Uppena 23 Days Collections: మళ్లీ పుంజుకున్న ఉప్పెన.. ఆ సినిమాలకు షాకిచ్చిన వైష్ణవ్ తేజ్

తెలుగు సినీ చరిత్రలో కొన్ని సినిమాలకు మాత్రమే ట్రెండ్ సెట్టర్లుగా ప్రత్యేకమైన గుర్తింపు దక్కుతుంది. ఇప్పటికే ఎన్నో చిత్రాలు ఈ జాబితాలో వచ్చి చేరాయి. ఈ క్రమంలోనే తాజాగా ప్యూర్ లవ్ స్టోరీతో వచ్చి ప్రేక్షకుల మద్దతుతో రికార్డు స్థాయిలో విజయాన్ని అందుకున్న మూవీ 'ఉప్పెన' కూడా అదే లిస్టులో చేరింది. హీరో పరిచయ సినిమానే అయినా.. యాభై కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన దీనిని తెలుగు ప్రేక్షకుల ఇంకా ఆదరిస్తూనే ఉన్నారు. తద్వారా రోజులు గడుస్తున్నా.. ప్రభావం మాత్రం తగ్గడం లేదు. ఇక, ఈ మూవీ 23 రోజలు బాక్సాఫీస్ రిపోర్టు మీకోసం!

ముదురు భామ అందాలు మాములుగా లేవు: మాల్దీవుల్లో బాలీవుడ్ హీరోయిన్ (ఫొటోలు)

అనుకున్న దాని కంటే ఎక్కువే ఆరంభమే

అనుకున్న దాని కంటే ఎక్కువే ఆరంభమే

మెగా ఫ్యామిలీ నుంచి పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అయిన చిత్రం 'ఉప్పెన'. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సన తెరకెక్కించిన ఈ చిత్రంతో కృతి శెట్టి కూడా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. అలాగే, విజయ్ సేతుపతి పూర్తి స్థాయి పాత్రను చేశాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఈ సినిమాతో కొత్త వాళ్లకు మంచి ఆరంభం దక్కింది.

అనుమానాలు పటాపంచలు చేస్తూ కంప్లీట్

అనుమానాలు పటాపంచలు చేస్తూ కంప్లీట్

'నీ కన్ను నీలి సముద్రం' అనే పాట, టీజర్, ట్రైలర్‌లు 'ఉప్పెన' సినిమాపై అంచనాలను పెంచేశాయి. ఫలితంగా ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా రూ. 20.50 కోట్లు వ్యాపారం జరిగింది. రూ. 21 కోట్లు టార్గెట్‌తో రిలీజ్ అయిన ఈ చిత్రానికి మిక్స్‌డ్ టాక్ వచ్చింది. దీంతో ఈ సినిమా కలెక్షన్లు కష్టమేనని అనుకున్నారంతా. కానీ, ఊహించని విధంగా మూడు రోజుల్లోనే టార్గెట్ పూర్తి చేసిందీ మూవీ.

23వ రోజు ఎక్కడ? ఎంత? వసూలు చేసింది?

23వ రోజు ఎక్కడ? ఎంత? వసూలు చేసింది?

23వ రోజు 'ఉప్పెన' మరోసారి పుంజుకుంది. శనివారం నైజాంలో రూ. 4 లక్షలు, సీడెడ్‌లో రూ. 2 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 1.80 లక్షలు, ఈస్ట్‌లో రూ. 1.90 లక్షలు, వెస్ట్‌లో రూ. 80 వేలు, గుంటూరులో రూ. 1 లక్ష, కృష్ణాలో రూ. 1.20 లక్షలు, నెల్లూరులో రూ. 60 వేలు రాబట్టింది. మొత్తంగా 23వ రోజు ఈ సినిమాకు రూ. 13లక్షలు షేర్, రూ. 22 లక్షలు గ్రాస్ వచ్చింది.

 23 రోజులకు కలిపి ఇది ఎంత రాబట్టిందంటే?

23 రోజులకు కలిపి ఇది ఎంత రాబట్టిందంటే?

'ఉప్పెన' మొదటి రోజు రూ. 9.35 కోట్లు, 2వ రోజు రూ. 6.86 కోట్లు, 3వ రోజు రూ. 8.26 కోట్లు, 4వ రోజు రూ. 4.17 కోట్లు, 5వ రోజు రూ. 3.12 కోట్లు, 6వ రోజు రూ. 1.93 కోట్లు, 7వ రోజు రూ. 1.44 కోట్లు, 8వ రోజు రూ. 1.13 కోట్లు, 9వ రోజు రూ. 1.49 కోట్లు, 10వ రోజు రూ. 2.61 కోట్లు, 11వ రోజు రూ. 1.15 కోట్లు, 12వ రోజు రూ. 80 లక్షలు, 13వ రోజు రూ. 49 లక్షలు, 14వ రోజు రూ. 34 లక్షలు, 15వ రోజు రూ. 40 లక్షలు, 16వ రోజు రూ. 55 లక్షలు, 17వ రోజు రూ. 1.28 కోట్లు, 18వ రోజు రూ. 42 లక్షలు, 19వ రోజు రూ. 29 లక్షలు, 20వ రోజు రూ. 21 లక్షలు, 21వ రోజు రూ. 14లక్షలు, 22వ రోజు రూ. 9 లక్షలు, 23వ రోజు రూ. 13 లక్షలతో మొత్తంగా రూ. 46.67 కోట్ల షేర్, రూ. 76.50 కోట్ల గ్రాస్ అందుకుంది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంత? లాభాలు ఎంతంటే?

ప్రపంచ వ్యాప్తంగా ఎంత? లాభాలు ఎంతంటే?

ఇప్పటి వరకూ తెలుగు రాష్ట్రాల్లో సత్తా చాటిన 'ఉప్పెన'.. 23 రోజుల్లో కర్నాటకతో పాటు రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.32 కోట్లు రాబట్టింది. అలాగే, ఓవర్సీస్‌లో రూ. 1.37 కోట్లు వసూలు చేసింది. దీంతో మొత్తంగా రూ. 50.36 కోట్లు షేర్.. రూ. 82 కోట్ల గ్రాస్‌ను అందుకుంది. తద్వారా ఈ మూవీ బ్రేక్ ఈవెన్ 21 కోట్లు కాగా... ఇప్పటి వరకు రూ. 29.36 కోట్లు లాభాలను అందుకుంది.

ఆ సినిమాలన్నింటికీ షాకిచ్చిన వైష్ణవ్ తేజ్

ఆ సినిమాలన్నింటికీ షాకిచ్చిన వైష్ణవ్ తేజ్

'ఉప్పెన' సినిమా విడుదలై మూడు వారాలు గడిచిపోయింది. ఈ గ్యాప్‌లో అల్లరి నరేష్ 'నాంది', నితిన్ 'చెక్', సందీప్ కిషన్ 'A1 ఎక్స్‌ప్రెస్' సహా ఎన్నో సినిమాలు విడుదల అయ్యాయి. ఇవి ఆయా చిత్రాల టాక్‌ను బట్టి కలెక్షన్లను అందుకుంటున్నాయి. ఈ వారం విడుదలై వాటిని మినహాయిస్తే.. గతంలో వచ్చి ఇప్పటికీ ప్రదర్శితమవుతోన్న చిత్రాలకు 'ఉప్పెన' గట్టి దెబ్బ కొట్టినట్లవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X