Don't Miss!
- News రైతు రుణమాఫీ చేస్తే పార్టీని రద్దు చేసుకుంటావా? హరీష్ కు రేవంత్ రెడ్డి ప్రతిసవాల్
- Lifestyle గాడిదపాలు అమ్మి కోట్ల వ్యాపారం.. లీటరు ధర రూ.7,000లు పైమాటే..!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Sports IPL 2024: హార్దిక్ పాండ్యా చెత్త కెప్టెన్సీనే ముంబై ఇండియన్స్ కొంపముంచింది: క్రీడా మంత్రి
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్‌మి 5G స్మార్ట్‌ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
Uppena 17 Days Collections: ఆదివారం రికార్డు బ్రేకింగ్ కలెక్షన్స్.. టాలీవుడ్ చరిత్రలోనే ఫస్ట్ మూవీ!
అంతా కొత్త వాళ్లే.. అయితేనేం ఎంతో అనుభవం ఉన్న వారిలా చేశారు. తద్వారా బడా నిర్మాణ సంస్థ తమపై వెచ్చించిన మొత్తానికి రెండింతలు లాభాలు తెచ్చి పెట్టారు. అంతేకాదు, తెలుగు సినీ ఇండస్ట్రీలో ఉన్న ఎన్నో రికార్డులను తిరగరాశారు. ఇదంతా చెప్పేది ఎవరి గురించే ఈ పాటికే మీకు అర్థమై ఉంటుంది. అవును.. 'ఉప్పెన' టీమ్ గురించే ఇదంతా. ప్రేక్షకుల ముందుకు వచ్చి దాదాపు మూడు వారాలు అవుతోన్న ఈ సినిమా హవాను చూపిస్తూనే ఉంది. ఇక, ఆదివారం రికార్డు బ్రేకింగ్ కలెక్షన్లు అందుకుని సరికొత్త చరిత్రను లిఖించుకుంది. ఆ వివరాలేంటో చూద్దాం పదండి!
మెగా పరిచయం.. రికార్డులతో దండయాత్ర
మెగా ఫ్యామిలీ నుంచి వచ్చే హీరో అంటే ఏ రేంజ్ అంచనాలు ఉంటాయో.. 'ఉప్పెన'తో వాటిని అందుకున్నాడు వైష్ణవ్ తేజ్. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సన తెరకెక్కించిన ఈ సినిమాతో కృతి శెట్టి కూడా ఎంట్రీ ఇచ్చింది. ఇక, విజయ్ సేతుపతి కీలక పాత్ర పోషించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించగా, దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఇది రికార్డులపై దండయాత్ర చేస్తోంది.
అనుమానాలకు పుల్‌స్టాప్... మూడో రోజే
'ఉప్పెన' మూవీపై ఆది నుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. తద్వారా ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కలుపుకుని రూ. 20.50 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. దీంతో ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 21 కోట్లైంది. అయితే, ఆరంభంలో మిక్స్డ్ టాక్ రావడంతో పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో టార్గెట్‌ను మూడు రోజుల్లోనే పూర్తి చేసిందీ సినిమా.
17వ రోజు ఎక్కడ ఎంత రాబట్టిందో తెలుసా?
3 వారంలోకి అడుగు పెట్టిన 'ఉప్పెన' జోరు మరింత ఎక్కువైంది. 17వ రోజు నైజాంలో రూ. 47 లక్షలు, సీడెడ్‌లో రూ. 26 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 18 లక్షలు, ఈస్ట్‌లో రూ. 16 లక్షలు, వెస్ట్‌లో రూ. 4.60 లక్షలు, గుంటూరులో రూ. 6.50 లక్షలు, కృష్ణాలో రూ. 6.70 లక్షలు, నెల్లూరులో రూ. 4 లక్షలు రాబట్టింది. మొత్తంగా 17వ రోజు రూ. 1.28 కోట్లు షేర్, రూ. 2.30 కోట్లు గ్రాస్ వచ్చింది.
17 రోజులకు మొత్తం ఎంత వసూలు చేసింది?
'ఉప్పెన' మొదటి రోజు రూ. 9.35 కోట్లు, 2వ రోజు రూ. 6.86 కోట్లు, 3వ రోజు రూ. 8.26 కోట్లు, 4వ రోజు రూ. 4.17 కోట్లు, 5వ రోజు రూ. 3.12 కోట్లు, 6వ రోజు రూ. 1.93 కోట్లు, 7వ రోజు రూ. 1.44 కోట్లు, 8వ రోజు రూ. 1.13 కోట్లు, 9వ రోజు రూ. 1.49 కోట్లు, 10వ రోజు రూ. 2.61 కోట్లు, 11వ రోజు రూ. 1.15 కోట్లు, 12వ రోజు రూ. 80 లక్షలు, 13వ రోజు రూ. 49 లక్షలు, 14వ రోజు రూ. 34 లక్షలు, 15వ రోజు రూ. 40 లక్షలు, 16వ రోజు రూ. 55 లక్షలు, 17వ రోజు రూ. 1.28 కోట్లతో మొత్తంగా రూ. 45.39 కోట్ల షేర్, రూ. 74.25 కోట్ల గ్రాస్ అందుకుంది.
ప్రపంచ వ్యాప్తంగా ఎంత? లాభాలు ఏ మేర?
ఏపీ, తెలంగాణలో అదరగొట్టిన 'ఉప్పెన'.. 17 రోజుల్లో కర్నాటకతో పాటు రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.28 కోట్లు రాబట్టింది. అలాగే, ఓవర్సీస్లో రూ. 1.35 కోట్లు వసూలు చేసింది. దీంతో మొత్తంగా 17 రోజుల్లో 49.02 కోట్లు రాబట్టింది. అలాగే, రూ. 79.30 కోట్ల గ్రాస్‌ను అందుకుంది. తద్వారా ఈ మూవీ బ్రేక్ ఈవెన్ 21 కోట్లు కాగా... ఇప్పటి వరకు రూ. 28.02 కోట్లు లాభాలను ఆర్జించింది.
టాలీవుడ్ చరిత్రలోనే ఫస్ట్ మూవీగా ఉప్పెన
వైష్ణవ్ తేజ్ నటించిన ఉప్పెన మూవీ 17వ రోజు అనూహ్యంగా రూ. కోటికి పైగా వసూలు చేసి సత్తా చాటింది. తద్వారా ఎన్నో రికార్డులను బద్దలు కొట్టింది. అంతేకాదు ఇప్పటి వరకూ 49.02 కోట్లు రాబట్టి.. ఫిబ్రవరి నెలలో విడుదలై.. భారీ కలెక్షన్లు అందుకున్న తెలుగు చిత్రాల జాబితాలో నిలిచింది. ప్రభాస్ నటించిన 'మిర్చి' సినిమా రూ. 48.50 కోట్లతో దీని తర్వాతి స్థానంలో ఉంది.