Don't Miss!
- Sports SRH Playing XI: అతనిపై వేటు..RCBతో తుది జట్టు ఇదే!
- News Telangana: బుధవారం నుంచే సమ్మర్ హాలీడేస్..
- Finance Banking News: ప్రభుత్వ బ్యాంకులకు ఆ అధికారం లేదు.. బాంబే హైకోర్టు సంచలన తీర్పు..
- Automobiles వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- Technology అద్భుతమైన డిజైన్ తో నోకియా కొత్త ఫోన్ Nokia N90 Flip ! వివరాలు
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
Uppena 26 Days Collections: నాలుగో వారంలోనూ ఊహించని ‘ఉప్పెన’.. వాళ్లకు షాకిచ్చేలా ష్ణవ్ తేజ్ హవా
తెలుగు సినీ ఇండస్ట్రీలోనే కొన్ని చిత్రాలకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. దీనికి ఎన్నో కారణాలు ఉంటాయి. అందులో హీరో లాంఛింగ్ మూవీలకు మరికొంత ఎక్కువ హైప్ క్రియేట్ అవుతూ ఉంటుంది. అందులోనూ మెగా ఫ్యామిలీకి చెందిన హీరో పరిచయం అంటే మాములు అంచనాలు ఉండవు. ఇలాంటి పరిస్థితుల్లో 'ఉప్పెన' అనే చిత్రంతో టాలీవుడ్‌కు హీరోగా పరిచయం అయ్యాడు పంజా వైష్ణవ్ తేజ్. మొదటి సినిమాతోనే రికార్డులు క్రియేట్ చేసి తనదైన మార్కును నమోదు చేసుకున్నాడు. నాలుగో వారంలోనూ దూసుకుపోతోన్న ఈ సినిమా 26 రోజుల రిపోర్టు మీకోసం!
కన్నడ బ్యూటీ అషికా రంగనాథ్ హాట్ వర్కౌట్ ఫొటోలు
కొత్త వాళ్లైన ధైర్యం చేశారు.. భారీ హిట్ కొట్టారు
పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా.. కృతి శెట్టి హీరోయిన్గా నటించి పరిచయం అయిన చిత్రం 'ఉప్పెన'. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సన తెరకెక్కించిన ఈ సినిమాలో కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి తొలిసారి పూర్తి స్థాయి పాత్రను చేశాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. కొత్త వాళ్ల కాంబోలో వచ్చిన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ అయింది.
భారీ టార్గెట్.. మూడో రోజే కంప్లీట్ చేసేసిందిగా
ఎన్నో కారణాల వల్ల 'ఉప్పెన'కు రిలీజ్‌కు ముందే భారీ హైప్ క్రియేట్ అయింది. మరీ ముఖ్యంగా ఇందులోని 'నీ కన్ను నీలి సముద్రం' అనే పాట, టీజర్, ట్రైలర్లకు భారీ రెస్పాన్స్ రావడంతో ఈ చిత్రానికి రూ. 20.50 కోట్లు వ్యాపారం జరిగింది. రూ. 21 కోట్లు టార్గెట్‌తో రిలీజ్ అయిన ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ రావడంతో కలెక్షన్లు కష్టమేనని అనుకున్నా.. మూడో రోజే టార్గెట్ ఫినీస్ చేసింది.
26వ రోజు ఏ ప్రాంతంలో? ఎంత? వచ్చిందంటే?
26వ రోజు 'ఉప్పెన' బాగానే రాబట్టింది. మంగళవారం నైజాంలో రూ. 2 లక్షలు, సీడెడ్‌లో రూ. 1.40 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 2 లక్షలు, ఈస్ట్‌లో రూ. 1.60 లక్షలు, వెస్ట్‌లో రూ. 70 వేలు, గుంటూరులో రూ. 80 వేలు, కృష్ణాలో రూ. 90 వేలు, నెల్లూరులో రూ. 40 వేలు రాబట్టింది. మొత్తంగా 26వ రోజు ఈ సినిమాకు రూ. 10 లక్షలు షేర్, రూ. 18 లక్షలు గ్రాస్ వచ్చింది.
26 రోజులకు కలిపి మొత్తం ఎంత రాబట్టిందంటే?
'ఉప్పెన' మొదటి రోజు రూ. 9.35 కోట్లు, 2వ రోజు రూ. 6.86 కోట్లు, 3వ రోజు రూ. 8.26 కోట్లు, 4వ రోజు రూ. 4.17 కోట్లు, 5వ రోజు రూ. 3.12 కోట్లు, 6వ రోజు రూ. 1.93 కోట్లు, 7వ రోజు రూ. 1.44 కోట్లు, 8వ రోజు రూ. 1.13 కోట్లు, 9వ రోజు రూ. 1.49 కోట్లు, 10వ రోజు రూ. 2.61 కోట్లు, 11వ రోజు రూ. 1.15 కోట్లు, 12వ రోజు రూ. 80 లక్షలు, 13వ రోజు రూ. 49 లక్షలు, 14వ రోజు రూ. 34 లక్షలు, 15వ రోజు రూ. 40 లక్షలు, 16వ రోజు రూ. 55 లక్షలు, 17వ రోజు రూ. 1.28 కోట్లు, 18వ రోజు రూ. 42 లక్షలు, 19వ రోజు రూ. 29 లక్షలు, 20వ రోజు రూ. 21 లక్షలు, 21వ రోజు రూ. 14లక్షలు, 22వ రోజు రూ. 9 లక్షలు, 23వ రోజు రూ. 13 లక్షలు, 24వ రోజు రూ. 24 లక్షల, 25వ రోజు రూ. 13 లక్షలు, 26వ రోజు రూ. 10 లక్షలతో మొత్తంగా రూ. 47.14 కోట్ల షేర్, రూ. 77.33 కోట్ల గ్రాస్ అందుకుంది.
ప్రపంచ వ్యాప్తంగా ఎంత? లాభాలు ఏ రేంజ్లో?
రెండు రాష్ట్రాల్లో కలెక్షన్ల సునామీ సృష్టించిన 'ఉప్పెన'.. 26 రోజుల్లో కర్నాటకతో పాటు రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.35 కోట్లు రాబట్టింది. అలాగే, ఓవర్సీస్లో రూ. 1.38 కోట్లు వసూలు చేసింది. దీంతో మొత్తంగా రూ. 50.87 కోట్లు షేర్.. రూ. 83.50 కోట్ల గ్రాస్‌ను అందుకుంది. తద్వారా ఈ మూవీ బ్రేక్ ఈవెన్ 21 కోట్లు కాగా... ఇప్పటి వరకు రూ. 29.87 కోట్లు లాభాలను అందుకుంది.
ఆ సినిమాల జాబితాలో మూడో స్థానం సొంతం
'ఉప్పెన' సినిమా విడుదలై నాలుగో వారంలోకి అడుగు పెట్టేసింది. అయినప్పటికీ కలెక్షన్లను సాధిస్తూనే ఉంది. ఈ మధ్యలో అల్లరి నరేష్ 'నాంది', నితిన్ నటించిన 'చెక్', సందీప్ కిషన్ 'ఏ1 ఎక్స్‌ప్రెస్' సహా ఎన్నో చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. దీంతో ఈ సినిమా థియేటర్లు తగ్గాయి. ఇలాంటి పరిస్థితుల్లోనూ ఏవరేజ్‌గా రోజుకు రూ. 10 లక్షలు వసూలు చేస్తూ సత్తా చాటుతోంది ఉప్పెన.