Uppena 19 Days Collections: మూడు వారలైనా తగ్గని కలెక్షన్ల ‘ఉప్పెన’.. రికార్డుకు చేరవలో వైష్ణవ్!
సాధారణంగా కొత్త హీరో పరిచయ సినిమా అంటే దానిపై ఎన్నో అంచనాలు ఉంటాయి. అతడి యాక్టింగ్ ఎలా ఉంది? డ్యాన్స్ ఎలా చేస్తున్నాడు? డైలాగ్స్ ఎలా చెబుతున్నాడు? ఫైట్స్ ఎలా చేస్తున్నాడు? ఇలా ఎన్నో రకాలుగా ప్రేక్షకులు గుచ్చి గుచ్చి చూస్తుంటారు. అందుకే హీరో లాంఛింగ్ మూవీలకు ఎక్కువ బజ్ ఏర్పడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో మెగా ఫ్యామిలీని నుంచి ఎంటరై.. ఒకే ఒక్క సినిమాలతో ఆ ప్రశ్నలన్నింటీకి సరైనా జవాబు ఇచ్చాడు పంజా వైష్ణవ్ తేజ్. అతడు నటించిన 'ఉప్పెన' భారీ కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఆ మూవీ 19 రోజుల రిపోర్టు మీకోసం!
Recommended Video

మొదటి సినిమాతోనే ఆకట్టుకున్న వైష్ణవ్ తేజ్
పంజా వైష్ణవ్ తేజ్ - కృతి శెట్టి జంటగా నటించిన చిత్రం 'ఉప్పెన'. బుచ్చిబాబు సన తెరకెక్కించిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి తొలిసారి ఫుల్ లెంగ్త్ రోల్ చేశాడు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చాడు. ఎన్నో అంచనాలతో విడుదలైన ఇది భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. మొదటి మూవీతోనే హీరో, హీరోయిన్లు ఆకట్టుకున్నారు.

మూడు రోజులకే లాభాల్లోకి.. మూడో వారంలో
విడుదలకు ముందే భారీ హైప్‌ను ఏర్పరచుకుంది 'ఉప్పెన'. అందుకు అనుగుణంగానే ఈ మూవీ బిజినెస్ కూడా రూ. 20.50 కోట్లు జరిగింది. దీంతో ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 21 కోట్లైంది. ఈ నేపథ్యంలో మొదట్లో మిక్స్‌డ్ టాక్‌ను తెచ్చుకున్న ఈ చిత్రం.. హిట్ అవుతుందా అని అంతా అనుకున్నారు. కానీ, ఈ టార్గెట్‌ను కేవలం మూడు రోజుల్లోనే ఛేదించి లాభాల బాట పట్టింది.

19వ రోజు ఎక్కడ? ఎంత? రాబట్టిందో తెలుసా?
19వ రోజు 'ఉప్పెన' కలెక్ష్లను పర్వాలేదనిపించాయి. మంగళవారం నైజాంలో రూ. 9 లక్షలు, సీడెడ్‌లో రూ. 7 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 4.10 లక్షలు, ఈస్ట్‌లో రూ. 3.50 లక్షలు, వెస్ట్‌లో రూ. 1.30 లక్షలు, గుంటూరులో రూ. 1.50 లక్షలు, కృష్ణాలో రూ. 1.60 లక్షలు, నెల్లూరులో రూ. 80 వేలు రాబట్టింది. మొత్తంగా 19వ రోజు ఈ మూవీకి రూ. 29 లక్షలు షేర్, రూ. 52 లక్షలు గ్రాస్ వచ్చింది.

19 రోజులకు మొత్తం ఎంత వసూలు చేసింది?
'ఉప్పెన' మొదటి రోజు రూ. 9.35 కోట్లు, 2వ రోజు రూ. 6.86 కోట్లు, 3వ రోజు రూ. 8.26 కోట్లు, 4వ రోజు రూ. 4.17 కోట్లు, 5వ రోజు రూ. 3.12 కోట్లు, 6వ రోజు రూ. 1.93 కోట్లు, 7వ రోజు రూ. 1.44 కోట్లు, 8వ రోజు రూ. 1.13 కోట్లు, 9వ రోజు రూ. 1.49 కోట్లు, 10వ రోజు రూ. 2.61 కోట్లు, 11వ రోజు రూ. 1.15 కోట్లు, 12వ రోజు రూ. 80 లక్షలు, 13వ రోజు రూ. 49 లక్షలు, 14వ రోజు రూ. 34 లక్షలు, 15వ రోజు రూ. 40 లక్షలు, 16వ రోజు రూ. 55 లక్షలు, 17వ రోజు రూ. 1.28 కోట్లు, 18వ రోజు రూ. 42 లక్షలు, 19వ రోజు రూ. 29 లక్షలతో మొత్తంగా రూ. 46.10 కోట్ల షేర్, రూ. 75.52 కోట్ల గ్రాస్ అందుకుంది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంత? లాభాలు ఏ రేంజ్?
రెండు రాష్ట్రాల్లో సత్తా చాటిన 'ఉప్పెన'.. 19 రోజుల్లో కర్నాటకతో పాటు రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.29 కోట్లు రాబట్టింది. అలాగే, ఓవర్సీస్‌లో రూ. 1.36 కోట్లు వసూలు చేసింది. దీంతో మొత్తంగా ఇప్పటి వరకు 49.78 కోట్లు రాబట్టింది. అలాగే, రూ. 80.56 కోట్ల గ్రాస్‌ను అందుకుంది. తద్వారా ఈ మూవీ బ్రేక్ ఈవెన్ 21 కోట్లు కాగా... ఇప్పటి వరకు రూ. 28.78 కోట్లు లాభాలను ఆర్జించింది.

రికార్డుకు అడుగు దూరంలో పంజా వైష్ణవ్ తేజ్!
మూడో వారంలో ఉన్నప్పటికీ 'ఉప్పెన' మూవీ ప్రభావం భారీగానే ఉందని చెప్పాలి. కొత్త సినిమాలు ఉన్నా దీనికి మంచి కలెక్షన్లే వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రస్తుతం ఈ సినిమా మొత్తంగా రూ. 49.78 కోట్లు వసూలు చేసి యాభై కోట్ల మైలురాయి వైపు దూసుకుపోతోంది. బుధవారంతో ఇది చేరుకునే అవకాశాలు ఉన్నాయి. ఇదే జరిగితే వైష్ణవ్ తేజ్ అరుదైన ఘనతను సాధిస్తాడు.


Click it and Unblock the Notifications











