Uppena 13 Days Collections: భారీగా పడిపోయిన కలెక్షన్లు.. ఇప్పటి వరకు ఎంత లాభం వచ్చిందో తెలిస్తే!

పంజా వైష్ణవ్ తేజ్.. కృతి శెట్టి జంటగా నటించిన చిత్రం 'ఉప్పెన'. ప్యూర్ లవ్ స్టోరీగా వచ్చిన ఈ సినిమా బుచ్చిబాబు సన తెరకెక్కించాడు. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఫలితంగా కలెక్షన్ల వర్షం కురుస్తోంది. దీంతో ఎన్నో రికార్డులు బద్దలైపోయాయి. ఇలా దాదాపు పది రోజుల పాటు ఈ మూవీ హవాను చూపించింది. దీంతో వంద కోట్ల మార్క్ కూడా దాటేస్తుందని అంతా అనుకున్నారు. కానీ, ఊహించని విధంగా ఈ సినిమాకు 13వ రోజు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఇక, ఈ మూవీ ఇప్పటి వరకు ఎంత సంపాదించిందంటే...

అందరూ ఆకట్టుకున్నారు.. హిట్ కొట్టారు

అందరూ ఆకట్టుకున్నారు.. హిట్ కొట్టారు

'ఉప్పెన'తో హీరో పంజా వైష్ణవ్ తేజ్, హీరోయిన్ కృతి శెట్టి, డైరెక్టర్ బుచ్చిబాబు తెలుగు తెరకు పరిచయం అయ్యారు. మొదటి సినిమానే అయినా వీళ్లంతా అదరగొట్టేశారు. అద్భుతమైన టాలెంట్‌తో ఆకట్టుకున్నారు. వీళ్లతో పాటు నెగెటివ్ రోల్ చేసిన కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి, మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ ఇరగదీశారు. నిర్మాణ సంస్థ మైత్రీ కూడా కాంప్రమైజ్ కాకుండా ఖర్చు చేసింది.

ప్రీ రిలీజ్ బిజినెస్‌.. మూడు రోజుల్లోనే బ్రేక్

ప్రీ రిలీజ్ బిజినెస్‌.. మూడు రోజుల్లోనే బ్రేక్

విడుదలకు ముందే 'ఉప్పెన' మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇలాంటి పరిస్థితుల్లో పాట, టీజర్, ట్రైలర్ వాటిని రెట్టింపు చేసేశాయి. తద్వారా ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కలుపుకుని రూ. 20.50 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ జరగడంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 21 కోట్లైంది. ఈ టార్గెట్‌ను కేవలం మూడు రోజుల్లోనే పూర్తి చేసిన ఈ మూవీ రికార్డు క్రియేట్ చేసింది.

13వ రోజు ఎక్కడ? ఎంత కలెక్ట్ చేసింది?

13వ రోజు ఎక్కడ? ఎంత కలెక్ట్ చేసింది?

13వ రోజు 'ఉప్పెన'కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. నైజాంలో రూ. 14 లక్షలు, సీడెడ్‌లో రూ. 8 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 12 లక్షలు, ఈస్ట్‌లో రూ. 6 లక్షలు, వెస్ట్‌లో రూ. 2.20 లక్షలు, గుంటూరులో రూ. 2.40 లక్షలు, కృష్ణాలో రూ. 2.60 లక్షలు, నెల్లూరులో రూ. 1.80 లక్షలు రాబట్టింది. మొత్తంగా పదమూడో రోజు రూ. 49 లక్షలు షేర్, రూ. 85 లక్షలు గ్రాస్ వచ్చింది.

 13వ రోజు అంతే.. మొత్తంగా వచ్చిందెంత?

13వ రోజు అంతే.. మొత్తంగా వచ్చిందెంత?

'ఉప్పెన' మొదటి రోజు రూ. 9.35 కోట్లు, 2వ రోజు రూ. 6.86 కోట్లు, 3వ రోజు రూ. 8.26 కోట్లు, 4వ రోజు రూ. 4.17 కోట్లు, 5వ రోజు రూ. 3.12 కోట్లు, 6వ రోజు రూ. 1.93 కోట్లు, 7వ రోజు రూ. 1.44 కోట్లు, 8వ రోజు రూ. 1.13 కోట్లు, 9వ రోజు రూ. 1.49 కోట్లు, 10వ రోజు రూ. 2.61 కోట్లు, 11వ రోజు రూ. 1.15 కోట్లు, 12వ రోజు రూ. 80 లక్షలు, 13వ రోజు రూ. 49 లక్షలతో మొత్తంగా రూ. 42.80 కోట్ల షేర్, రూ. 68.95 కోట్ల గ్రాస్ అందుకుంది.

ఇప్పటి వరకు ఎంత లాభం వచ్చిందో తెలిస్తే

ఇప్పటి వరకు ఎంత లాభం వచ్చిందో తెలిస్తే

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అదరగొట్టిన 'ఉప్పెన'.. 13 రోజుల్లో కర్నాటకతో పాటు రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.18 కోట్లు రాబట్టింది. అలాగే, ఓవర్సీస్‌లో రూ. 1.29 కోట్లు వసూలు చేసింది. దీంతో మొత్తంగా 13 రోజుల్లో 46.27 కోట్లు రాబట్టింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ 21 కోట్లు కాగా... ఇప్పటి వరకు రూ. 25.27 కోట్లు లాభాలను ఆర్జించింది. దీంతో డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X