ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా దీనికి రూ. 8.50 కోట్లు మేర థియేట్రికల్ బిజినెస్ చేసుకుంది.
అలాంటి టాక్ రావడంతో
ఫ్యామిలీ అండ్ మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'ఆదికేశవ' మూవీకి ప్రీమియర్ షోల నుంచే మిక్స్‌డ్ టాక్ వచ్చింది. ఆ తర్వాత కూడా అదే సీన్ అంతటా కనిపించింది. ఫలితంగా ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి స్పందన ఆశించిన దానికంటే తక్కువే దక్కింది. దీంతో తొలి రోజేటాలీవుడ్ యంగ్ హీరోల సినిమాల కంటే తక్కువగానే వసూళ్లను ఈ సినిమా సాధించింది.

తెలుగు రాష్ట్రాలో ఎంత?
క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన 'ఆదికేశవ' మూవీకి ఆరంభంలోనే మిక్స్‌డ్ టాక్ వచ్చింది. ఫలితంగా తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు అనుకున్న దానికంటే తక్కువ రెస్పాన్స్ లభించింది. ఇలా ఈ చిత్రం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి రూ. 80 లక్షలు షేర్ మాత్రమే వసూలు చేసింది. అలాగే, ఈ చిత్రానికి రెండు రాష్ట్రాలకు కలిపి రూ. 1.70 కోట్లు గ్రాస్ వసూలు అయింది.
ప్రపంచ వ్యాప్తంగా ఇలా
వైష్ణవ్ తేజ్ - శ్రీలీల జంటగా నటించిన 'ఆదికేశవ' మూవీకి దేశంలోని వేరే ప్రాంతాలతో పాటు ఓవర్సీస్‌లోనూ మోస్తరు స్పందనే వచ్చిందని చెప్పాలి. ఫలితంగా ఈ కమర్షియల్ సినిమాకు కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్‌లో కలిసి తొలి రోజు రూ. 20 లక్షలు షేర్ వచ్చింది. వీటితో కలిపి ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం రూ. 1.00 కోట్లు షేర్, 2.05 కోట్లు గ్రాస్ వచ్చింది.

టార్గెట్‌కు ఎంత రావాలి?
పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన 'ఆదికేశవ' చిత్రం ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలనూ కలుపుకుని రూ. 8.50 కోట్లు వరకూ థియేట్రికల్ బిజినెస్ చేసుకున్నట్లు తెలిసింది. అంటే ఈ చిత్రం రూ. 9.00 కోట్లు షేర్ బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో వచ్చింది. మొదటి రోజే దీనికి కేవలం రూ. 1.00 కోట్లు షేర్ వచ్చింది. అంటే ఇది హిట్ కావాలంటే మరో రూ. 8 కోట్లు షేర్ రాబట్టాలి.


Click it and Unblock the Notifications











