Uppena 5 days collections: భారీగా తగ్గిన కలెక్షన్స్.. ఇలా అయితే ఆ రికార్డును అందుకోవడం కష్టమే!
మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ మొదటి సినిమాతోనే బాక్సాఫీస్ వద్ద పవర్ఫుల్ ఓపెనింగ్స్ అందుకున్నాడు. మెగా ఫ్యామిలీలోనే కాకుండా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటివరకు పరిచయమైన హీరోల్లో మొదటి సినిమాతో అత్యదిక వసూళ్లు అందుకున్న హీరోగా న్యూ రికార్డ్ అయితే అయితే క్రియేట్ చేశాడు. వైష్ణవ్ కు ఇది బెస్ట్ డెబ్యూ ఫిల్మ్ అని చెప్పవచ్చు. రామ్ చరణ్ చిరుత రికార్డును కూడా వైష్ణవ్ చాలా ఈజీగా దాటేసి మంచి హిట్ అందుకున్నాడు. ఇక 5వ రోజు సినిమా కలెక్షన్స్ భారిగా తగ్గాయనే చెప్పాలి. ఇలాగైతే సుకుమార్ చెప్పిన రికార్డును అందుకోవడం కాస్త కష్టమే అని తెలుస్తోంది.

పెట్టిన పెట్టుబడి వెనక్కి రావడమే కాకుండా..
విడుదలకు ముందే పాజిటివ్ బజ్ క్రియేట్ చేసిన ఉప్పెన అదే ఉపుతో విడుదల తరువాత కూడా కలెక్షన్స్ తో మరింత బజ్ క్రియేట్ చేస్తోంది. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు తెరకెక్కించిన ఈ సినిమా తప్పకుండా బాక్సాఫీస్ వద్ద ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తూందని అందరికి ఒక క్లారిటీ వచ్చేసింది. మొదటి మూడు రోజుల్లోనే సినిమాకు పెట్టిన పెట్టుబడి వెనక్కి రావడమే కాకుండా 10కోట్లకు పైగా ప్రాఫిట్స్ ను కూడా అందించింది.

5వ రోజు కలెక్షన్స్..
ఉప్పెన రెండవ రోజు కంటే కూడా మూడవ రోజు ఆదివారం కావడంతో కాస్త ఎక్కువ షేర్స్ అందుకుంది. ఇటీవల కాలంలో వచ్చిన బెస్ట్ ఓపెనింగ్స్ లలో ఉప్పెన న్యూ రికార్డ్ క్రియేట్ చేసిందనే చెప్పాలి. అయితే వీకెండ్ అనంతరం సోమవారం, మంగళవారం సినిమా కలెక్షన్స్ తగ్గుతూ వచ్చాయి. 5వ రోజు ఏరియాల వారిగా కలెక్షన్స్ (షేర్స్) చూసుకుంటే.. నైజం 98లక్షలు, సీడెడ్ 54లక్షలు, ఉత్తరాంధ్ర 57.4లక్షలు, ఈస్ట్ 38.3లక్షలు, వెస్ట్ 17లక్షలు, గుంటూర్ 18లక్షలు, కృష్ణ 18.3లక్షలు, నెల్లూరు 11లక్షలు.

5 రోజుల్లో మొత్తం వచ్చిన షేర్స్..
ఉప్పెన సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో మూడవ రోజు వచ్చిన మొత్తం కలెక్షన్స్ 8.26కోట్లు. ఇక మొదటి రోజే 9.35కోట్ల వరకు అందుకున్న ఈ సినిమా రెండవ రోజు 6.86కోట్ల షేర్స్ ను అందుకుంది. ఇక నాలుగవ రోజు సోమవారం కావడంతో 4.17కోట్ల షేర్స్ ను అందుకుంది. 5వ రోజు 3.12కోట్లు వచ్చాయి. ఈ విధంగా మొత్తం 5 రోజుల కలెక్షన్స్ ఏపీ-తెలంగాణలోనే 31.76కోట్లు వచ్చాయి.

మరో 50కోట్లు తెస్తుందా?
వరల్డ్ వైడ్ గా మొత్తంగా సినిమా 20.5కోట్ల బిజినెస్ చేసింది. బ్రేక్ ఈవెన్ టార్గెట్ 21కోట్లు. ప్రస్తుతం వచ్చిన 31కోట్ల షేర్స్ తో సినిమా అసలు టార్గెట్ ను పూర్తి చేసింది. ఇంకా 10కోట్ల వరకు ప్రాఫిట్ జోన్ లోకి వచ్చేసింది కూడా. అయితే దర్శకుడు సుకుమార్ ఈ సినిమా తప్పకుండా 100కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకుంటుందని చెప్పాడు. ఇప్పటికి సినిమా 50కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ అందుకున్నట్లు తెలుస్తోంది. మరి రానున్న రోజుల్లో సినిమా మరో 50కోట్లను అందుకుంటుందో లేదో చూడాలి.


Click it and Unblock the Notifications











