Uppena 7 days collections: అసలైన బాక్సాఫీస్ గేమ్ ఇప్పుడే మొదలైంది.. పోటీగా నాలుగు సినిమాలు!
ఉప్పెన సినిమాతో హీరోగా పరిచయమైన వైష్ణవ్ తేజ్ మొత్తానికి మొదటి సినిమాతోనే బాక్సాఫీస్ వద్ద పవర్ఫుల్ హిట్ అందుకున్నాడు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటివరకు బెస్ట్ డెబ్యూ హీరోల్లో అత్యదిక వసూళ్లు అందుకున్న హీరోగా న్యూ రికార్డ్ అయితే క్రియేట్ చేశాడు. రామ్ చరణ్ చిరుత రికార్డుకు బ్రేక్ అయ్యింది. కలెక్షన్స్ ఇంకా ఎక్కడి వరకు వెళతాయో తెలియదు. ఎడవరోజు కూడా పరవాలేదు అనే విధంగా షేర్స్ వచ్చాయి. కానీ ఈ రోజు నుంచే ఉప్పెన అసలు గేమ్ స్టార్ట్ అయ్యేది. ఎందుకంటే పోటీగా మరో నాలుగు సినిమాలు థియేటర్స్ లోకి వస్తున్నాయి.

విజయాన్ని ముందే ఊహించారు
విడుదలకు ముందే పాజిటివ్ బజ్ క్రియేట్ చేసిన ఉప్పెన అదే ఉపుతో విడుదల తరువాత కూడా కలెక్షన్స్ తో మరింత బజ్ క్రియేట్ చేస్తోంది. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు తెరకెక్కించిన ఈ సినిమా తప్పకుండా బాక్సాఫీస్ వద్ద ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తూందని అందరికి ముందే ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. మొదటి మూడు రోజుల్లోనే సినిమాకు పెట్టిన పెట్టుబడి వెనక్కి రావడమే కాకుండా ఇప్పటివరకు 15కోట్లకు పైగా ప్రాఫిట్స్ ను కూడా అందించింది.

7వ రోజు కలెక్షన్స్..
ఉప్పెన గత ఆదివారం కాస్త ఎక్కువ షేర్స్ అందుకుంది. ఇటీవల కాలంలో వచ్చిన బెస్ట్ ఓపెనింగ్స్ లలో ఉప్పెన న్యూ రికార్డ్ క్రియేట్ చేసిందనే చెప్పాలి. అయితే వీకెండ్ అనంతరం సోమవారం నుంచి సినిమా కలెక్షన్స్ తగ్గుతూ వచ్చాయి. 7వ రోజు ఏరియాల వారిగా కలెక్షన్స్ (షేర్స్) చూసుకుంటే.. నైజం 38లక్షలు, సీడెడ్ 22లక్షలు, ఉత్తరాంధ్ర 34లక్షలు, ఈస్ట్ 17లక్షలు, వెస్ట్ 8లక్షలు, గుంటూర్ 9.1లక్షలు, కృష్ణ 9లక్షలు, నెల్లూరు 11లక్షలు.

ఇప్పటివరకు వచ్చిన మొత్తం షేర్స్..
ఉప్పెన సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో మూడవ రోజు వచ్చిన మొత్తం కలెక్షన్స్ 8.26కోట్లు. ఇక మొదటి రోజే 9.35కోట్ల వరకు అందుకున్న ఈ సినిమా రెండవ రోజు 6.86కోట్ల షేర్స్ ను అందుకుంది. ఇక నాలుగవ రోజు సోమవారం కావడంతో 4.17కోట్ల షేర్స్ ను అందుకుంది. 5వ రోజు 3.12కోట్లు వచ్చాయి. ఆరవ రోజు 1.93కోట్లు రాగా ఏడవ రోజు 1.44కోట్లు వచ్చాయి. ఈ విధంగా మొత్తం 5 రోజుల కలెక్షన్స్ ఏపీ-తెలంగాణలోనే 35.13కోట్లు వచ్చాయి.

అసలు గేమ్ ఇప్పుడే మొదలైంది..
ఉప్పెన 7రోజుల నుంచి సోలోగానే నడిచింది. ఇతర సినిమాలు పోటీగా లేకపోవడం బాగా కలిసొచ్చింది. అయితే ఈ శుక్రవారం థియేటర్స్ లోకి నాలుగు సినిమాలు రాబోతున్నాయి. అల్లరి నరేష్ నాంది, విశాల్ చక్ర, సుమంత్ కపటధారి, కన్నడ డబ్బింగ్ మూవీ పొగరు రిలీజ్ అవుతున్నాయి. ఈ సినిమాలు కూడా ఎక్కువ థియేటర్స్ లోనే విడుదల అవుతుండడం వలన వైష్ణవ్ కు కొంత పోటీ ఉంటుందనే చెప్పాలి.

హాఫ్ సెంచరీ దాటేసింది..
వరల్డ్ వైడ్ గా మొత్తంగా సినిమా 20.5కోట్ల బిజినెస్ చేసింది. బ్రేక్ ఈవెన్ టార్గెట్ 21కోట్లు. ప్రస్తుతం వచ్చిన 37కోట్లకు పైగా షేర్స్ తో సినిమా అసలు టార్గెట్ ను పూర్తి చేసింది. ఇంకా 15కోట్ల వరకు ప్రాఫిట్ జోన్ లోకి వచ్చేసింది కూడా. అయితే దర్శకుడు సుకుమార్ ఈ సినిమా తప్పకుండా 100కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకుంటుందని చెప్పాడు. ఇప్పటికి సినిమా 50కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ అందుకున్నట్లు తెలుస్తోంది. మరి రానున్న రోజుల్లో సినిమా మరో 50కోట్లను అందుకుంటుందో లేదో చూడాలి.


Click it and Unblock the Notifications











