Uppena Day 12 Collections: రిలీజ్ తర్వాత ఉప్పెనకు మొదటి షాక్.. ఆ లిస్టులో ఆరో స్థానంలో వైష్ణవ్!

2020 రెండు ఇండస్ట్రీ హిట్‌లతో గ్రాండ్‌గా మొదలైంది. అయితే, ఆ తర్వాత లాక్‌డౌన్ కారణంగా సినిమాల విడుదలలు ఆగిపోయాయి. అయితే, 2021లో మాత్రం ఇప్పటి వరకు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమాలన్నీ (ఒకటి రెండు మినహా) సూపర్ డూపర్ హిట్లుగా నిలిచాయి. అందులో ప్యూర్ లవ్ స్టోరీగా వచ్చిన 'ఉప్పెన' ఒకటి. ఈ సినిమా ద్వారా మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా పరిచయం అయ్యాడు పంజా వైష్ణవ్ తేజ్. విడుదలైన రోజు నుంచి భారీ కలెక్షన్లు అందుకున్న ఈ మూవీ.. మంగళవారం మాత్రం తొలిసారి బాగా పడిపోయింది. దానికి సంబంధించిన వివరాలు మీకోసం!

కొత్త టీమ్‌తో వచ్చినా... సత్తా చాటిన ఉప్పెన

కొత్త టీమ్‌తో వచ్చినా... సత్తా చాటిన ఉప్పెన

సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సన దర్శకత్వంలో పంజా వైష్ణవ్ తేజ్.. కృతి శెట్టి జంటగా నటించిన చిత్రం 'ఉప్పెన'. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఈ సినిమాలో స్టార్ హీరో విజయ్ సేతుపతి విలన్‌గా చేశాడు. ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. విడుదలకు ముందే అంచనాలు పెంచుకున్న ఈ మూవీ సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది.

కలెక్షన్ల ఉప్పెన.. టాలీవుడ్ రికార్డులన్నీ బ్రేక్

కలెక్షన్ల ఉప్పెన.. టాలీవుడ్ రికార్డులన్నీ బ్రేక్

ప్యూర్ లవ్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'ఉప్పెన' ప్రేమికుల రోజును పురస్కరించుకుని ఫిబ్రవరి 12న ప్రేక్షకుల ముందుకొచ్చింది. మొదటి రోజే మిక్స్‌డ్ టాక్‌ను తెచ్చుకోవడంతో ఈ మూవీ రిజల్ట్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో టాక్‌తో సంబంధం లేకుండా స్పందనను అందుకుంది. తద్వారా కలెక్షన్ల ఉప్పెనతో టాలీవుడ్‌లో సరికొత్త చరిత్రను లిఖించుకుంది.

మూడు రోజులకే టార్గెట్ డన్.. సక్సెస్‌ఫుల్‌గా

మూడు రోజులకే టార్గెట్ డన్.. సక్సెస్‌ఫుల్‌గా

విడుదలకు ముందే పలు కారణాల వల్ల 'ఉప్పెన'పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇలాంటి పరిస్థితుల్లో పాట, టీజర్, ట్రైలర్ వాటిని రెట్టింపు చేసేశాయి. తద్వారా ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కలుపుకుని రూ. 20.50 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ జరగడంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 21 కోట్లైంది. ఈ టార్గెట్‌ను కేవలం మూడు రోజుల్లోనే పూర్తి చేసిన ఈ మూవీ రికార్డు క్రియేట్ చేసింది.

పన్నెండో రోజు ఎక్కడ? ఎంత కలెక్ట్ చేసింది?

పన్నెండో రోజు ఎక్కడ? ఎంత కలెక్ట్ చేసింది?

విడుదలైన తర్వాత తొలిసారి 12వ రోజు రూ. కోటి కంటే తక్కువ కలెక్ట్ చేసింది. నైజాంలో రూ. 24 లక్షలు, సీడెడ్‌లో రూ. 13 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 18 లక్షలు, ఈస్ట్‌లో రూ. 10 లక్షలు, వెస్ట్‌లో రూ. 4 లక్షలు, గుంటూరులో రూ. 4.20 లక్షలు, కృష్ణాలో రూ. 4.10 లక్షలు, నెల్లూరులో రూ. 3 లక్షలు రాబట్టింది. మొత్తంగా పన్నెండో రోజు రూ. 80 లక్షలు షేర్, రూ. 1.33 కోట్ల గ్రాస్ వచ్చింది.

పన్నెండో రోజు అంతలా.. మొత్తంగా ఎంతంటే?

పన్నెండో రోజు అంతలా.. మొత్తంగా ఎంతంటే?

'ఉప్పెన' మొదటి రోజు రూ. 9.35 కోట్లు, 2వ రోజు రూ. 6.86 కోట్లు, 3వ రోజు రూ. 8.26 కోట్లు, 4వ రోజు రూ. 4.17 కోట్లు, 5వ రోజు రూ. 3.12 కోట్లు, 6వ రోజు రూ. 1.93 కోట్లు, 7వ రోజు రూ. 1.44 కోట్లు, 8వ రోజు రూ. 1.13 కోట్లు, 9వ రోజు రూ. 1.49 కోట్లు, 10వ రోజు రూ. 2.61 కోట్లు, 11వ రోజు రూ. 1.15 కోట్లు, 12వ రోజు రూ. 80 లక్షలుతో మొత్తంగా రూ. 42.31 కోట్ల షేర్, రూ. 68.10 కోట్ల గ్రాస్ అందుకుంది.

ఆరో స్థానంలో ‘ఉప్పెన'.. మైలురాయి కష్టమేనా

ఆరో స్థానంలో ‘ఉప్పెన'.. మైలురాయి కష్టమేనా

మంగళవారం రూ. 80 లక్షలు వసూలు చేసింది ఉప్పెన. తద్వారా 12వ రోజు ఎక్కువ కలెక్ట్ చేసిన మీడియం రేంజ్ చిత్రాల జాబితాలో వైష్ణవ్ తేజ్ సినిమా ఆరో స్థానంలో నిలిచింది. ఈ లిస్టులో 'గీత గోవిందం' రూ. 2.90 కోట్లతో మొదటి స్థానంలో ఉండగా.. 'ఎంసీఏ' రూ. 2.26 కోట్లతో రెండో ప్లేస్‌లో ఉంది. ప్రస్తుత పరిస్థితిని చూస్తే.. ఉప్పెన రూ. 100 కోట్లు దాటడం కష్టమేనన్న టాక్ వినిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X