Uppena 21 Days Collections: చరిత్ర సృష్టించిన ‘ఉప్పెన'..టాలీవుడ్‌లో ఏకైక హీరోగా వైష్ణవ్ రికార్డ్

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలు వస్తుంటాయి.. పోతుంటాయి. అయితే వాటిలో కొన్ని మాత్రమే భారీ విజయాలను అందుకుని ట్రెండ్ సెట్టర్‌లుగా నిలుస్తుంటాయి. అలాంటి వాటిలో 'ఉప్పెన' ఒకటి. మెగా ఫ్యామిలీ నుంచి కొత్త హీరో పంజా వైష్ణవ్ తేజ్ పరిచయం అవుతూ.. మూడు వారాల క్రితం విడుదలైన ఈ సినిమా అసాధారణ ఆదరణను అందుకుని సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ క్రమంలోనే ఎన్నో రికార్డులను తిరగరాసింది. ఈ క్రమంలోనే తాజాగా టాలీవుడ్‌లో సరికొత్త చరిత్రను సృష్టించింది. దీంతో సంచలనం నమోదైంది. ఆ వివరాలేంటో చూద్దాం పదండి!

Recommended Video

Uppena Success Meet : Director Buchi Babu Speech | Ram Charan | Vaishnav Tej
‘ఉప్పెన'తో మెగా లాంచ్ అయిన వైష్ణవ్ తేజ్

‘ఉప్పెన'తో మెగా లాంచ్ అయిన వైష్ణవ్ తేజ్

సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సన దర్శకత్వంలో మెగా ఫ్యామిలీకి చెందిన పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అయిన చిత్రం 'ఉప్పెన'. ఈ చిత్రం ద్వారా కృతి శెట్టి కూడా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. అలాగే, విజయ్ సేతుపతి నెగెటివ్ రోల్ చేశాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఈ సినిమాతో సరికొత్త చరిత్రను సృష్టించారంతా.

అలాంటి టాక్‌తో.. మూడు రోజులకే పూర్తైంది

అలాంటి టాక్‌తో.. మూడు రోజులకే పూర్తైంది


విడుదలకు ముందే ఉప్పెన మూవీ భారీ అంచనాలు ఏర్పరచుకుంది. తద్వారా ఈ మూవీ బిజినెస్ ప్రపంచ వ్యాప్తంగా రూ. 20.50 కోట్లు జరిగింది. రూ. 21 కోట్లు వసూలు చేస్తే హిట్ అయినట్లు లెక్క. ఇలాంటి పరిస్థితుల్లో ఈ చిత్రానికి మిక్స్‌డ్ టాక్ వచ్చింది. దీంతో ఈ సినిమా కలెక్షన్లపై ప్రభావం ఉంటుందనుకున్నారంతా. కానీ, ఊహించని విధంగా మూడు రోజుల్లోనే టార్గెట్ పూర్తయింది.

21వ రోజు ఎక్కడ? ఎంత? వసూలు చేసింది?

21వ రోజు ఎక్కడ? ఎంత? వసూలు చేసింది?


21వ రోజు 'ఉప్పెన' కలెక్ష్లను బాగా వచ్చాయి. గురువారం నైజాంలో రూ. 4 లక్షలు, సీడెడ్‌లో రూ. 3 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 2 లక్షలు, ఈస్ట్‌లో రూ. 1.80 లక్షలు, వెస్ట్‌లో రూ. 70 వేలు, గుంటూరులో రూ. 80 వేలు, కృష్ణాలో రూ. 1 లక్షలు, నెల్లూరులో రూ. 60 వేలు రాబట్టింది. మొత్తంగా 21వ రోజు ఈ సినిమాకు రూ. 14లక్షలు షేర్, రూ. 23 లక్షలు గ్రాస్ వచ్చింది.

21 రోజులకు కలిపి ఇది ఎంత రాబట్టిందంటే?

21 రోజులకు కలిపి ఇది ఎంత రాబట్టిందంటే?

'ఉప్పెన' మొదటి రోజు రూ. 9.35 కోట్లు, 2వ రోజు రూ. 6.86 కోట్లు, 3వ రోజు రూ. 8.26 కోట్లు, 4వ రోజు రూ. 4.17 కోట్లు, 5వ రోజు రూ. 3.12 కోట్లు, 6వ రోజు రూ. 1.93 కోట్లు, 7వ రోజు రూ. 1.44 కోట్లు, 8వ రోజు రూ. 1.13 కోట్లు, 9వ రోజు రూ. 1.49 కోట్లు, 10వ రోజు రూ. 2.61 కోట్లు, 11వ రోజు రూ. 1.15 కోట్లు, 12వ రోజు రూ. 80 లక్షలు, 13వ రోజు రూ. 49 లక్షలు, 14వ రోజు రూ. 34 లక్షలు, 15వ రోజు రూ. 40 లక్షలు, 16వ రోజు రూ. 55 లక్షలు, 17వ రోజు రూ. 1.28 కోట్లు, 18వ రోజు రూ. 42 లక్షలు, 19వ రోజు రూ. 29 లక్షలు, 20వ రోజు రూ. 21 లక్షలు, 21వ రోజు రూ. 14లక్షతో మొత్తంగా రూ. 46.45 కోట్ల షేర్, రూ. 76.13 కోట్ల గ్రాస్ అందుకుంది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంత? లాభాలు ఎలాగ?

ప్రపంచ వ్యాప్తంగా ఎంత? లాభాలు ఎలాగ?

తెలుగు రాష్ట్రాల్లో రాణించిన 'ఉప్పెన'.. 21 రోజుల్లో కర్నాటకతో పాటు రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.30 కోట్లు రాబట్టింది. అలాగే, ఓవర్సీస్‌లో రూ. 1.37 కోట్లు వసూలు చేసింది. దీంతో మొత్తంగా రూ. 50.12 కోట్లు రాబట్టింది. అలాగే, రూ. 81.30 కోట్ల గ్రాస్‌ను అందుకుంది. తద్వారా ఈ మూవీ బ్రేక్ ఈవెన్ 21 కోట్లు కాగా... ఇప్పటి వరకు రూ. 29.12 కోట్లు లాభాలను అందుకుంది.

చరిత్ర సృష్టించిన ‘ఉప్పెన'.. ఏకైక హీరోగా

చరిత్ర సృష్టించిన ‘ఉప్పెన'.. ఏకైక హీరోగా

ఇప్పటి వరకూ 'ఉప్పెన' విడుదలై మూడు వారాలు గడిచింది. మొత్తం 21 రోజుల్లో ఈ చిత్రం రూ. 50.12 కోట్లు వసూలు చేసింది. తద్వారా యాభై కోట్ల క్లబ్‌లో చేరిపోయి చరిత్ర సృష్టించింది. అదే సమయంలో మొదటి సినిమాతోనే రూ. 50 కోట్ల మార్క్ దాటిన ఏకైక తెలుగు హీరోగా పంజా వైష్ణవ్ తేజ్ రికార్డు నెలకొల్పాడు. గతంలో ఈ ఘనత రామ్ చరణ్ (చిరుత) పేరిట ఉండేది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X