Don't Miss!
- Sports RCB vs KKR: వేరీజ్ మ్యాడ్ మ్యాక్సీ: ఆర్సీబీలో గందరగోళం
- News వైసీపీ అభ్యర్థికి జగన్ బంపర్ ఆఫర్.. పులివెందుల నుంచి పోటీ చేయలంటూ సూచన
- Finance Bank Holidays: ఏప్రిల్ లో 14 రోజులు బ్యాంకులకు సెలవులు..
- Automobiles కొత్త స్కూటర్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఏథర్ రిజ్టా ప్రీ బుకింగ్లు ప్రారంభం.. రూ. 999 చెల్లిస్తే చాలు
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
Uppena movie pre release business: మెగా హీరో ఆ స్థాయిలో కలెక్షన్స్ అందుకుంటాడా?
టాలీవుడ్ ఇండస్ట్రీలో సంక్రాంతికి మాస్ కమర్షియల్ సినిమాలు బాగానే హడావుడి చేసి బాక్సాఫీస్ వద్ద మంచి లాభాలను అందుకున్నాయి. ఇక ఇప్పుడు అందరి చూపు ఉప్పెన సినిమాపైనే ఉంది. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు తెరకెక్కించిన ఈ సినిమా ద్వారా మెగా హీరో వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్న విషయం తెలిసిందే. ఇక శనివారం సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ వేడుకను కూడా గ్రాండ్ గా నిర్వహించి మంచి హైప్ క్రియేట్ చేశారు. ఇక సినిమాకు పెట్టిన బడ్జెట్ ఎంత? బాక్సాఫీస్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత అనే వివరాల్లోకి వెళితే..
ఉప్పెనలా పెరిగిన అంచనాలు
సినిమాకు సంబంధించిన ఫస్ట్ సాంగ్ ఏ రేంజ్ లో క్లిక్కయ్యిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. నీ కన్ను నీలి సముద్రం అనే ఒక్క సాంగ్ తోనే దేవిశ్రీప్రసాద్ పవర్ఫుల్ బజ్ క్రియేట్ చేశాడు.ఆ ఒక్క పాటతోనే ఉప్పెనలా అంచనాలు పెరిగిపోయాయి.అందుకే సినిమా బిజినెస్ పై కూడా అంచనాల డోస్ పెరిగాయి. ఉప్పెన పెట్టిన బడ్జెట్ ను ఎంత స్పీడ్ గా అందుకుంటుంది అనేది చర్చనీయాంశంగా మారింది.
బడ్జెట్ ఎంతంటే..
సినిమాను మొదట 10 కోట్ల బడ్జెట్ లోపే ఫినిష్ చేయాలని అనుకున్నారు. కానీ ఆ లెక్కలు 17కోట్ల వరకు వెళ్లింది. దర్శకుడి మీద నమ్మకం వల్ల సుకుమార్ సపోర్ట్ తో నిర్మాతలు ధైర్యం చేశారు. పూర్తిగా కొత్త వాళ్ళతో ఈ స్థాయిలో సినిమాను నిర్మించడం అంటే చాలా రిస్క్ తో కూడుకున్న పని. కానీ మైత్రి మూవీ మేకర్స్ సినిమా మీద నమ్మకంతో ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు.
ప్రీ రిలీజ్ బిజినెస్..
ఇక సినిమాకు సంబంధించిన బజ్ వల్ల బిజినెస్ కూడా గట్టిగానే పెరిగింది. ఉప్పెన ప్రీ రిలీజ్ బిజినెస్ ఇపుడు చర్చనీయాంశంగా మారింది. సినిమా నైజాం హక్కులు 6కోట్ల ధర పలుకగా సీడెడ్ రైట్స్ 3కోట్ల వరకు ధర పలికినట్లు సమాచారం. ఇక ఆంధ్రాలో 10కోట్ల వరకు బిజినెస్ చేస్తోంది. ఎపి తెలంగాణ మొత్తంగా ఉప్పెన 19కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు సమాచారం.
ఆ టార్గెట్ అందుకుంటే..
వరల్డ్ వైడ్ గా మొత్తంగా సినిమా 20.5కోట్ల బిజినెస్ చేస్తుండడంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ 21కోట్లు. ప్రస్తుతం ఉన్న బజ్ ప్రకారం ఉప్పెన సినిమా ఈ టార్గెట్ ను అందుకోవడం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చని టాక్ వస్తోంది. ఒకవేళ ఆ టార్గెట్ ను అందుకుంటే దాదాపు ఇండస్ట్రీలో మొదటి సినిమాతో అత్యదిక వసూళ్లను అందుకున్న హీరోగా వైష్ణవ్ తేజ్ రికార్డ్ సృష్టించినట్లే.
అమ్మే ఛాన్స్ వచ్చినా కూడా..
నిజానికి సినిమాకు సంబంధించిన ఒక ఆఫర్ ను నిర్మాతలు వదులుకోవాల్సి వచ్చిందట. సినిమా అవుట్ రేట్, రెండు రాష్ట్రాల థియేటర్ హక్కులను 18కోట్లకు అమ్మే ఛాన్స్ వచ్చిందట. చిత్ర నిర్మాతల్లో ఒకరైన సుకుమార్ కు ఒక బయ్యర్ ఈ ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. అయితే అప్పటికే బిజినెస్ డీల్స్ చాలా వరకు క్లోజ్ అయ్యాయట.
ఓటీటీ ఆఫర్స్ ఎన్ని వచ్చినా..
అందుకే ఆఫర్ ను రిజెక్ట్ చేసినట్లు సమాచారం. ఇక సినిమా ఫిబ్రవరి 12న గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే.గతంలో ఓటీటీలో ఆఫర్స్ ఎన్ని వచ్చినా కూడా చిత్ర యూనిట్ రిలీజ్ చేయడానికి ఒప్పుకోలేదు. వైష్ణవ్ తేజ్ మొదటి సినిమా కావడంతో ఎలాగైనా థియేటర్స్ లోనే విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారు. ఇక సంక్రాంతి రావాలని అనుకున్నారు గాని థియేటర్స్ కు 100% ఆక్యుపెన్సీతో నడిచే వరకు విడుదల చేయకూడదని మళ్ళీ వెనక్కి తగ్గారు.