Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్‌స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్‌మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్‌లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్‌లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
Uppena 14 Days Collections: రెండు వారాలకు రికార్డు బ్రేకింగ్ కలెక్షన్లు.. చరిత్ర సృష్టించిన వైష్ణవ్
తెలుగులో ప్రయోగాత్మక చిత్రాలను ప్రేక్షకులు ఇప్పుడిప్పుడే ఆదరిస్తున్నారు. అందుకే దర్శక నిర్మాతలతో పాటు హీరోలు కూడా అలాంటి సినిమాలు చేయడానికి ముందుకొస్తున్నారు. అయితే, ఓ రేంజ్ హీరోలు ఈ తరహా సినిమాలు చేసినా పెద్ద ఆశ్చర్యం అనిపించదు. అలాంటిది కొత్త హీరో ఇలాంటి మూవీతో పరిచయం అవ్వాలంటే పెద్ద సాహసమనే చెప్పాలి. ఇంత రిస్క్ చేసినా అది సక్సెస్ అవుతుందన్న గ్యారెంటీ లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన వైష్ణవ్ తేజ్ మాత్రం భారీ హిట్ అందుకుని సత్తా చాటాడు. రెండు వారాలకు రికార్డులు క్రియేట్ చేశాడు.
ఉప్పెన పుట్టింది ఇలాగే.. ఎవరెవరు చేశారు?
మెగా ఫ్యామిలీకి చెందిన వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అయిన చిత్రం 'ఉప్పెన'. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సన ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. అలాగే, కృతి శెట్టి కూడా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. వీళ్లతో పాటు విజయ్ సేతుపతి తొలిసారి తెలుగులో పూర్తి స్థాయి పాత్రను పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రానికి దేవీ సంగీతం అందించాడు.
హీరో ఫస్ట్ సినిమాకు భారీ టార్గెట్... పూర్తైంది
విడుదలకు ముందే 'ఉప్పెన' మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇలాంటి పరిస్థితుల్లో పాట, టీజర్, ట్రైలర్ వాటిని రెట్టింపు చేసేశాయి. తద్వారా ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కలుపుకుని రూ. 20.50 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ జరగడంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 21 కోట్లైంది. ఈ టార్గెట్‌ను కేవలం మూడు రోజుల్లోనే పూర్తి చేసిన ఈ మూవీ రికార్డు క్రియేట్ చేసింది.
14వ రోజు ఎక్కడ? ఎంత వసూలు చేసిందంటే
14వ రోజు 'ఉప్పెన'కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. నైజాంలో రూ. 10 లక్షలు, సీడెడ్‌లో రూ. 5 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 9 లక్షలు, ఈస్ట్‌లో రూ. 4 లక్షలు, వెస్ట్‌లో రూ. 1.40 లక్షలు, గుంటూరులో రూ. 1.70 లక్షలు, కృష్ణాలో రూ. 2 లక్షలు, నెల్లూరులో రూ. 1.10 లక్షలు రాబట్టింది. మొత్తంగా పద్నాలుగో రోజు రూ. 34 లక్షలు షేర్, రూ. 58 లక్షలు గ్రాస్ వచ్చింది.
రెండు వారాలకు కలిపి ఎంత కలెక్ట్ చేసిందంటే
'ఉప్పెన' మొదటి రోజు రూ. 9.35 కోట్లు, 2వ రోజు రూ. 6.86 కోట్లు, 3వ రోజు రూ. 8.26 కోట్లు, 4వ రోజు రూ. 4.17 కోట్లు, 5వ రోజు రూ. 3.12 కోట్లు, 6వ రోజు రూ. 1.93 కోట్లు, 7వ రోజు రూ. 1.44 కోట్లు, 8వ రోజు రూ. 1.13 కోట్లు, 9వ రోజు రూ. 1.49 కోట్లు, 10వ రోజు రూ. 2.61 కోట్లు, 11వ రోజు రూ. 1.15 కోట్లు, 12వ రోజు రూ. 80 లక్షలు, 13వ రోజు రూ. 49 లక్షలు, 14వ రోజు రూ. 34 లక్షలతో మొత్తంగా రూ. 43.16 కోట్ల షేర్, రూ. 69.55 కోట్ల గ్రాస్ అందుకుంది.
రికార్డు బ్రేకింగ్ కలెక్షన్లతో సత్తా చాటిన ఉప్పెన
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అదరగొట్టిన 'ఉప్పెన'.. 14 రోజుల్లో కర్నాటకతో పాటు రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.20 కోట్లు రాబట్టింది. అలాగే, ఓవర్సీస్లో రూ. 1.32 కోట్లు వసూలు చేసింది. దీంతో మొత్తంగా 14 రోజుల్లో 46.66 కోట్లు రాబట్టింది. అలాగే, రూ. 75 కోట్ల గ్రాస్‌ను అందుకుంది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ 21 కోట్లు కాగా... ఇప్పటి వరకు రూ. 25.66 కోట్లు లాభాలను ఆర్జించింది.
చరిత్ర సృష్టించిన వైష్ణవ్ తేజ్.. మొదటి సినిమా
హీరో పరిచయ సినిమాల్లో ఎక్కువ వసూళ్లు సాధించి 'ఉప్పెన' టాలీవుడ్లోనే మొదటి స్థానంలో నిలిచింది. రెండు వారాల వ్యవధిలో ఈ సినిమా ఎన్నో రికార్డులు బద్దలు కొట్టింది. ఇక, 14 రోజులు ముగిసిన తర్వాత కూడా నైజాంలో 128, సీడెడ్‌లో 60, ఆంధ్రాలో 175 థియేటర్లలో ప్రదర్శితమవుతూ సత్తా చాటుతోంది. తద్వారా మరింత ముందుకు దూసుకెళ్తోందీ సినిమా.