Don't Miss!
- Finance Jhunjhunwala News: కంపెనీలో 5 లక్షల షేర్లు కొన్న జున్‌జున్‌వాలా.. నష్టాల మార్కెట్లోనూ స్టాక్ ర్యాలీ..
- News ప్రచారం పక్కనపెట్టి గర్భిణీకి ప్రసవం.. దర్శి టీడీపీ అభ్యర్థికి హ్యాట్సాఫ్!!
- Lifestyle మామిడికాయ పచ్చడిని ఈజీగా ఇలా తయారు చేసుకోండి..
- Sports అనూహ్య ఘటనను ఎదుర్కొన్న రోహిత్ శర్మ
- Technology OnePlus Flip వన్‌ప్లస్ ఫ్లిప్ ఫోన్ కీలక వివరాలు లీక్... టెలిఫోటో కెమెరా సహా కీలక ఫీచర్లు..!
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్‌కు పండగే
Uppena 24 Days Collections: ఆదివారం అరుదైన ఘనతను అందుకున్న ఉప్పెన.. ఆ జాబితాలో మూడో స్థానం
తెలుగులో ఏడాదికి కొన్ని వందల సినిమాలు విడుదల అవుతుంటాయి. అయితే, వాటిలో కొన్ని మాత్రమే ప్రేక్షకుల నుంచి మెప్పును పొందుతుంటాయి. తద్వారా భారీ హిట్లుగా నిలుస్తుంటాయి. అలాంటి వాటిలో ఇటీవల విడుదలైన 'ఉప్పెన' ఒకటి. స్వచ్చమైన పల్లెటూరి ప్రేమకథతో రూపొందిన ఈ సినిమా సిక్సర్ల మీద సిక్సర్లు కొడుతూ సెంచరీ మార్కును దాటేసింది. నాలుగో వారంలోనూ మంచి కలెక్షన్లు అందుకుంటూ దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో ఆదివారం ఈ మూవీ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. తద్వారా మూడో స్థానంలో నిలిచింది. ఆ సంగతులు మీకోసం!
సరైన సినిమానే ఎంచుకున్న పంజా వైష్ణవ్ తేజ్
హీరోగా పరిచయం అయ్యే సినిమా అంటే కమర్షియల్ కథను ఎంచుకుంటారు. కానీ, వైష్ణవ్ తేజ్ మాత్రం ప్రేమ కథతో వచ్చాడు. అదే 'ఉప్పెన'. బుచ్చిబాబు సన తెరకెక్కించిన ఈ సినిమా ద్వారా కృతి శెట్టి కూడా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. అలాగే, విజయ్ సేతుపతి తొలిసారి పూర్తి స్థాయి పాత్రను చేశాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.
అనుమానాలకు పుల్‌స్టాప్.. మూడో రోజే కంప్లీట్
రిలీజ్‌కు ముందే భారీ హైప్ క్రియేట్ చేసుకున్న చిత్రం 'ఉప్పెన'. ఇందులోని 'నీ కన్ను నీలి సముద్రం' అనే పాట, టీజర్, ట్రైలర్లకు భారీ రెస్పాన్స్ రావడమే దీనికి కారణం. దీంతో ఈ చిత్రానికి రూ. 20.50 కోట్లు వ్యాపారం జరిగింది. రూ. 21 కోట్లు టార్గెట్‌తో రిలీజ్ అయిన ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ రావడంతో కలెక్షన్లు కష్టమేనని అనుకున్నారు. కానీ, మూడో రోజే టార్గెట్ ఫినీస్ చేసింది.
24వ రోజు ఏ ప్రాంతంలో? ఎంత? వచ్చిందంటే?
24వ రోజు 'ఉప్పెన' భారీగా పుంజుకుంది. ఆదివారం నైజాంలో రూ. 7 లక్షలు, సీడెడ్‌లో రూ. 3 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 4 లక్షలు, ఈస్ట్‌లో రూ. 3 లక్షలు, వెస్ట్‌లో రూ. 1.60 లక్షలు, గుంటూరులో రూ. 2.10 లక్షలు, కృష్ణాలో రూ. 2.30 లక్షలు, నెల్లూరులో రూ. 1 లక్షలు రాబట్టింది. మొత్తంగా 24వ రోజు ఈ సినిమాకు రూ. 24లక్షలు షేర్, రూ. 40 లక్షలు గ్రాస్ వచ్చింది.
24 రోజులకు కలిపి మొత్తం ఎంత రాబట్టిందంటే?
'ఉప్పెన' మొదటి రోజు రూ. 9.35 కోట్లు, 2వ రోజు రూ. 6.86 కోట్లు, 3వ రోజు రూ. 8.26 కోట్లు, 4వ రోజు రూ. 4.17 కోట్లు, 5వ రోజు రూ. 3.12 కోట్లు, 6వ రోజు రూ. 1.93 కోట్లు, 7వ రోజు రూ. 1.44 కోట్లు, 8వ రోజు రూ. 1.13 కోట్లు, 9వ రోజు రూ. 1.49 కోట్లు, 10వ రోజు రూ. 2.61 కోట్లు, 11వ రోజు రూ. 1.15 కోట్లు, 12వ రోజు రూ. 80 లక్షలు, 13వ రోజు రూ. 49 లక్షలు, 14వ రోజు రూ. 34 లక్షలు, 15వ రోజు రూ. 40 లక్షలు, 16వ రోజు రూ. 55 లక్షలు, 17వ రోజు రూ. 1.28 కోట్లు, 18వ రోజు రూ. 42 లక్షలు, 19వ రోజు రూ. 29 లక్షలు, 20వ రోజు రూ. 21 లక్షలు, 21వ రోజు రూ. 14లక్షలు, 22వ రోజు రూ. 9 లక్షలు, 23వ రోజు రూ. 13 లక్షలు, 24వ రోజు రూ. 24 లక్షలతో మొత్తంగా రూ. 46.91 కోట్ల షేర్, రూ. 76.90 కోట్ల గ్రాస్ అందుకుంది.
ప్రపంచ వ్యాప్తంగా ఎంత? లాభాలు ఏ రేంజ్లో?
రెండు
రాష్ట్రాల్లో
కలెక్షన్ల
సునామీ
సృష్టించిన
'ఉప్పెన'..
24
రోజుల్లో
కర్నాటకతో
పాటు
రెస్టాఫ్
ఇండియాలో
రూ.
2.35
కోట్లు
రాబట్టింది.
అలాగే,
ఓవర్సీస్లో
రూ.
1.38
కోట్లు
వసూలు
చేసింది.
దీంతో
మొత్తంగా
రూ.
50.64
కోట్లు
షేర్..
రూ.
82.50
కోట్ల
గ్రాస్‌ను
అందుకుంది.
తద్వారా
ఈ
మూవీ
బ్రేక్
ఈవెన్
21
కోట్లు
కాగా...
ఇప్పటి
వరకు
రూ.
29.64
కోట్లు
లాభాలను
అందుకుంది.
ఆ సినిమాల జాబితాలో మూడో స్థానం సొంతం
'ఉప్పెన'
సినిమా
విడుదలై
మూడు
వారాలు
గడిచిపోయింది.
అయినప్పటికీ
కలెక్షన్లను
సాధిస్తూనే
ఉంది.
ఆదివారంతో
29.64
కోట్ల
లాభాలను
అందుకున్న
ఈ
చిత్రం
బిజినెస్
(రూ.
20.50
కోట్లు)తో
చూసుకుంటే
రూ.
30
కోట్ల
ప్రాఫిట్స్
సాధించింది.
తద్వారా
ఈ
మార్కును
చేరుకున్న
చిత్రాల
జాబితాలో
మూడో
స్థానానికి
చేరింది.
దీని
కంటే
ముందు
'గీత
గోవిందం',
'ఫిదా'
ఉన్నాయి.